*పత్రికా ప్రకటన*
గత డిసెంబర్ 31వ తేదీన *ఆదోని* నందు కుల దురహంకారానికి *ఆడంస్మిత్* అలియాస్ బుడ్డన్న అనే దళిత యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పై *పౌర హక్కుల సంఘం* (CLC ) నిజ నిర్ధారణ కమిటీ గా ఏర్పడి మృతుని కుటుంబాన్ని, భార్యను, తల్లి తండ్రులను కలసి వాస్తవాలను సేకరించింది. కమిటీ నివేదికను క్రింది విధంగా ప్రకటిస్తున్నాం
కర్నూల్ జిల్లా నందవరం మండలం గురజాల గ్రామంనకు చెందిన 25 ఏళ్ల మహేశ్వరి అనే కురవ కులానికి చెందిన ( B.C, B.SC.),మరియు ముప్పై ఏళ్ల బు డ్డన్న ( మాదిగ) ఒకే ఊరి వాళ్ళు. ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. పెద్దలను, ఊరి కట్టుబాట్లను ఎదిరించే ధైర్యం లేక హైదరబాద్ ఆర్య సమాజ్ లో డిసెంబర్ 1 న పెళ్లి చేసుకున్నారు. కర్నూలు కు వచ్చి,S.P. కి, ఎమ్మిగనూరు రూరల్ C.I. కి, నందవరం S.I కి రక్షణ కోసం విజ్ఞప్తి చేశారు.పోలీస్ స్టేషన్ నందు ఇరువురి కుటుంబాలకు చెందిన కుటుంబాలకు కౌన్సిలింగ్ డిసెంబర్ 2వ తేదీన ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్ నందు జరింగింది. S.I. ఎదురుగానే మహేశ్వరి తండ్రి, పెద్ద నాన్న ' మా ఊరికి వస్తే చంపుతామని ' ఎక్కడైనా దూరంగా బతక మని హెచ్చరించారు. గ్రామ పెత్తం దార్లు, ( రెడ్లు) రాయబారం నెరిపారు. నవ దంపతులు కలిసి బకుతుతామని చెప్పారు. ఊరు విడిచి, ఆదోని కి వచ్చి, B.P.T తో ఫిజీయో థెరపిస్ట్ డాక్టరు గా ప్రాక్టీసు చేసుకుంటూ జీవనం ప్రారంభించారు. అమ్మాయి తల్లిదండ్రుల తరుపున గ్రామ రెడ్లు, ఆదోని కో దంపతుల ఇంటికి వెళ్లి, విడి పోండని సలహా ఇచ్చారు. మార్మికంగా హెచ్చరించారు.
25 ఏళ్లు పెంచిన తల్లిదండ్రులు ఇంతటి దుస్సాహసానికి తెగబడరని ఎక్కడో ధైర్యం. అయినా జరగ కూడని ది జరిగిపోయింది. నాన్న, పెద నాన్న మరో ఇద్దరు డిసెంబర్ - 31 న మధ్యాహ్నం 3 గం. ల సమయంలో రాత్రి New year Day celebrations కొరకు కేక్ తీసుకొని బైక్ పై వెళ్తున్న డాక్టర్ అల్లుడిని ఆటకాయించి, తలపై బండ రాళ్లతో మోది, చంపేశారు. తమ కుల దురహంకారాన్ని చాటుకుని, కూతురు నూతన జీవితాన్ని నాశనం చేశారు.గురజాల గ్రామంలో 300 కుటుంబాలు కురువలు, 70 కుటుంబాలు మాదిగలు, 100 వరకు ఇతర కులాలకు చెందిన కుటుంబాల వాళ్ళు బతుకుతున్న గురజాల గ్రామంలో గతంలో కులాంతర వివాహాలు జరిగినప్పటికీ ఏ నాడు ఇంతటి దారుణం జరుగలేదు.గతంలో SC లపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేఖంగా పోరాడిన చరిత్ర ఈ కుటుంబానికి ఉన్నది.
ఈ జంటను విడదీయదానికి గ్రామ అగ్ర వర్ణ పెత్తం దార్లు పలు ప్రయత్నాలు చేశారు. ఇంటికి వెళ్లి పంచాయితీ పేరుతో జంటను బెదిరింపులు కూడ ఇచ్చారు. పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యం కూడ స్పష్టంగా కనుబడుతున్నది. నందవరం SI పైన కూడ మృతుని బంధువులకు అనుమానం ఉన్నది. ఈ కుల దూరహంకార హత్య వెనుక పెద్ద కుట్ర ఉందని కుటుంబీకులు మా కమిటీ కి చెప్పారు. ఈ హత్యకు కుట్ర పన్నిన ప్రధాన సూత్రధారులైన ఇంకా కొద్దీ మంది అగ్రవర్ణ పెత్తందార్ల పై నిందితులగా CASE నమోదు చేయాలన్నది ఆడమ్ స్మిత్ కుటుంబ్బీకుల ప్రధాన డిమాండ్. కేవలం ఇద్దరినీ నిందితులని ముద్దాయిలుగా చూయించి చేతులు దులుపు కొని, CASE ను నీరు గార్చు తున్నారని కుటుంబ సభ్యులు అభి ప్రాయ పడుతున్నారు. *ఇంతవరుకు జిల్లా కలెక్టర్, జిల్లా SP, ఇంకా అధికార యంత్రాంగం కనీశంగా గ్రామాన్ని, కుటుంబాన్ని సందర్శించ లేదు. SC/ST POA ప్రకారం *SC ప్రజలు ఇలాంటి అత్యా చారాలకు గురయినా జిల్లా యంత్రాంగం చట్ట పరమైన చర్యలతో పాటు ఆ గ్రామాన్ని సందర్శించాలి*. *కుటుంబానికి తక్షణ సహాయం అందించాలి. కానీ జిల్లా యంత్రాంగం SC/ST అత్యాచార నిరోధక చట్టాలను నిర్లక్ష్యం చేస్తున్నారు*. కరోనా తో మరణించిన 'చల్లా రామకృష్ణ రెడ్డి 'కుటుంబాన్ని పరామర్శించ డానికి ఉన్న వెసులు బాటు, ఆడమ్ స్మిత్ కుటుంబాన్ని పరామర్శ చేయ డానికి కలెక్టర్ /జాయింట్ కలెక్టర్ కు లేకపోవడం వీరి నిర్లక్ష్య ధోరణికి పరాకాష్ట.
*డిమాండ్స్*
*
1. *ఈ ఘటన పై జ్యుడిషియల్ విచారణ, HIGH COURT న్యాయ మూర్తి చే జరిపించాలి*.
2 *మృతుని కుటుంబం కోరినట్లు ఇతరులను ముద్దాయిలుగా చేర్చి, వారిని వెంటనే అరెస్ట్ చేయాలి*
3 *.మృతుని భార్యకు వెంటనే SC/ST చట్టం ప్రకారం ఉద్యోగం ఇవ్వాలి*
4. *కుటుంబానికి ఐదు ఎకరాలు భూమి మంజూరు చేయాలి* .
ఈ నిజానిర్ధారణ కమిటీ లో లో పౌర హక్కుల సంఘం, కులనిర్మూలన పోరాట సమితి, డెమోక్రాటిక్ టీచర్స్ ఫెడరేషన్, PDSU, , B.C. సంఘం నిజ నిర్ధారణలో పాల్గొన్నాయి .
: ********************
*C. వెంకటేశ్వరులు*
రాష్ట్ర సహాయ కార్యదర్శి
*S. అల్లా బకాష్*
జిల్లా కార్యదర్శి
పౌర హక్కుల సంఘం
*K . వెంకటేష్*
జిల్లా అధ్యక్షుడు
పౌరహక్కుల సంఘం
.
Comments
Post a Comment