27.12.20 ఉదయం11am కి శ్రీకాకుళం అంబెడ్కర్ విజ్ఞాన మందిరం వద్ద UAPA రద్దు కమిటీ శ్రీకాకుళం జిల్లా (చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం) ఆధ్వర్యంలో పత్రి.దానేసు(పౌరహక్కుల సంఘం)అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో ప్రజాసంఘాల నాయకులను అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.రాష్ట్రంలో వివిధ ప్రజాసంఘల నాయకులైన అంజమ్మ (అమరుల బంధుమిత్రుల సంఘం)రాజేశ్వరి(చైతన్య మహిళ సంఘం) కొండారెడ్డి ఆంజనేయులు,అన్నపూర్ణ,(ప్రగతిశీల కార్మిక సంఘం) క్రాంతి(న్యాయ విద్యార్థిని)J. కోటి,విజయ్(ప్రజకల మండలి) లను అక్రమంగా అరెస్టు చేయడం రాజ్యాంగ వ్యతిరేక చర్యగా. దేశవ్యాప్తంగా ప్రజా వ్యతిరేక పాలన మోడీ,షా లు దళిత,రైతు,గిరిజనులు,మత మైనార్టీల హక్కులు కలరాస్తుంటే హక్కులు కోల్పోయిన వారికి అండగా ఉన్న నాయకులపై అక్రకేసులు భన్వయించడం మాట్లాడే, ప్రశ్నించే హక్కులను కలరాయడంగా , కేంద్ర ప్రభుత్వ చేస్తున్న అరాచక పాలనను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమర్ధించడం అత్యంత దారుణం అని వక్తలు అన్నారు,ఈ అక్రమ అరెస్టు లను మేధావులు, విద్యార్థులు దళితులు ప్రజలు ఖండించాలని ,UAPA రద్దుకై జరుగు పోరాటాలను మద్దతు తెలిపాలని వక్తలు పిలుపు నిచ్చారు.
Comments
Post a Comment