పత్రికాప్రకటన
------------------------
కులానిర్ములానా పోరాట సమితి (KNPS) రాష్ట్ర అధ్యక్షులు దుడ్డు ప్రభాకర్ అక్రమ అరెస్టును ఖందించండి.
*పౌర హక్కుల సంఘం*
మరియు *ప్రజా సంఘాలు*
----------------------------------
కుల నిర్మూలనా పోరాట సమితి(KNPS) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దుడ్డు ప్రభాకర్ గారిని ఈరోజు ఉదయం 8 గంటలకు విజయవాడలోని తమ ఇంటి నుండి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.పిడుగురాళ్ల పోలిస్ లమని చెప్పి, ఏదో కేస్ ఉందని చెప్పి తీసుకెళ్లారు.కుటుంబ సభ్యులను వెంట రానివ్వలేదు ఇంట్లో పుస్తకాలు , ఇతర వస్తువులు కూడా తీసుకెళ్లారు. దీన్ని *పౌర హక్కుల సంఘం* తీవ్రంగా ఖండిస్తున్నది.
గత నెల రోజులుగా AP లో జగన్ ప్రభుత్వం ప్రజాసంఘాల నాయకులను టార్గెట్ చేసి ఇప్పటికి 10మందిని అరెస్ట్ చేసింది. *ఉపా* లాంటి నల్ల చట్టాలను ప్రయోగించి *దేశద్రోహం* కేసులు పెట్టి జైల్లో నిర్భందించడం ప్రజాస్వామ్యమా?
రాజన్న రాజ్యం అంటే ఇదేనా? వీరు ఎట్లా దేశద్రోహులో, వీరు చేసిన ద్రోహమేమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.ప్రజలపై నిర్భంధం ప్రయోగించి ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేసిన నియంతలు చరిత్రలో ఏమయ్యారో ఒక సారి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాము. దీనిపై ప్రజా ప్రతినిధులు స్పందించి ఈ అక్రమ అరెస్తులను ఆపలని, అరెస్ట్ చేసిన వారందరిని బేషరతుగా విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం.
Comments
Post a Comment