ఉపా చట్టాన్ని రద్దు చేయాలి | నెల్లూరు జిల్లా


కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మేధావుల పైన ప్రొఫెసర్ల పైన *ఉపా చట్టం*,( చట్ట వ్యతిరేక కార్యకలాపాలా నిరోధక చట్టం ) ప్రయోగిస్తూ సంవత్సరాల తరబడి అండర్ ట్రయిల్ ముద్దాయిలు గా జైల్లో నిర్బంధించారు. *ప్రశ్నించే గొంతులను మూయిస్తూ రాజ్యహింసను* ప్రయోగిస్తున్నారు. అదేవిధంగా గడచిన నెల రోజుల నుండి రాష్ట్రంలో కూడా ఎన్. ఐ. ఏ పోలీసులు ప్రజా సంఘాల నాయకులను అక్రమ అరెస్టులు చేస్తూ ఉపా చట్టం ప్రయోగిస్తున్నారు అమరుల బంధుమిత్రుల సంఘం, చైతన్య మహిళా సంఘం, ప్రగతిశీల కార్మిక సమాఖ్య, కుల నిర్మూలన పోరాట సమితి, పౌర హక్కుల సంఘం తదితర ప్రజా సంఘాల నాయకులను అక్రమ అరెస్టులు చేస్తూ మావోయిస్టులతో సంబంధాలున్నాయని తప్పుడు ఆరోపణలు చేస్తూ అప్రకటిత ఎమర్జెన్సీ విధానాన్ని కొనసాగిస్తున్నారు. *ఉపా చట్టాన్ని రద్దు చేయాలని  అరెస్టు చేసిన ప్రజా సంఘ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని* ఈరోజు నెల్లూరు లో *ఉపా రద్దు పోరాటాకమిటీ* ఆధ్వర్యంలో మద్రాస్ బస్టాండ్ సెంటర్ నుంచి ట్రంకరోడ్డు మీదుగా నార్తకిసెంటర్, కనకమహల్, గాంధీబొమ్మ, VRC సెంటర్ మీదుగా తిరిగి మద్రాస్ బస్టాండ్ సెంటర్ వరకు  కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపా రద్దుపోరాటాకమిటీ జిల్లా కన్వినర్ అబ్బాయిరెడ్డి, IAL. జిల్లాకార్యదర్శి M. బ్రహ్మం, CLC రాష్ట్ర సహాయకార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు, CLC. జిల్లాసహాయకార్యదర్శి సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ N. కేశవులు, KNPS. అధ్యక్షులు K. బాలయ్య, కార్యదర్శి V. సుధాకర్ , OPDR జిల్లాకార్యదర్శి R. శివశంకర్,  PDM. నాయకులు వేణు మరియు వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Comments