అతడొక్క ధిక్కారం"---- పురుషోత్తం జ్ఞాపకాలు ,పుస్తకావిష్కరణ.
____________________
పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు, అమరుడు పురుషోత్తం 23/11/2000న హైదరాబాద్ దిల్ సుక్ నగర్ లో అప్పటి రాజ్య ప్రేరేపిత హంతకులచే హత్య చేయబడ్డారు. ఆయన 20 వ వర్ధంతి సందర్భంగా పౌర హక్కుల సంఘం,ఆయన బంధు మిత్రుల ఆధ్వర్యంలో అతడొక దీక్కారం __పురుషోత్తం జ్ఞాపకాలు అనే పుస్తకం తీసుక రావడం జరిగినది.
ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం,కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కార్య క్రమం రాయచోటి, NGO హోమ్ నందు 06/12/2020 న జరిగినది. ఈ కార్య క్రమానికి పౌర హక్కుల సంఘం ,రాష్ట్ర సహాయ కార్యదర్శి సి.వెంకటేశ్వర్లు పాల్గొని,ప్రసింగిస్తూ పురుషోత్తం సమాజంలో అణగారిన ప్రజల హక్కుల కోసం,రైతాంగం కోసం,సమాజంలో వివక్షను మహిళల హక్కుల కోసం,వరకట్న హత్యల కు వ్యతిరేకంగా బాధితుల తరపున ఎన్నో పోరాటాలు చేశారు.అంటరానితనం రూపు మాపాడానికి నిత్యం దళితులకు అండగా నిలబడ్డాడు అని కోయాడారు.ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వాల డొల్ల తన్నాన్ని నిజనిర్డానాల ద్వారా బయట పెట్టీ ప్రజల వైపు నిలబడిన గొప్ప నాయకుడు పురుషోత్తం అని అన్నారు.ప్రజల సమస్యల పై పోరాడుతూ,ప్రజలకు నాయకత్వం వహిస్తూ న్న ప్రజా ఉద్యమ కారులను భూటకపు ఎన్కౌంటర్ లలో చంపి,వారి శవాలను కూడా కుటుబసభ్యులకు అప్ప గించక పోవడం పై ప్రభుత్వ చర్యలకు ఎండ గడుతూ కోర్టులలో కేసులు వేసి, అనుకూలంగా ఎన్నో తీర్పులు తెచ్చి రాజ్యానికి కంటగింపుగా తయారయ్యాడు.పురుషోత్తం ప్రజా సమస్యల పట్ల గాని,సంస్థలో గాని నిజాయితీ, నిబద్ధతగా అచరించడమే గాక,పాటించే వారు .తన జీవిత కాలంలో ఎప్పుడూ వ్యక్తిగత జీవితం పట్టించు కొనే వాడు కాదు.పౌర హక్కుల ఉద్యమం,ఆచరణ,రాజకీయ దృక్పథం ఈ మూడు తన జీవితంలో పెనవేసుకు పోయాయి.గొప్ప ఆలోచనలు,గొప్ప అసయాలు,గొప్ప లక్షం ఉండటమే జీవితం కాదు అవి పాటించి ప్రజల హృదయాల్లో స్థిర స్తాయిగా నిలిచి పోయిన గొప్ప మానవతా వాది అని కొనియాడారు.ఇంతటి నిబ్బ ద త గల పురుషోత్తం ను రాజ్యం బలి తీసుకోవడం అమానుషం అని,ఈయన మరణం పౌర హక్కుల సంఘం నకు,ముఖ్యంగా పీడిత ప్రజలకు తీరని లోటన్నారు...
ఈ కార్య క్రమంలో పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు కె.అనోహర్,ఉపాధ్యక్షులు పి.రెడ్డెయ్య,ప్రధాన కార్యదర్శి ఆర్.రవిశంకర్,,సహాయ కార్యదర్శి ఏం.రవిశంకర్, కోసాది కారి వంగి మల్ల రమణ,CPI రెడ్ స్టార్ నాయకులు సుధీర్, దళిత వేదిక నుండి ఓబులేసు,మహేష్, సాయి కుమార్,బి.సి సంఘం నాయకులు రేపన రామ చంద్ర తదితరులు పాల్గొని ప్రసంగించారు..
....పౌర హక్కుల సంఘం,
కడప జిల్లా శాఖ.
06/12/2020.
Comments
Post a Comment