రైతు సంఘాల నిరసనలకు మద్దతు | పౌర హక్కుల సంఘం

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాల రద్దుకై ఉద్యమిస్తున్న రైతు సంఘాల పిలుపు మేరకు 26 జనవరి,2021 ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ...
ఢిల్లీ బహదూర్ గర్ -టిక్రి సరిహద్దులో ఉన్న రైతు సంఘాల  ప్రతినిధులతో పాటు, రేపటి26,జనవరి,2021రైతుల ట్రాక్టర్ ర్యాలీ కి తరలి వస్తున్న ఉత్తర భారత రైతాంగం, యువకులు,ప్రజలు మరియు ప్రజాస్వామిక వాదులతో పౌరహక్కుల సంఘము, తెలంగాణ&ఆంధ్రప్రదేశ్-CDRO ప్రతినిధులు.

రాత్రి 8:30,25-1-2021.
 బహదూర్ గర్-టిక్రి ఢిల్లీ సరిహద్దులో.

నూతన మూడు వ్యవసాయ చట్టాల రద్దుకై 26,జనవరి2021జరిగే ట్రాక్టర్ల ర్యాలీకి CDRO సంపూర్ణ మద్దతు.కేంద్ర ప్రభుత్వం బేషరతుగా చట్టాలు ఉపసంహరించుకోవాలి... CDRO.
*************************************
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాల రద్దుకై ఉద్యమిస్తున్న రైతు సంఘాల పిలుపు మేరకు 26 జనవరి,2021 ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొనడానికి మరియు రైతాంగం చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలపడానికి CDRO(Co ordination of Democratic Rights Organisation) ఆధ్వర్యంలో 25,26 మరియు 27 జనవరి,2021 తేదీలలో ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమ ప్రాంతానికి CDRO లోని సభ్య సంఘాలు అయిన పౌర హక్కుల సంఘం,తెలంగాణ&ఆంధ్రప్రదేశ్, CPDR తమిళనాడు, APDR వెస్ట్ బెంగాల్, AFDR పంజాబ్, PUDR ఢిల్లీ 20ప్రతినిదులు మంది పాల్గొన్నారు.ఈరోజు ఉదయం నుండి, టిక్రి బోర్డర్లో రైతు ఉద్యమ కార్యాచరణను పరిశీలించినాము. 16,నవంబర్2020న CDRO రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, రైతు ఉద్యమానికి మద్దతు తెలిపి ఈరోజు ప్రత్యక్షంగా ప్రపంచ చరిత్రలోనే చారిత్రాత్మక మైన రైతు ఉద్యమంలో ప్రత్యక్ష మద్దతు తెలపడానికి CDRO 25 జనవరి,2021 ఉదయం నుండే బహదూర్ గర్,టిక్రి బోర్డర్ల్లో తిరిగింది. ఈరోజు ఢిల్లీలో పూర్తిగా సాయుధ బలగాలను ప్రభుత్వం మోహరించి, రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో, ఢిల్లీ వీధిలలో,మెట్రో స్టేషన్ల లో సోదాలు చేస్తూ ప్రజానికాన్ని భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఇప్పటికే సుమారు రెండున్నర లక్షల ట్రాక్టర్లు, వేలాదిగా జీబులు, మినీ వ్యానులు, కార్లు,ఢిల్లీ సరిహద్దుల్లోకి వచ్చినాయని రైతునాయకులు తెలిపినారు. అంచనాలకు మించి యువకులు హర్యానా, పంజాబ్,ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి చేరుకున్నారు. CDRO బృందం,  భగతసింగ్ మేనల్లుడైన ప్రొఫెసర్ జగ్మోహన్ సింగ్ ,AFDR-ప్రీత్ పాల్ సింగ్, NK జీత్ లతో కలిసి రైతు నాయకులతో మాట్లాడి  వివరాలు సేకరించినాము.
మూడు నూతన వ్యవసాయ చట్టాలు బేషరతుగా రద్దుచేయాలని,కనీస మద్దతు ధర చట్టం చేయాలని మరియు విద్యుత్ సవరణ చట్టం రద్దుచేయాలని తెలిపినారు.11 సార్లు జరిగిన చర్చలలో ప్రభుత్వం చట్టాల రద్దును పరిగణలోకి తీసుకోకుండా రైతుఉద్యమంపై తీవ్రమైన నిర్బందాన్ని అమలుచేసిందని,తన అనుకూల మీడియా ద్వారా రైతు చట్టాలు రైతులకు ఉపయోగకరమైనవని విషప్రచారాన్ని  చేసిందని,  సుప్రీంకోర్టు ద్వారా చట్టాల అమలుపై స్టే ఇవ్వడం, కమిటీ నలుగురు సభ్యులతో ఏర్పాటు చేయాడం కుట్రని వివరించారు. రాత్రి 8:30గంటల సమయంలో
ఢిల్లీ బహదూర్ గర్ -టిక్రి సరిహద్దులో ఉన్న రహదారిపై CDRO ప్రతినిధులు  రైతు సంఘాల  ప్రతినిధులతో పాటు, రేపటి26,జనవరి,2021రైతుల ట్రాక్టర్ ర్యాలీ కి తరలి వస్తున్న ఉత్తర భారత రైతాంగం, యువకులు,ప్రజలు మరియు ప్రజాస్వామిక వాదులతో మాట్లాడినారు.రేపటి ర్యాలీ సుమారు మూడు రోజుల వరకు కొనసాగుతుందని,తదుపరి కార్యాచరణ,కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పై ఆధారపడి ఉద్యమ కార్యాచరణ తీవ్రత ఉంటుందని అంతిమంగా చట్టాలు రద్దు అయ్యేంత వరకు ఢిల్లీ నుండి కదిలేది లేదని చెప్పినారు.రేపటి కార్యక్రమంలో పాల్గొనడానికి మరియు సమన్వయం  రైతు నాయకులు,తీరిక లేకుండా ఉన్నారు.
CDRO 20 మంది ప్రతినిధుల బృందంలో పాల్గొన్న ఉభయ తెలుగు రాష్ట్రాల పౌర హక్కుల సంఘం నాయకులు.
1.చిలుకా చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి,పౌర హక్కుల సంఘం,ఆంధ్రప్రదేశ్.
2.N. నారాయణరావు, ప్రధాన కార్యదర్శి.పౌర హక్కుల సంఘం,తెలంగాణ.
3.మాదన కుమారస్వామి,
 సహాయ కార్యదర్శి,పౌర హక్కుల సంఘం,తెలంగాణ.
4.GAV. ప్రసాద్,అధ్యక్షుడు, పౌర హక్కుల సంఘం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
5.బొడ్డుపెల్లి రవి,EC మెంబర్, పౌర హక్కుల సంఘం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
6.పోగుల రాజేశం,EC మెంబర్, పౌర హక్కుల సంఘం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
7.కడ రాజయ్య,EC మెంబర్, పౌర హక్కుల సంఘం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
8.మోటపలుకుల వెంకట్,EC మెంబర్, పౌర హక్కుల సంఘం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.

 పౌరహక్కుల సంఘము, తెలంగాణ&ఆంధ్రప్రదేశ్-CDRO.

రాత్రి 11:20,25-1-2021.
 బహదూర్ గర్-టిక్రి ఢిల్లీ సరిహద్దులో.

Comments