పౌర హక్కుల నాయకుల అరెస్ట్ అక్రమం | తెలంగాణ కమిటి

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన *నూతన వ్యవసిసాయ చట్టా లకు* వ్యతిరేకంగా రైతాంగం చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా  తెలంగాణాలో  *పౌర హక్కుల సంఘం  10-11తేదీలలో తలపెట్టిన  *పాదయాత్ర* కు  ప్రచారం చేస్తున్న  పౌర హక్కులసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి *మదన కుమార స్వామి* ని ఏనుగు మల్లారెడ్డి (కరీంనగర్ జిల్లా కార్యదర్శి )పోగుల రాజేశం EC. మెంబర్ మోటపలుకుల వెంకట్ ,కడ రాజన్న EC మెంబర్ లను  వాహనంలో పోతుండగా *పోలీసులు అడ్డుకొని  నిన్న 11.00 గ. లకు అరెస్ట్ చేసారు*.ఇప్పటి వరకు వారు ఎక్కడున్నారో కూడా తెలపడం లేదు.పాదయాత్ర కు సంబంధించి రూట్ మ్యాప్ ను పోలీసులకు ఈ నెల 7వ తేదీనే అందజేయడం జరిగింది, ఆ సందర్భంగా DSP పాదయాత్ర చేసుకొమ్మని నోటి మాటగా కూడా చెప్పడం జరిగింది.దీనితో పౌర హక్కుల సంఘం కరీంనగర్ జిల్లా కమిటీ  పాదయాత్ర ప్రచారంలో  ఉండగా అక్రమ అరెస్ట్ చేయడం ,ఇప్పటి వరకు వారి ఆచూకీ తెలపక పోవడం దారుణం.KCR. ప్రభుత్వ ఫాసిస్ట్ చర్యలను ఖండించాలని ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, ప్రజాసంఘాలకు విజ్ఞప్తి చేస్తూ, వారిని వెంటనే బేషరతుగా *విడుదల చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం*.

ఇప్పుడే పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. గడ్డం లక్మన్, ఉపాధ్యక్షులు రఘునాథ్ (హై కోర్ట్ న్యాయవాది) లను కూడా జగిత్యాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి కొడిమ్యాల పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 అన్యాయంగా అరెస్ట్ చేసిన పౌరహక్కులనేత కుమారస్వామితొ పాటు కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘనాయకుల విడుదల కోరుతూ బయలుదెరిన పౌరహక్కులనేతలు ప్రొ. గడ్డం లక్ష్మన్, రఘునాధులను అరెస్టు చేయడాన్ని  పౌర హక్కుల సంఘం  AP. రాష్ట్ర కమిటీ తీవ్రంగ ఖండిస్తున్నది . అరెస్టు చేసిన వారందరిని బేషరతుగా వెంటనే విడుదలచెయలని డిమాండ్ చేస్తున్నాం.


పౌర హక్కుల సంఘం రాష్ట్ర బృందాన్ని అరెస్ట్ చేయడాన్ని ఖండించండి - తెలంగాణ కమిటి 

పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, రాష్ట్ర కార్యదర్శి, హై కోర్టు న్యాయవాది వి రఘునాథ్, కార్యదర్శి ప్రొఫెసర్ గుంటి రవి, రాజనందం లను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నా0. దిన్ని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.   కేంద్ర ప్రభుత్వం తెచ్చిన  నూతన వ్యవసాయ చట్టాలను  ఉపసంవరించు కోవాలని కోరుతూ రైతాంగం చేస్తున్న ఉద్యమానికి సంఘభావంగా, రైతాంగం పై పెట్టుచున్న అక్రమ కేసులు, అరెస్ట్ లు, నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు జగిత్యాల జిల్లా కలెక్టర్ కర్యాలయానికి వెళ్తున్న పౌర హక్కుల సంఘం రాష్ట్ర బృందాన్ని జగిత్యాల పోలీస్ లు అక్రమంగా అరెస్ట్ చేసినారు.కోమి డాయల పోలీస్ స్టేషన్ కు తరలించి అక్రమంగా నిర్బంధించారు.   రైతాంగం చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా  తెలంగాణాలో  పౌర హక్కుల సంఘం  (10-11తేదీలలో ) జగిత్యాల జిల్లాలో "పాదయాత్ర" విజయవంతం చేయాలని   ప్రచారం చేస్తున్న  పౌర హక్కులసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి  మదన కుమార స్వామి,  మరియు కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యులను వాహనంలో పోతుండగా పోలీసులు  నిన్న తేది 09/01/2021 న అడ్డుకొని అరెస్ట్ చేసారు. మోడీ, KCR. ప్రభుత్వ ఫాసిస్ట్ చర్యలను ఖండించాలని రైతాంగాన్నికి,  ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, ప్రజాసంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాం.  వారిని వెంటనే బేషరతుగా  విడుదల చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కార్పొరేట్ కంపనీలకు జీతగాల్లుగా     పని చేస్తున్న ప్రభుత్వాల ను , రైతాంగాన్ని , వారి భూములను కార్పొరేట్ లకు కట్టబెట్టే చర్యలను వ్యతిరేకించాలని, రైతాంగాన్ని పలేర్లుగా, కూలీలుగా చేయాలనే ప్రభుత్వ విధనాలను తిరస్కరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మువ్వా నాగేశ్వర్ రావు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆల్గోట్  రవీందర్ రాష్ట్ర కోశాధికారి
పౌర హక్కుల సంఘం
తెలంగాణ 
రాష్ట్ర కమిటీ .

పత్రికా ప్రకటన  
గత ఐదు రోజులుగా వివిధ ప్రతిపక్ష పార్టీలతో సంప్రదించి ముఖ్యంగా జీవన్ రెడ్డి గారి సహకారంతో రూట్ మ్యాప్ తయారు చేయించి జగిత్యాల జిల్లాలో కొలువై నుండి బీర్పూర్ సారంగాపూర్ లక్ష్మీదేవి పల్లి హైదర్ పల్లె నుండి జగిత్యాల వరకు 31 కిలోమీటరల రెండు రోజుల పాదయాత్ర కొనసాగింపులో భాగంగా 5-1_2021 నాడు పత్రికలు ప్రింట్ చేయించి 7-1-2021 నాడు జిల్లా కేంద్రంలో పత్రికలకు విడుదల చేయడం జరిగింది తిరిగి అందులో భాగంగా గా 9-1-2021 ఈ శనివారం రోజు రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదాన కుమారస్వామిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు మల్లారెడ్డి ని సి ఎల్ సి మెంబర్స్ ఐనా వెంకట్ ని రాజేష్ ను కారులో జగిత్యాల వచ్చే క్రమంలో మధ్యలో అటకాయించి ఉదయం దాదాపు 11 ,12 గంటల మధ్యల అక్రమంగా అరెస్టు చేసినారు.
రైతు బాంధవున్ని అనిపించుకుంటున్న కెసిఆర్ గారు రైతన్నల చట్టాలకు వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్షాలను కలుపుకొని రెండు రోజుల పాదయాత్రకు సిద్ధమైతే ఎందుకు అరెస్ట్ చేశారో ప్రభుత్వ పోలీస్ అధికారుల నుండి సరియైన జవాబు లేదు కనీసం వారిని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు కూడా చెప్పడం లేదు అంటే పోలీసులు ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నరో ప్రజలారా గమనించండి. కావున ప్రజలకు పాత్రికేయులకు ప్రతిపక్ష పార్టీలకు అన్ని ప్రజా సంఘాలకు విజ్ఞప్తి చేయునది ఏమంటే ఇలాంటి రెండు నాలుకల ధోరణి ఉన్న కేసీఆర్ ప్రభుత్వం యొక్క చర్యలను తీవ్రంగా ఖండించాలి సిందిగా కోరు తున్నాము
1) అక్రమంగా అరెస్టు చేసిన పౌరహక్కుల సంఘాల నాయకులను వెంటనే బేషరతుగా విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం
2) అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు వెంటనే విడుదల చేయాలనే ఒత్తిడిని ప్రభుత్వం పై పెంచండి.

*PRESS NOTE*


*మరో.... నలుగురు పౌర హక్కుల రాష్ట్ర నేతలు అరెస్ట్*

*జగిత్యాల జిల్లా కొడిమ్యాల పోలీస్ స్టేషన్ లో నిర్బంధం*


*శనివారం అరెస్ట్ చేసిన ఐదుగురు నేతల ఆచూకీ తెలియనీయడం లేదు*

*కొల్వాయి, బీర్పూర్ లలో భారీగా పోలీస్ బలగాల మోహరింపు*



జగిత్యాల:


పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర నాయకులు నలుగురిని ఆదివారం మధ్యాహ్నం 12:30గంటలకు జగిత్యాల జిల్లా పోలీసులు పూడూర్ - కొండగట్టుల మధ్య అరెస్ట్ చేశారు. రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. గడ్డం లక్మన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.రఘునాథ్ (హై కోర్ట్ న్యాయవాది), గుంటి రవి, లింగన్న లను కూడా అరెస్ట్ చేసి జగిత్యాల జిల్లా కొడిమ్యాల పోలీస్ స్టేషన్ కు తరలించారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామం నుండి జగిత్యాల జిల్లా కేంద్రం వరకు ఆది, సోమ వారాలలో (జనవరి 10, 11తేదీలలో) పౌర హక్కుల సంఘం పాద యాత్ర నిర్వహించాలని నిర్ణయించింది.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో జరుగుతున్న రైతు ఉద్యమాలకు మద్దతుగా ఈ పాదయాత్ర ను ఈప్రాంత రైతులతో కలిసి చేపట్టేందుకు ఏర్పాటు చేశారు.
ఈ పాదయాత్ర ను అడ్డుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుట్రపన్ని పోలీసులతో అరెస్టులకు పూనుకొంది.



*ఆచూకీ తెలియని ఐదుగురు నేతలు*


 శనివారం పాదయాత్ర ఏర్పాట్లలో నిమగ్నమైన పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధన కుమార స్వామి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు మల్లారెడ్డి, కార్యవర్గ సభ్యులు పోగుల రాజేశం, మోటపలుకుల వెంకట్, కడ రాజన్నలను శనివారం ఉదయం 10:30 నుండి 11-00 గంటల ప్రాంతంలో  బీర్ పూర్ మండలంలో శనివారం జగిత్యాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారని రాష్ట్ర నేతలు ప్రకటించారు.

అరెస్ట్ చేసిన వారి ఆచూకీ ఇప్పటి వరకు తెలియనీయకుండా పోలీసులు గోప్యంగా ఉంచారని రాష్ట్ర నాయకులు తెలిపారు. రాష్ట్ర నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి ఆచూకీ తెలపడం లేదని హక్కుల నేతలు ఆరోపిస్తున్నారు. 


*కొల్వాయి, బీర్పూర్ లలో భారీగా పోలీస్ బలగాల మోహరింపు*


న్యాయవాదిగా పౌరుల హక్కుల సాధన పోరాటంలో అసువులు బాసిన పౌర హక్కుల నేత గోపు రాజన్న స్వగ్రామం కొల్వాయి నుండి ఆదివారం పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభం కానుండగా పోలీస్ ఉన్నతాధికారులు అడ్డుకునే ప్రయత్నం లో భాగంగా భారీగా పోలీస్ బలగాలను దింపారు. సుమారు 200మంది పోలీస్ బెటాలియన్ జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం చుట్టుముట్టారు. ఈప్రాంత ప్రజలంతా తీవ్ర భయబ్రాంతులకు లోనవుతున్నారు.



*హక్కుల నేతలను భేషరతుగా విడుదల చేయాలి:*
తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి


జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామం నుండి ఆదివారం ప్రారంభం అయ్యే పాదయాత్ర ను అడ్డుకునేందుకు అరెస్ట్ చేసిన పౌర హక్కుల సంఘం నేతలను వెంటనే భేషరతుగా విడుదల చేయాలని తెలంగాణ జనసమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో ఉదృతంగా కొనసాగుతున్న రైతు ఉద్యామాలకు మద్దతుగా పాదయాత్ర చేపడితే అరెస్ట్ లు చేసి, అక్రమంగా నిర్బంధించడం చట్టవిరుద్ద మన్నారు. నిరసన తెలిపే హక్కు, శాంతియుత ఉద్యమాలు చేసే హక్కు ప్రతి పౌరునికి ఉందని ఆయన గుర్తుచేశారు. శని, ఆదివారాలలో అరెస్ట్ చేసిన పౌర హక్కుల సంఘం నేతలు తొమ్మిది మందిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ ఉన్నతాధికారులకు చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. అరెస్ట్ అయిన వారిలో
రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. గడ్డం లక్మన్, ఉపాధ్యక్షులు వి.రఘునాథ్ (హై కోర్ట్ న్యాయవాది), సహాయ కార్యదర్శి మాధన కుమార స్వామి, రాష్ట్ర నాయకులు గుంటి రవి, లింగన్న, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు మల్లారెడ్డి, కార్యవర్గ సభ్యులు పోగుల రాజేశం, మోటపలుకుల వెంకట్, కడ రాజన్న లు ఉన్నట్లు తమకు సమాచారం ఉందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ కమిటి ఖండన
ప్రెస్ నోట్.           
తేది 10/01/2021. ఏలూరు.
***************************
హక్కుల నేతల అరెస్టు లు అప్రజాస్వామికం.
 రాజ్యాంగ లోని
ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడింది.
ఈ అరెస్ట్ లు రాజ్యాంగ హక్కుల పై దాడి:  

పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, రాష్ట్ర కార్యదర్శి, హై కోర్టు న్యాయవాది వి రఘునాథ్, కార్యదర్శి ప్రొఫెసర్ గుంటి రవి, హైకోర్టు న్యాయవాది లింగం లను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ  ఖండిస్తున్నాం.  ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అరెస్టులు రాజ్యాంగం లోని ఆర్టికల్19  భావ ప్రకటన స్వేచ్ఛ,ఆర్టికల్ 21 జీవించే హక్కులకు విఘాతం కలిగిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం  అప్రజా స్వామిక నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని  కోరుతూ రైతాంగం చేస్తున్న ఉద్యమానికి సంఘి భావంగా, రైతాంగం పై పెట్టుచున్న అక్రమ కేసులు, అరెస్ట్ లు, నిర్బంధాన్ని,అణచివేత ను నిరసిస్తూ, నిన్నటి పౌరహక్కుల నేతల అరెస్ట్ లను వ్యతిరేకిస్తూ ఈ రోజు జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్తున్న పౌర హక్కుల సంఘం రాష్ట్ర బృందాన్ని జగిత్యాల పోలీస్ లు అక్రమంగా అరెస్ట్ చేసినారు.కోమిడ్యల పోలీస్ స్టేషన్ కు తరలించి అక్రమంగా నిర్బంధించారు.   రైతాంగం చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా  తెలంగాణాలో  పౌర హక్కుల సంఘం  (10-11తేదీలలో ) జగిత్యాల జిల్లాలో "పాదయాత్ర" విజయవంతం చేయాలని   ప్రచారం చేస్తున్న  పౌర హక్కులసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి  మదన కుమార స్వామి,  మరియు కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యులను వాహనంలో పోతుండగా పోలీసులు  నిన్న తేది 09/01/2021 న అడ్డుకొని అరెస్ట్ చేసారు. మోడీ, KCR. ప్రభుత్వ ఫాసిస్ట్ చర్యలను ఖండించాలని రైతాంగాన్నికి,  ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, ప్రజాసంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాం.  వారిని వెంటనే బేషరతుగా  విడుదల చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కార్పొరేట్ కంపనీలకు జీతగాల్లుగా     పని చేస్తున్న ప్రభుత్వాల ను , రైతాంగాన్ని , వారి భూములను కార్పొరేట్ లకు కట్టబెట్టే చర్యలను వ్యతిరేకించాలని, రైతాంగాన్ని  పాలేర్లు, కూలీలుగా చేయాలనే ప్రభుత్వ విధానాలను తిరస్కరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ వస్తే పౌరహక్కుల సంఘానికి మొదటి అధ్యక్షుడు ని నేనే అవుతా అన్న కేసీఆర్ ప్రజల హక్కుల కోసం పనిచేసే హక్కుల నేతలను తెలంగాణా ప్రభుత్వం అరెస్ట్ చేయటం పై సమాధానం చెప్పాలని కేసీఆర్ ని ప్రశ్నిస్తున్నాం.

     ఇట్లు
నంబూరి. శ్రీమన్నారాయణ
 హైకోర్టు అడ్వకేట్
 రాష్ట్ర ఉపాధ్యక్షులు
 పౌర హక్కుల సంఘం.AP .


Comments