ప్రొఫెసర్ శేషయ్య సంతాప సభ | కర్నూల్ జిల్లా

పౌర హక్కుల సంఘం ఉద్యమ సారధి ప్రొఫెసర్ శేషయ్య గారి సంతాప సభ మరియు అమరుడు పురుషోత్తం ....జ్ఞాపకాల ..    "అతడొక్క... దిక్కారమ్"...పుస్తకావిష్కరణ సభను.  పౌర హక్కుల సంఘం కర్నూల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో,జిల్లా కార్యదర్శి అల్లా బకష్ అధ్యక్షతన  03/01/2021 (ఆదివారం) నాడు ఎమ్మిగనూరు ,నారాయణ స్కూల్ నందు ఉదయం 11.00 గంటలకు  నిర్వహించారు...
   ఈ సభలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సి.వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ ప్రో!! శేషయ్య  గారు సమాజంలో నెలకొని ఉన్న అసమానతల ను రూపు మాపటాని,పీడిత ప్రజల హక్కుల కోసం ,రైతాంగ సమస్యల కోసం,దళితుల,ఆదివాసీల,మహిళల హక్కుల కోసం ,అంతేకాకుండా వారిపై ఆధిపత్య వర్గాలు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడి వారికి అండగా నిలబడ్డారు అని కొనియాడారు ...రాయలసీమ కరువును రూపు మాపటాని కి ,సాయుధ ముఠా శక్తులకు వ్యతిరేకంగా పోరాడారు.క్లిష్టమైన సమయంలో శేషయ్య గారు సంస్థ ప్రధాన బాధ్యతలు తీసుకొని సంస్థను,తన కార్య చరణ పరిధిని విస్తృతం చేశారు.. సమాజంలో జరుగుతున్న  అన్నిరకాల హక్కుల ఉల్లంఘనలకు రాజ్యమే ప్రధాన కారణమని భావించి ,ఆదిశగా పోరాడారు.  ఈ క్రమంలో నే కరోనా తో 10/10/2020 న మరణించడం అత్యంత బాధాకరం,విషాదం .ఈయన మరణం భారత పీడిత ప్రజలకు తీరని లోటని,ముఖ్యంగా పౌర హక్కుల సంఘం,కార్య కర్త లు ఒక పెద్ద దిక్కును కోల్పోవడం తీరని లోటు.
     అమరుడు పురుషోత్తం మరణించి 2020 నవంబర్ 23 నాటికి 20 ఏళ్లు అయినా, నేటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు,ఆయన ప్రజల కోసం క్షేత్ర స్థాయి నుండి వారి సమస్యల ను అధ్యయనం చేసి ఆ దిశగా పరిష్కారానికి విస్తృత మైన పోరాటాలు చేశారు..పురుషోత్తం ఆయన నిత్యం దళిత,గిరిజన గూడెల్లో ఉంటూ వారితో మమేకం అయ్యారు...బూటకపు ఎన్కౌంటర్ లకు ,లాకప్ హత్యలకు నిరసిస్తూ కోర్టు లలో కేసులు వేసి రాజ్యానికి కంట గింపుగా అయ్యాడు.. ఈ నేపథ్యంలోనే రాజ్య ప్రేరేపిత హంతకుల చే 2000 నవంబర్ 23 న హైదరాబాద్ నడిబొడ్డున పురుషోత్తము ను హత్య చేశారు.
      అమరులు అందించిన స్ఫూర్తి,ఆలోచనలు,ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి బలమైన  పౌర హక్కుల ఉద్యమాన్ని నిర్మించి నపుడే అమరులకు మన మిచ్చే ఘన మైన నివాళులు అని అన్నారు ..
    అమరుడు పురుషోత్తం జ్ఞాపకాల మీద వచ్చిన "అతడొక డీక్కారం"  పుస్తకావిష్కరణ చేసిన పురుషోత్తం కుమార్తె , హై కోర్టు న్యాయవాది స్వేచ్ఛ మాట్లాడుతూ నాన్న చనిపోయే నాటికి  తన వయసు 8 ఏళ్లని,నాన్న ఎందుకు చంపి వేశారో తెలియదని,అయినా పెరిగి పెద్ద అవుతున్న క్రమంలో నేను ఎక్కడి కెల్లినా నాన్నను ఎంతో మందికి సేవ చేశారని, వారి తరుపున పోరాడారని ఆయన పేదలకు చేసిన సేవలుఇప్పటికి ప్రజల హృదయాల్లో సజీవంగా ఉన్నాడంటే ఆయన పీడిత ప్రజల హక్కుల కోసం ఎంత అంకుటిత దీక్ష తో పోరాడారో అర్థమవుతుందని అని కొనియాడారు..మా సొంత గ్రామమైన చిన తాండ్ర పాడులో దళితులు అంబేడ్కర్ గారి విగ్రహం పెట్టాలని ప్రయత్నాలు చేస్తుండగా అగ్రకులస్తులు,అందునా మా నాన్న సొంత అన్న అడ్డు కోగా ,అమరుడు పురుషోత్తం దళితుల పక్షాన ఉండి ,తన అన్న పై నే కేసులు పెట్టించాడు అంటే ,ఆయనకు బంధుత్వాలు,బందివులకన్నా తను నమ్మిన సిద్ధాంతాల,ఆశయాల కోసం పరితపించి నిరంతరం పోరా డారని కొనియాడారు..
   విరసం నాయకులు పాణి మాట్లాడుతూ శేషయ్య, పురుషోత్తం సమాజం తయారు చేసుకొన్న గొప్ప మానవీయ విలువలు కల్గిన నాయకులని, వారెప్పుడూ సొంత ప్రయోజనాలు చూసుకొలే దని,పీడిత ప్రజల హక్కుల కోసం పరితపించి,ఆదిశగా పోరాడారని కొనియాడారు....
    DTF రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ప్రొఫెసర్ శేషయ్య గారు కర్నూల్ జిల్లా నందికొట్కూరు వాసి అని ఆయనకు రాయలసీమ సమస్యల పట్ల సమగ్రమైన అహాగాహన కల్గి,వాటి పరిష్కారానికి కృషి చేశారని చెప్పారు.అమరుడు పురుషోత్తం తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు....
    ఇంకా ఈసమావేశంలో పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, కులనిర్మూలన పోరాట సమితి సుబ్బారాయుడు,DTF జిల్లా కార్యదర్శి కృష్ణయ్య,బి.సి సంఘం నాయకులు గణేష్, ఇప్టూ నాయకులు జేమ్స్,చేనేత కార్మిక సమాఖ్య నాయకులు నీలకంఠ,రామచంద్రా,PDSU నాయకులు రాజేష్,తదితరులు పాల్గొని తమ సంతాప సందేశాలు అందించారు...

Comments