ఉపాను వ్యతిరేకిస్తూ రాష్ట్ర స్థాయి సభ | గుంటూరు

ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులకు  నిరసనగా 23/01/2021 న గుంటూరు నగరం కొరటాల మీటింగ్ హాల్లో "ఉపా" చట్టం రద్దు పోరాట కన్వీనర్ మరియు పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్ర శేఖర్  అధ్యక్షతన  జరుగుతున్న బహిరంగ సభ...ఈ సభలో  తెలంగాణ,ఆంధ్ర రాష్ట్రాల చైతన్య మహిళా సంఘం కన్వీనర్ బన్నూర్ జ్యోతి,ఇఫ్టు జాతీయ కార్యదర్శి ప్రసాద్,ఐలూ  జాతీయ ఉపాధ్యక్షులు సంకర రాజేంద్ర ప్రసాద్,cpi రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు,ప్రగతి శీల మహిళా సంఘం నాయకురాలు గంగాభవాని,పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమన్నారాయణ,CMS నాయకురాలు రాధ,IAPL నాయకులు పిచ్చుక శ్రీనివాస్,విరసం నాయకులు అరసవెల్లి కృష్ణ, కులనిర్మూలన పోరాట సమితి నాయకులు కృష్ణ,OPDR నాయకులు హనుమంతరావు తదితర  ప్రజాసంఘాల నాయకులు పాల్గొని అక్రమంగా అరెస్ట్ చేసిన ప్రజా సంఘాల నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు...ఈ సభలో పెద్ద ఎత్తున ప్రజలు,ప్రజాస్వామిక వాదులు పాల్గొన్నారు...

Comments