హక్కుల ఉద్యమాన్ని బలోపేతం చేయడమే నిజమైన నివాళి
__ ప్రొఫెసర్ శేషయ్య సంస్మరణ సభలో వక్తలు.
**. **
పౌర హక్కుల ఉద్యమ నేత, రెండు తెలుగు రాష్ట్రాల సమన్వయ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ శేషయ్య సంస్మరణ సభ నేడు స్థానిక హార్ట్ ఫౌండేషన్ మీటింగ్ హల్ నందు నిర్వహించబడింది. పౌరహక్కుల సంఘం కర్నూలు జిల్లా కార్యదర్శి అల్లాబాకష్ అధ్యక్షతన జరిగింది.ముఖ్య అతిథులుగా రాష్ట్ర పౌర హక్కుల సంఘం సహాయ కార్యదర్శి C. వేంకటేశ్వర్లు, విప్లవ రచయితల సంఘం నాయకులు పాణి, హై కోర్ట్ అడ్వకేట్, అమరుడు పురుషోత్తం కుమార్తె స్వేచ్చ హాజరయ్యారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి C. వేంకటేశ్వర్లు.. నక్సలైట్ ల పేరిట పోలీసులు చేస్తున్న హత్యలను
నిరసించడానికి ఆవిర్భవించిన పౌరహక్కుల ఉద్యమం తర్వాత కాలంలో విస్తృతమై, ఆదివాసీ, గిరిజన సమస్యలు, రైతు కూలీ సమస్యలు, దళిత సమస్యలను మహిళా సమస్యను, ప్రభుత్వాల ఫాసిస్ట్ విధాలను వ్యతిరేకిస్తూ ఉద్యమాలను నిర్వహించిందని, హక్కులకొరకు ఉద్యమిస్తూనే ఆరుగురు నాయకులను కోల్పోయిందని, అయినామొక్కవోని ధైర్యంతో పని చేస్తూ పని చేస్తూవుందని, ప్రభుత్వాలు అనుసరించే అన్ని రకాల, పీడన లకు, దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతుందని తెలిపారు. విప్లవ రచయితల సంఘం నాయకులు పాణి మాట్లాడుతూ రాజ్యాంగ విలువలు అంతరించి పోతున్న ఈ తరుణంలో పౌర హక్కుల కొరకు విలువలతో, పనిచేయడం చాలా కష్టమైన పని అని, దాన్ని ఒక భాద్యతగా మనందరం స్వీకరించాలని, త్యాగాలకు సిద్ధమై నప్పుడే పౌరహక్కుల ఉద్యమం లో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ శేషయ్య, కామ్రేడ్ పురుషోత్తం గారలు నిజాయితీ తో సంఘం విలువల కొరకు పనిచేశారని తెలిపారు. పురుషోత్తం కుమార్తె హై కోర్టు అడ్వకేట్ స్వేచ్ఛ
" అతడొక ధిక్కారం" అనే పురుషోత్తం జ్ఞాపకాల పుస్తకాన్ని ఆవిష్కరించారు. పేద ప్రజల హక్కుల సాధన కొరకు తమ జీవితాన్ని బలి పెట్టిన నాయకుల జీవితాలు మనకు ఆదర్శం కావాలని, ప్రొఫెసర్ శేషయ్య, పురుషోత్తం గారలు చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈనాటి సంస్మరణ సభలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్ J.V. కృష్ణయ్య, POP నాయకులు శ్రీనివాసరావు, యోహాన్, DTF నాయకులు గట్టు తిమ్మప్ప, కుల నిర్మాణా పోరాట సమితి నాయకులు A.V. సుబ్బారాయుడు, మాల మహానాడు నాయకులు కుందా వెంకటేశ్వర్లు, రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ భాస్కర రెడ్డి, B.C. సంక్షేమ సంఘం నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, ఓంకార్ యాదవ్, గారలు పాల్గోని ప్రసంగించారు.
__ పౌర హక్కుల సంఘం (CLC),
కర్నూల్ జిల్లా శాఖ.
Comments
Post a Comment