09.01.2021న విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఉపా రద్దు పోరాట కమిటీ సమావేశం కన్వీనర్ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో ఈ కింది నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకోవటం జరిగింది. 2021 జనవరి 23వ తేదీన గుంటూరులో రాష్ట్రస్థాయి బహిరంగ సభను నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర స్థాయి బహిరంగ సభకు ముందు జనవరి 18 నుండి 22వ తారీకు వరకు రాష్ట్రవ్యాప్తంగా అప్రజాస్వామిక ఉప చట్టాన్ని రద్దు చేయాలని, ఉపా చట్టం కింద అరెస్టు చేసిన వారందరిని బేషరతు గా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రచారం నిర్వహించాలి. ఈ ప్రచారం గ్రూప్ మీటింగులు స్ట్రీట్ మీటింగులు, సభలు, సమావేశాలు స్ట్రీట్ ప్లేలు వీలున్న రూపాలలో జరపాలి. అప్రజాస్వామిక ఉపా చట్టం గురించి ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించాలి. జనవరి 23న జరిగే గుంటూరు బహిరంగ సభకు అన్ని ప్రజా సంఘాల వారు ప్రజాస్వామికవాదులు తరలి రావాలని పిలుపు ఇవ్వడం జరిగినది. ఈ సభలో వక్తలు గా AP బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్ర ప్రసాద్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఐ.ఎఫ్.టి.యు జాతీయ కార్యదర్శి పి ప్రసాద్,Cms జ్యోతి తదితరులు వక్తలు గా ప్రసంగిస్తారు.
ఇట్లు
ఉపా రద్దు పోరాట కమిటీ. AP
కన్వీనర్
చిలుకా చంద్ర శేఖర్
కో కన్వీనర్
నంబూరి. శ్రీమన్నారాయణ.
Comments
Post a Comment