పత్రిక సమావేశం. రాయచోటి,
07/12/2020
________________
వర్షా కాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు ల ద్వారా తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, వాటిని రద్దు చేయాలని గత 12 రోజులుగా దేశ వ్యాప్త రైతులు,రైతు సంఘాలు ఢిల్లీలో చేస్తున్న ఉద్యమానికి,సంఘీభావం ప్రకటిస్తూ,మరియు డిసెంబర్ 08న రైతులు చేస్తున్న భారత్ బంద్ కు పౌర హక్కుల సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్న ది.
నవంబర్ చివరి వారం లో దేశ వ్యాప్త రైతులు చలో డిల్లీ కార్యక్రమం పై కేంద్ర ప్రభుత్వం పోలీసు,పారా బలగాలచే నిరసన చేస్తున్న రైతుల పై అత్యంత పాశవికంగా అణచివేత, లాట్టి ఛార్జ్,నీటి పిరంగులతో దాడి చేయడాన్ని పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాం.
బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఇటీవల ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను,విద్యుత్ చట్ట సవరణ (2020) ఉపసంహరించాలని ,పంటలకు కనీస మద్దతు ధర (msp) చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీకి వస్తున్న పంజాబ్,హరియాన,ఉత్తరాకాండ్, ఉత్తర ప్రదేశ్ మరియు మద్య ప్రదేశ్ రాష్ట్రాల రైతుల పై డిల్లీ సరిహద్దుల్లో దాడి చేయడం అమానుషం.వారిని అడ్డుకోవడం అప్రజాస్వామికం మరియు రాజ్యాంగ వ్యతిరేకం.నిరసన చేస్తున్న రైతులపై క్రూర నిర్బంధ చట్టాలను ఉపయోగించి కేసులు నమోదు చేయడం దారుణం.
రైతులు చేస్తున్న పోరాటాల పై కేంద్ర ప్రభుత్వం తూ,తూ మంత్రంగా చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించకుండా కార్పోరేట్ కంపెనీల కు అనుకూలంగా ఉండటాన్ని ప్రజలందరూ ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.ఉద్యమిస్తున్న రైతుల సమస్యలను వినే ఓపిక పాలకుల కు కొరవడటం తో సమస్య జటిల మవుతుంది.రైతులు,రైతు సంఘాలు ప్రభుత్వం దృష్టికి తెస్తున్న న్యాయమైన డిమాండ్ లను ఇప్పటికైనా ప్రభుత్వం చిత శుద్ధితో చర్చలు జరిపి పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం.
08/12/2020 న రైతులు ఇచ్చిన దేశ వ్యాప్త బంద్ కు ప్రజలు , ప్రజాస్వామిక వాదులు,మేధావులు, సంఘటిత, అసంఘిటిత కార్మికులు,కార్మిక సంఘాలు మద్దతు పలికి విజయ వంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సి.వెంకటేశ్వర్లు,జిల్లా అధ్యక్షులు కె.మనోహర్, ఉపాధ్యక్షులు పి. రెడ్డేయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి రాయచోటి రవిశంకర్, సహాయ కార్యదర్శి ఏం.రవిశంకర్, కోశాధికారి వంగిమళ్ళ రమణ,CPI (ml) రెడ్ స్టార్ నాయకులు మండెం సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
పౌర హక్కుల సంఘం,
కడప జిల్లా శాఖ
తేది: 07/12/2020.
Comments
Post a Comment