ఉపా వ్యతిరేక నిరసనల షెడ్యూల్ విడుదల | పౌర హక్కుల సంఘం


ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా ఉపా రద్దు పోరాట కమిటీ తెలి కాన్ఫెరెన్సు సమావేశం జిల్లా కన్వీనర్ U. వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో  AIKMS వెట్టి.సుబ్బన్న, నక్కా వెంకటరత్నం CLC, ఎం.జాన్ రాజ్ KNPS, రైతు కూలి సంఘం సాలి రాజశేఖర్, pks మస్తాన్,PDSU రామ్మోహన్,E భూషణం, k నాని,pow లత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉపా రద్దు రాష్ట్ర కమిటీ తీసుకున్న 
రెండు ఎజెండాలను సమావేశానికి హాజరైన రాష్ట్ర కో.కన్వీనర్ నంబూరి. శ్రీమన్నారాయణ వివరించారు. వాటి అమలును చర్చించి ఈ కింద నిర్ణయాలను తీసుకున్నది.
1) అప్రజాస్వామిక ఉపా చట్టాన్ని రద్దు చెయ్యాలి అని 2021 జనవరి18 to 22 వరకు ప్రచార క్యాంపెయిన్ జిల్లాలో విజయవంతం చేయాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది.

ప్రచార క్యాంపెయిన్ వివరాలు
18వ తేది........ నిడదవోలు. 
19వ తేదీ........ దేవరపల్లి,
20 వ తేదీ.......  కొవ్వూరు, 
21వ తేదీ...........జంగారెడ్డిగూడెం
22వ తేదీ.......ఏలూరు,తాడేపల్లిగూడెం

2)  23 వ తేదీ గుంటూరు కొరటాల మీటింగ్ హాల్ లో ఉదయం 10 గంటలకు జరిగే రాష్ట్ర స్థాయి బహిరంగ సభ కి  ప్రతి సంఘం నుండి హాజరు కావలెను అని నిర్ణయం.

*ఖర్చులు ప్రతిసంఘం రూ500/లు చొప్పున సమానంగా భరించాలి. 

*ప్రతి చోట బ్యానర్ విడి గా వేసుకోవాలి.

కార్యక్రమాలు కన్వీనర్ uv సమన్వయం చేస్తారు.
       
పశ్చిమగోదావరి జిల్లా కి 2000 కరపత్రాలు జిల్లా ఉపారద్దు పోరాట కమిటీ కన్వీనర్ u వేంకటేశ్వరరావు గార్కి పంపించాలి.

నంబూరి. శ్రీమన్నారాయణ
  కో. కన్వీనర్
ఉపా రద్దు పోరాట కమిటీ.AP

Comments