శేషయ్య సంస్మరణ సభ | నెల్లూరు జిల్లా

హక్కుల ఉద్యమాన్ని బలోపేతం చేయడమే నిజమైన నివాళి*
__ ప్రొఫెసర్ శేషయ్య సంస్మరణ సభలో వక్తలు.
        **.                 **
పౌర హక్కుల ఉద్యమ నేత, రెండు తెలుగు రాష్ట్రాల సమన్వయ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ శేషయ్య సంస్మరణ సభ నేడు స్థానిక నెల్లూరు హాస్పిటల్  మీటింగ్ హల్ నందు నిర్వహించబడింది. పౌరహక్కుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అబ్బాయిరెడ్డి  అధ్యక్షతన జరిగింది.ముఖ్య అతిథులుగా  పౌర హక్కుల సంఘం రాష్ట్ర  కార్యదర్శి చిలుక . చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు క్రాంతిచైతన్య, IAPL నాయకులు D. సురేషకుమార్, హై కోర్ట్ న్యాయవాది అమరుడు పురుషోత్తం కుమార్తె  స్వేచ్చ హాజరయ్యారు.  నక్సలైట్ ల పేరిట పోలీసులు చేస్తున్న హత్యలను
 నిరసించడానికి ఆవిర్భవించిన పౌరహక్కుల ఉద్యమం తర్వాత కాలంలో విస్తృతమై, ఆదివాసీ, గిరిజన సమస్యలు, రైతు కూలీ సమస్యలు, దళిత సమస్యలను మహిళా సమస్యను, ప్రభుత్వాల ఫాసిస్ట్ విధాలను వ్యతిరేకిస్తూ ఉద్యమాలను నిర్వహించిందని, హక్కులకొరకు ఉద్యమిస్తూనే  ఆరుగురు నాయకులను కోల్పోయిందని, అయినామొక్కవోని ధైర్యంతో పని చేస్తూవుందని, ప్రభుత్వాలు అనుసరించే అన్ని రకాల, పీడన లకు, దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ఉపా లాంటి నల్ల చట్టాలను రద్దు చెయ్యాలని  పోరాడుతుందని తెలిపారు. రాజ్యాంగ విలువలు అంతరించి పోతున్న ఈ తరుణంలో పౌర హక్కుల కొరకు విలువలతో, పనిచేయడం చాలా కష్టమైన పని అని, దాన్ని ఒక భాద్యతగా మనందరం స్వీకరించాలని, త్యాగాలకు సిద్ధమై నప్పుడే పౌరహక్కుల ఉద్యమం లో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ శేషయ్య,  పురుషోత్తం గారలు, నిజాయితీ తో సంఘం విలువల కొరకు పనిచేశారని తెలిపారు. పురుషోత్తం కుమార్తె హై కోర్టు అడ్వకేట్ స్వేచ్ఛ
" అతడొక ధిక్కారం" అనే పురుషోత్తం జ్ఞాపకాల పుస్తకాన్ని ఆవిష్కరించారు. పేద ప్రజల హక్కుల సాధన కొరకు తమ జీవితాన్ని బలి పెట్టిన నాయకుల జీవితాలు మనకు ఆదర్శం  కావాలని, ప్రొఫెసర్ శేషయ్య, పురుషోత్తం గారలు చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈనాటి సంస్మరణ సభలో అబ్బాయి రెడ్డి, బ్రహ్మం, ఎల్లంకి వెంకటేశ్వర్లు, మరియు వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
 
  __ పౌర హక్కుల సంఘం (CLC),
    నెల్లూరు జిల్లా కమిటీ

Comments