పార్లమెంట్ లో వ్యవసాయాన్ని కార్పోరేట్ శక్తులుకు కట్టబెట్టే ముాడు నల్లచట్టాలను బిజెపి ప్రభుత్వం తెచ్చిందని వాటిని రద్దుచేయాలని డిల్లీ లో రైతులు చేస్తున్న ప్రజా ఉద్యమానికి మద్దతుగా జరిగిన బంద్ లో భాగంగా ఆదివారం విఆర్సి సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యర్ది జెఎసి రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పి.ఆదిత్య సాయి మాట్లాడుతుా పార్లమెంట్లో చేసిన ముాడు చట్టాలు రైతులను కార్పోరేట్ శక్తుల చేతుల్లో బందించే విధంగా ఉన్నాయని ఎ పంట పండించాలో ఎలా అమ్మాలో ఎ విత్తనం వేయ్యాలో అన్ని కార్పోరేట్ శక్తులు చెప్పిన విధంగా చేసే విధంగా ఉన్నాయని ప్రభుత్వం స్పందించకపోతే దేశానికి అన్నం పెట్టే రైతు ఉద్యమానికి బిజెపి కొట్టుకుపోతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు, నవ్యాంద్ర విద్యార్ది జెఎసి రాష్ట్ర కార్యదర్శి పి.లీలా మెాహన్, సమాజ్ వాది పార్టి విద్యార్ది విభాగం రాష్ట్ర కార్యదర్శి అన్నంగి.హరీష్ యాదవ్, శ్రీకాంత్, మధు, ప్రవీణ్ రాకేష్, ఖలీద్ హుస్సేన్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment