రైతు ఉద్యమానికి మద్దతుగా ర్యాలి | పశ్చిమ గోదావరి జిల్లా

రైతు ఉద్యమానికి మద్దతు.

    దేశ వ్యాప్తంగా జరిగిన కిసాన్ జ్యోతి కార్యక్రమం ని పౌర హక్కుల సంఘం CLC కొవ్వూరు లో నిర్వహించింది. రైతులు హక్కుల ను డిమాండ్ చేస్తు కాగడా లతో కిసాన్ జ్యోతులను పౌర హక్కుల సంఘం ప్రదర్శించింది. ఈ కార్యక్రమాన్ని పౌరహక్కుల సంఘం  రాష్ట్ర ఉపాధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది నంబూరి. శ్రీమన్నారాయణ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి ఆహారాన్ని అందించేది రైతులు. కార్పొరేట్ లు కాదని అన్నారు. వ్యవసాయ సంపద కార్పొరేట్ ల గుప్పిట్లో పెట్టటానికి మోడీ కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను తీసుకురావడం అప్రజాస్వామికం అన్నారు. సమాజానికి అన్నం అందించటానికి, వ్యవసాయం కాపాడటానికి రైతన్న చలి గడ్డలో ఢిల్లీ సరిహద్దుల్లో నిలబడి పోరాడుతున్నారు అన్నారు. అన్నం తినే ప్రతి పౌరుడు రైతన్న జరుపుతున్న ఉద్యమానికి మద్దతు  గా నిలబడాలని అన్నారు. కేంద్రం తీసుకు వచ్చిన 3 వ్యవసాయ చట్టాలు ని తక్షణం కేంద్ర ప్రభుత్వం రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు.
      పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు నక్కా వెంకటరత్నం మాట్లాడుతు కార్పొరేట్ ల లాభాల కోసం రైతులకు నష్టం వచ్చే చట్టాలు మోడీ ప్రభుత్వం  చేయటం వ్యవసాయం పట్ల బాధ్యత ఏమాత్రం అవగాహన లేదనిపిస్తుంది అన్నారు. ప్రభుత్వ మార్కెట్ కమిటీలు లేకపోవడం వలన రైతులు, వినియోగదారులు  మార్కెట్లో కార్పొరేట్ ల నిలువ దోపిడీకి గురవుతారు అని అన్నారు. రైతులు పండించే పంటలను కారు చౌక గా కొని వినియోగదారుల కు అధిక ధరలకు అమ్ముతారని అన్నారు. సమాజం మొత్తానికి కేంద్రం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాల వలన నష్టం వస్తుంది అన్నారు. తక్షణం చట్టాలను రద్దు చేసి ప్రభుత్వ మార్కెట్ కమిటీలు ని కొనసాగించాలి  అని డిమాండ్ చేశారు.
                 ఈ కార్యక్రమంలో హరి కృష్ణ, పాల నాగరాజు, బి. శివ,దాసరి మోహన్, కుమార్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
                  నక్కా. వెంకట రత్నం
                        జిల్లా అధ్యక్షులు
                  పౌర హక్కుల సంఘం
                       16.12.2020

Comments