ప్రజాస్వామిక తెలంగాణ స్వాప్నికుడు ఆకుల భూమయ్య కు జోహార్లు
*భూమయ్య 7వ వర్ధంతి సందర్బంగా నివాళులు అర్పించిన ప్రజా సంఘాల నాయకులు*
ఈ సందర్బంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా కన్వీనర్ గుమ్మడి కొమురయ్య మరియు పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి లు మాట్లాడుతూ వరంగల్ లో B.ed పూర్తి చేసిన తర్వాత ఉపాధ్యాయ వృత్తి ని కొనసాగిస్తూ జగిత్యాల జైత్ర యాత్ర కు సంపూర్ణ మద్దతు ప్రకటించి, అందరికి విద్యా అందాలని దానికి దీక్షుచి లాంటి ఉపాధ్యాయ సంఘం ఉండాలని APTF ను స్థాపించి, శాస్త్రీయ విద్యా విధానం ద్వారానే అది సాధ్యమని DTF అనే ఉపాధ్యాయ సంఘాన్ని స్థాపించి దానికి వ్యవస్థాపాక అధ్యక్షులుగా ఉన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం వరంగల్ డిక్లరేషన్ కు సంపూర్ణ మద్దతూ ప్రకటించారు. అలాగే జనసభకు కన్వీనర్ గా, ప్రజాసంఘాల సమన్వయ సమితి కన్వీనర్ పనిచేసారు.ప్రజాస్వామిక తెలంగాణ ద్వారానే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయని గద్దర్ తర్వాత తెలంగాణ ప్రజా ఫ్రంట్ కు అధ్యక్షులు గా ఎన్నుకోబడ్డారు.సీమాంద్ర పెట్టుబడిదారుల దోపిడీని ప్రశ్నిచ్చినందుకు టిప్పర్ రూపంలో ఆంధ్ర పాలకులు హత్యాచేశారు. కావున భూమయ్య హత్యపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చే న్యాయ విచారణ జరిపించాలని, దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేస్తున్న నాయకులను విడుదల చేసి,అక్రమ కేసులను ఎత్తివేయాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం లో
1.GAV ప్రసాద్,అధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
2.ఏనుగు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
3.పుల్ల సుచరిత,సహాయ కార్యదర్శి,పౌర హక్కుల సంఘం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
4.నార వినోద్, కోశాధికారి,పౌర హక్కుల సంఘం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
5.పొగుల రాజేశం, EC మెంబర్,పౌర హక్కుల సంఘం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
6.కడ రాజన్న,EC మెంబర్,పౌర హక్కుల సంఘం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
7.మోటపలుకుల వెంకట్,EC మెంబర్,పౌర హక్కుల సంఘం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
8.బాలసాని రాజయ్య,కన్వీనర్, విరసం,ఉమ్మడి కరీంనగర్ జిల్లా
9.గాండ్ల మల్లేశం, జిల్లా కమిటీ మెంబర్,తెలంగాణ ప్రజా ఫ్రంట్,పెద్దపెల్లి జిల్లా కమిటీ.
10.T. జైపాల్, TPF,మంచేరియల్ జిల్లా అధ్యక్షుడు.
11.కొత్తూరి రవిందర్, ప్రజా సంఘాల నాయకులు.
12.ముడిమడుగుల మల్లన్న,అధ్యక్షుడు, తెలంగాణ రైతు సాధన సమితి.
13. ఈదునూరి ప్రేమ్ AISF జిల్లా ప్రధాన కార్యదర్శి
అమరవీరుల స్తూపం
పెద్దపెల్లి.
24/12/2020
Comments
Post a Comment