ఉద్యమంలో హింసకు ప్రభుత్వానిదే భాద్యత | పౌర హక్కుల సంఘం

శాంతియుత రైతాంగ ఉద్యమం లో ఢిల్లీ పోలీస్ కాల్పుల్లో ఉద్యమ కారుని మృతికి మోడీ ప్రభుత్వంమే బాధ్యత వహించాలి.

శాంతియుతంగా జరుగుతున్న ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో,ఉద్యమకారులపై మోడీ BJP ప్రభుత్వం ఈరోజు 26,జనవరి,2021 ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా జరిపిన పోలీస్ కాల్పుల్ని పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ కాల్పులపై న్యాయ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. మోడీ BJP ప్రభుత్వ నియంతృత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. చనిపోయిన రైతు ఉద్యమకారునికి, మధ్యప్రదేశ్ మందసర్ లో జులై2016 మద్దతు ధర కోసం ఆందోళన చేస్తున్న రైతులపై మధ్యప్రదేశ్ BJP శివ రాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం అత్యంత కిరాతకంగా పోలీస్ కాల్పుల్లో ఆరుగురు రైతులను చంపివేసి, ఒక్కొక్క కుటుంబానికి ఒక కోటి రూపాయల ఎక్సగ్రేషియా మరియు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినట్లు గానే, ఇవాళ్టి 26-1-2021 కాల్పుల్లో మరణించిన ఢిల్లీ రైతు ఉద్యమ కారుని కుటుంబానికి ఇవ్వాలని పౌర హక్కుల సంఘం డిమాండ్  చేస్తుంది.

1.చిలుకా చంద్రశేఖర్,ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ .
2.N. నారాయణరావు,ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం,తెలంగాణ.
3.మాదన కుమారస్వామి,సహాయ కార్యదర్శి, పౌర హక్కుల సంఘం,తెలంగాణ.
సాయంత్రం 6:37,,26,జనవరి,2021.
టిక్రి బోర్డర్, ఢిల్లీ..

Comments