పౌర హక్కుల సంఘం తెలంగాణ.
పత్రికా ప్రకటన..........
ఢిల్లీ రైతుల ధర్నా కు పౌర, ప్రజా సంఘాల మద్దతుగా నిరసన కార్యక్రమం.....
అంబేడ్కర్ విగ్రహం, తీన్ రాస్తా, మున్సిపల్ కార్పోరేషన్ ఎదురుగా,గోదావరిఖని,6-12-2020...3:30 PM.
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ పదకొండురోజులుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతుల ఉద్యమానికి పౌర హక్కుల సంఘం పూర్తి సంఘీభావం మరియు డిసెంబర్ 8న రైతుల దేశవ్యాప్త బందుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది.....
26&27 నవంబర్,2020 న, దేశవ్యాప్త రైతుల ఛలో ఢిల్లీ ర్యాలీలపై BJP మోడీ కేంద్ర ప్రభుత్వం పోలీసులు, పారా మిలిటరీ బలగాలతో అణిచివేత, లాఠీఛార్జ్ ,వాటర్ కేనాన్ & పోలీస్ నిర్బంధాన్ని పౌర హక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తున్నది.రైతులు శాంతియుతంగా ప్రదర్శనలు చేయడం నిరసన తెలియజేయడం ప్రజాస్వామ్య హక్కు.
BJP మోడీ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను,విద్యుత్ సవరణ చట్టం ను (2020) ఉపసంహరించాలని,పంటలకు కనీస మద్దతు ధర( MSP) చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ సార్వత్రిక సమ్మెలో భాగంగా ఛలో ఢిల్లీ ,26 నవంబర్,2020 గురువారం న ఢిల్లీ కార్యక్రమానికి వస్తున్న ఉత్తర భారత దేశ రాష్ట్రా లైన పంజాబ్, హర్యానా,ఉత్తరాఖండ్, ఉత్తేరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్,రాష్ట్రాల రైతులపై పోలీసుల నిర్బంధాన్ని, అణిచివేత, దమనకాండ,లాఠీచార్జీను,వాటర్ కేన్లు,బాష్పవాయువు గోళాలను ప్రయోగించడాన్ని పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. BJP మోడీ ప్రభుత్వం కార్పొరేట్ రంగానికి ఊడిగం చెయ్యడానికి మూడు కొత్త వ్యయసాయ చట్టాలు,విద్యుత్ సవరణ చట్టంను(2020) తీసుకురావడం దుర్మార్గమైన చర్య. ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకిస్తూ దేశంనలుమూలల నుంచి రైతులు ఢిల్లీకి వెళుతుండగా అడ్డుకోవడం, బారికేడ్లు పెట్టడం,రోడ్డుపై పెద్ద పెద్దకందకాలు తవ్వడం,పెద్దపెద్ద బండరాళ్ళుపెట్టి,ఇనుప ముళ్ళకంచెలు మరియు ఇసుక కుప్పలు పోసి ఆటంకాలు సృష్టించడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం.రైతులు నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా పోలీసులచే రహదారులను దిగ్బంధించడం అప్రజాస్వామిక చర్య మరియు రాజ్యాంగ వ్యతిరేకం.నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న రైతులపై,క్రూర నిర్బంధ చట్టాలు నమోదు చేయడాన్ని పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది.
రైతు వ్యతిరేక చట్టాలపై శాంతియుతంగా పోరాడుతున్న అన్నదాతలపై కేంద్రపోలిస్ బలగాలను ఉపయోగించి అణిచివేయడం మానుకోవాలని.కనీసం రైతుల ఆందోళన ఏమిటో అని వినే స్థితిలో ప్రభుత్వం లేకపోవడం అత్యంత అమానవీయం.కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో రైతు సంఘాలతో చర్చలు జరపాలని పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ డిమాండ్లను పరిష్కరించాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది.డిసెంబర్ 8న జరిగే దేశవ్యాప్త బందుకు,మేధావులు,ప్రజాస్వామిక వాదులు, సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు,కార్మిక సంఘాలు,విపక్షాలు అన్ని వర్గాలు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
1.మూడు కొత్త వ్యవసాయ బేషరతుగా చట్టాలు రద్దుచేయాలి.
2.విద్యుత్ సవరణ చట్టంను(2020) రద్దుచేయాలి.
3.రైతు పంటకి కనీస మద్దతు ధరకు (Minimum Support Price) చట్టబద్దత కల్పించాలి.
4.ప్రజాస్వామికంగా నిరసన తెలుపుతున్న రైతులపై పాశవికంగా అమలుచేస్తున్న నిర్బంధాన్ని తక్షణమే ఎత్తివేయాలి.రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి..
1.N. నారాయణరావు,ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం తెలంగాణ.
2.మాదన కుమారస్వామి, సహాయ కార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
3.GAV, ప్రసాద్,అధ్యక్షుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
4.ఏనుగు మల్లారెడ్డిప్రధాన కార్యదర్శి,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
7.శ్రీపతి రాజగోపాల్, ఉపాధ్యక్షుడు,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
8..పుల్ల సుచరిత, సహాయ కార్యదర్శి,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
9.నార వినోద్, బొడ్డుపెల్లి రవి,పొగులరాజేశం, కడ రాజయ్య, యాదవనేని పర్వతాలు.
7.T. రాజిరెడ్డి,CITU, రాష్ట్ర అధ్యక్షుడు.
6.I. కృష్ణ, IFTU, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
7.E.నరేష్, IFTU, రాష్ట్ర సహాయ కార్యదర్శి.
8.K.విశ్వనాధం, IFTU, రాష్ట్ర ఉపాధ్యక్షుడు.
9.గాండ్ల మల్లేశం, TPF, పెద్దపెల్లి జిల్లా కమిటీ సభ్యుడు.
10.లక్ష్మీపతి గౌడ్,INTUC RG-1,నాయకులు.
11.ముడిమడుగుల మల్లయ్య, అధ్యక్షుడు, రైతు సమస్యల సదనసామితి తెలంగాణ.
12.బియ్యాల స్వామి, రైతు.
13.పోరెడ్డి వెంకట్ రెడ్డి, సామాజిక కార్యకర్త.
Comments
Post a Comment