కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకవచ్చిన కార్పోరేట్ల అనుకూల , రైతు వ్యతిరేక వ్య్వసాయ చట్టాలను రద్దు చేయాలంటూ నెల రోజులకుపైగా దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్నటి దాకా ఆ చట్టాలను వ్యతిరేకించారు. ఈ నెల 8వ తేదీన జరిగిన దేశవ్యాప్త బంద్ కు కూడా మద్దతు ప్రకటించారు. అయితే బంద్ తర్వాత ఢిల్లీకి వెళ్ళొచ్చిన కేసీఆర్ హటాత్తుగా తన స్టాండ్ ను మార్చుకున్నారు. బహిరంగంగా చెప్పక పోయినా వ్యవసాయచట్టాలకు అనుకూలంగా తెలంగాణలో చర్యలు చేపట్టారు. కేసీఆర్ ఇలా మడమ తిప్పడంపై అన్ని వైపుల నుండి విమర్షలు వస్తున్నాయి. కేసీఆర్ తీసుకున్న యూ టర్న్ పై పౌరహక్కుల సంఘం తెలంగాణ శాఖ తీవ్రంగా మండిపడింది. ఈ మేరకు ఆ సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన పూర్తి పాఠం....
కేంద్ర వ్యవసాయ చట్టాలకు KCR మద్దతుగా యూటర్న్ నిర్ణయం తీసుకోవడం అప్రజాస్వామికం మరియు రైతు వ్యతిరేకచర్య. పౌర హక్కుల సంఘం తెలంగాణ,ఈ నిర్ణయాన్ని ఖండిస్తుంది.
BJP కేంద్రప్రభుత్వం అంబానీ, అదాని కార్పొరేట్లకు లబ్ధిచేకూర్చడానికి తెచ్చిన నూతన వ్యవసాయచట్టాలకు అనుగుణంగా,తెలంగాణ ముఖ్యమంత్రి KCR యూటర్న్ తీసుకోవడాన్ని పౌర హక్కుల సంఘం రైతు వ్యతిరేక చర్యగా భావిస్తోంది. ఒకవైపు ఢిల్లీ సరిహద్దులో మంచుగడ్డకట్టే చలిలో రైతాంగం చారిత్రాత్మక వీరోచితపోరాటం చేస్తుంటే,వీరికి మద్దతుగా దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలు, ప్రజాసంఘాలు, వామపక్ష పార్టీలు, ట్రేడ్ యూనియన్లు అండగా ఉండి ఉద్యమిస్తోంటే, మొదట్లో KCR వ్యవసాయ చట్టాల రద్దు కొరకు మద్దతు ప్రకటించి, రైతుల దేశవ్యాప్త 8 డిసెంబర్,2020 బందులో TRS పార్టీ కార్యకర్తలు హైవే లలో ఆనాడు MLA, MP లు,KTR, హరీష్ రావు లు పాల్గొన్నారు. ఢిల్లీ కి పోయి KCR, మోడీ, అమిత్షా లను కలిసి రహస్య చర్చలు జరిపి వాళ్ళతో మిలాఖత్ అయిపోయినారు.,
BJP కేంద్ర ప్రభుత్వం,రాష్ట్రాల-కేంద్రం మధ్యనున్న ఫెడరల్ విలువలను ధ్వంసం చేసి KCR ను బెదిరించో, భయపెట్టో లొంగదీసుకుంటేనే, ఇప్పుడు రైతువ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని అర్థం అవుతుంది.రాజ్యాంగ బద్ధంగా ఉన్న ఫెడరల్ విలువలను పాటించాల్సిన కేంద్ర ప్రభుత్వం KCR, జగన్, ఇతర ముఖ్యమంత్రులను పిలిపించుకుని బలంతంగా చట్టాలకు మద్దతు ఇప్పిచ్చు కోవడం, కేరళ గవర్నర్, ఆ రాష్ట్రం నూతన వ్యవసాయ చట్టాల రద్దుకొరకు తీర్మానం ప్రవేశం పెట్టడానికి అసెంబ్లీ సిట్టింగ్ అనుమతి ఇవ్వకపోవడం లాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్ట.
ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ముఖ్యమంత్రి గా తీసుకున్న నిర్ణయాలు కావు,ముఖ్యమంత్రి అంటేనే అత్యంత బాధ్యత గల వ్యక్తి. ఇవి.ఏదైనా ఒక సమస్యకు, ఆందోళనకు మద్దతుఇస్తున్నామంటే ఒక శాస్త్రీయ దృక్పథం ఉండాలే.కాని KCR తన ప్రయోజనాలే లక్షంగా మెదులుతున్నారు. దుబ్బాక ఉపఎన్నికల్లో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటమి అనంతరం తన అవసరాలు ఉన్నాయి కనుక, KCR రైతు ఉద్యమానికి మద్దతు తెలిపితే కూడా కారణం ఏదైనా రైతులకు మద్దతు, నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉన్నదని తెలంగాణ మేధావులు, ప్రజాస్వామిక వాదులు హర్షించారు. ఇప్పుడు యూటర్న్ తీసుకుని రైతులపంటల కొనుగోలు కేంద్రాలు తెలంగాణ లో ఉండవని, తమ పంటల ఉత్పత్తులను రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చునని, సర్కార్ వ్యాపార సంస్థ కాదని,ధర ఎక్కడ ఎక్కువస్తే అక్కడే పంటలను అమ్ముకోవాలని, కొత్త వ్యవసాయ చట్టాలు ఇదే చెపుతున్నాయని నిర్ణయం తీసుకున్నాడు. ఇది అప్రజాస్వామిక వైఖరి, రైతు వ్యతిరేక నిర్ణయం. ఇటువంటి పనులు చేయకుండా KCR రైతుల పక్షాన నిలబడాల్సివుంది.
జగిత్యాల జైత్రయాత్ర, సిరిసిల్లా, కరీంనగర్, అదిలాబాద్ రైతాంగ పోరాటాల గడ్డయిన తెలంగాణ పోరాటాల స్ఫూర్తితో, ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణరాష్ట్రంలో ఇటువంటి రైతు వ్యతిరేక చట్టాలకు అండగా ఉండవద్దని, తెలంగాణ ముఖ్యమంత్రి KCR తిరిగి ఆలోచించాలని, తెలంగాణ పక్షాన, యావత్ రైతాంగం పక్షాన, పౌరహక్కుల సంఘం తెలంగాణ విజ్ఞప్తి చేస్తుంది. అదే విదంగా తెలంగాణ లోని బుద్ధిజీవులందరూ, KCR తీసుకున్న యూటర్న్ ను వ్యతిరేకించాలని నూతన వ్యవసాయ చట్టాల రద్దుకై పోరాడుతున్న రైతాంగానికి అండగా నిలబడాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తుంది.
1.ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, అధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
2.N. నారాయణరావు,ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం తెలంగాణ.
4.మాదన కుమారస్వామి, సహాయ కార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ
సాయంత్రం,5:30.
28,డిసెంబర్,2020.
హైదరాబాద్.
పౌర హక్కుల సంఘం తెలంగాణ.
No. of visitors : 147
 Suggested Posts
10 results found !
 | పీకేఎం కోటి అరెస్టు - ఖండించిన ప్రజాసంఘాలు | 
 | అక్రమ అరెస్టులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చే న్యాయ విచారణ జరిపించాలి - CLC | 
 | రైతులపై పోలీసులను ఉసిగొల్పిన బీజేపీ ప్రభుత్వం చర్యలు దుర్మార్గం - CLC | 
 | దేశ వ్యాప్త సమ్మె:అక్రమ అరెస్టులను ఖండించిన పౌర హక్కుల సంఘం | 
 | నాన్న జ్ఞాపకాల అన్వేషణలో - స్వేచ్ఛ | 
 | తెలంగాణలో జరుగుతున్న ఎన్కౌంటర్లపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయ విచారణ జరిపించాలి -CLC | 
 | ప్రజల పంటలను ధ్వంసం చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ... నిజనిర్దారణ కమిటీ రిపోర్ట్ | 
 | ఏపీ జైళ్ళలో కరోనా పాజిటీవ్....ఖైదీలను విడుదల చేయాలి | 
 | ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా పీజుల దోపిడీని అరికట్టాలి -CLC | 
 | గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ది నయీమ్ కథే....వాడుకొని అవసరం తీరాక చంపేశారు | 
 | తండ్రి పోరాటంలో... 11 ఏళ్ళ ఈ రైతు బిడ్డ పొలంపనుల్లో... | 
 | రాత్రంతా సెంట్రీ...పగలంతా ఆహార పంపిణీ.... ఓ తల్లి పోరు దారి | 
 | మన్ కీ బాత్ కు వ్యతిరేకంగా పళ్ళాలు మోగించిన రైతులు... యూట్యూబ్లో మోడీకి డిజ్ లైక్ ల వెల్లువ | 
 | కోర్టునే మోసం చేయాలని చూసి అడ్డంగా బుక్కైన బీజేపీ ఎమ్మెల్యే..! | 
 | రైతాంగ ఉద్యమం: నినాదాలు రాసిన పతంగులు ఎగిరేసి వదిలేస్తున్న యువత - అవిప్రజలకు చేరుతాయని ధీమా | 
 | రైతాంగ ఉద్యమం ఎఫెక్ట్: బీజేపీకీ మాజీ ఎంపీ రాజీనామా | 
 | ప్రభుత్వం ముందు 4 అంశాల ఎజెండా ఉంచిన రైతులు - 29 న చర్చలకు సిద్దమని ప్రకటన | 
 | రైతు ఉద్యమ సెగ: ఎన్డీఏ నుండి వైదొలిగిన మరో పార్టీ | 
 | రైతు వ్యతిరేక ప్రచారంచేయబోయిన బీజేపీ నేతలు - తరిమికొట్టిన రైతులు | 
 | ట్రాక్టర్లతో పోలీసు బారికేడ్లను బద్దలు కొట్టి ముందుకు సాగిన రైతులు...ఉత్తరాఖండ్ లో తీవ్రమైన ఉద్యమం | 
 | ముఖ్యమంత్రికి నల్ల జెండాలు చూపించిన రైతులపై హత్యాయత్నం కేసులు | 
 | హెలిప్యాడ్ ను తవ్విపడేసిన రైతులు - ప్రోగ్రాం రద్దు చేసుకున్న డిప్యూటీ సీఎం | 
 | పీకేఎం కోటి అరెస్టు - ఖండించిన ప్రజాసంఘాలు | 
 | రైతుల పోరాటానికి మద్దతుగా రాజకీయ ఖైదీల నిరాహార దీక్ష | 
 | Political prisoners on hunger strike in Taloja jail in support of farmersʹ movement | 
 | గ్రామగ్రామాన కవాతులు - ముందుండి నడిపిస్తున్న మహిళలు | 
 | ఈ అమ్మలకు సలామ్... వీళ్ళే ఈ దేశానికి మార్గం చూపించబోతున్నారా ? | 
 | రైతుల పేజ్ ను బ్లాక్ చేసిన ఫేస్బుక్ - తీవ్ర నిరసనలతో పునరుద్దరణ | 
 | మహారాష్ట్ర నుండి ఢిల్లీకి బయలుదేరిన వేల మంది రైతులు | 
 | ʹకశ్మీర్ ఆగ్రహ కారణాలుʹ ... కశ్మీర్ పై ʹమలుపుʹ మరో పుస్తకం | 
 | భార్యతో కెనడా యాత్రను మానేసి రైతులకు ఉచిత కటింగులు చేస్తున్న కురుక్షేత్ర యువకుడు | 
 | ఉద్యమంలో పాల్గొనడానికి 60 ఏండ్ల రైతు సాహసం...1000 కిలోమీటర్లు.. 11 రోజులు.. సైకిల్ పై ప్రయాణం | 
 | నిరసనల్లో పాల్గొన్న రైతులకు 50 లక్షల రూపాయల పూచీకత్తు ఇవ్వాలని నోటీసులు | 
 | గాడిద పెండతో నకిలీ మసాలాలు తయారు చేస్తున్న హిందూ వాహిని నాయకుడి అరెస్ట్ | 
 | వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆత్మహత్య చేసుకున్న సిక్కుల మత గురువు | 
 | ముంబై హైకోర్టులో ఈ రోజు.... వివి కవిత వినిపించమన్న న్యాయమూర్తి | 
 | అసలు ʹతుక్‌డే తుక్‌డే గ్యాంగ్ʹ బీజేపీనే .... బీజేపీ మాజీ మిత్రపక్షం | 
 | అక్రమ అరెస్టులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చే న్యాయ విచారణ జరిపించాలి - CLC | 
 | కరోనా సంక్షోభం లో వీళ్ళ సంపద లక్షలకోట్లు పెరిగింది | 
 | అస్సాంలో మళ్ళీ ప్రారంభమైన CAA వ్యతిరేక పోరాటం | 
 | దళిత యువకుడిని పెళ్ళి చేసుకుందని స్వంత సోదరిని కాల్చి చంపిన కులోన్మాదులు | 
 | ఈ దేశం కోసం... రైతు ఉద్యమంలో 19 ఏళ్ళ ఎన్నారై అమ్మాయి | 
 | రైతుల ఉద్యమానికి మద్దతుగా పంజాబ్ డీఐజీ రాజినామా | 
 | ʹముందు ఖాలిస్తానీ అన్నారు..తర్వాత పాకిస్తానీ అన్నారు..ఇప్పుడు మావోవాదీ అంటున్నారుʹ | 
 | మూడు, ఆరేళ్ళ ఈ చిన్నారులపై కేసు నమోదు చేసిన యోగి సర్కార్ | 
more..
Comments
Post a Comment