పి కె ఎం కోటి అరెస్ట్ అక్రమం | పౌర హక్కుల సంఘం

ప్రజా కళా మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జంగాల కోటేశ్వరరావు(కోటి)ని ఈరోజు,23 డిసెంబర్,2020, ఉదయం, నాగోల్ హైదరాబాద్ లో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని పౌర హక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తున్నది. బేషరతుగా విడుదల చేయాలి.

డప్పు అనేది సాంప్రదాయ కళాకారుల  వాయిద్యం. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని దళిత వర్గాలతో  సంబంధం కలిగి ఉంది. ఇది ఒక చెక్క చట్రం, 6–8 అంగుళాల వ్యాసార్థంలో ఉంటుంది, ఒక గేదె చర్మం దానిపై గట్టిగా విస్తరించి ఉంటుంది. ఇది రెండు చెక్క కర్రలతో ఆడతారు. సిర్రే అని పిలువబడే తొమ్మిది అంగుళాల పొడవైన గుండ్రని కర్ర  పుల్లా అని పిలువబడే సన్నగా  పొడవైన కర్ర. శతాబ్దాలుగా, డప్పును పండుగలు, ఆచారాలలో,  బహిరంగ ప్రకటన వ్యవస్థగా ఉపయోగిస్తున్నారు. కోటి లాంటి వారు ప్రజల్లో చైతన్యం పెంచటానికి డప్పును  ఉపయోగిస్తున్నారు.  హక్కులు,  సమానత్వం,  మానవ గౌరవం,  చైతన్యాన్ని వ్యాప్తి చేయడానికి ప్రజా కళా మండలి డబ్బుతో పాటలను ఆలపిస్తుంది. అన్యాయం,  కుల వివక్షకు వ్యతిరేకంగా పీకే ఎం నాయకుడు కోటి గళం విప్పాడు.

 ఇప్పుడు ప్రభుత్వానికి డప్పు,  డప్పు వాయించే పుల్ల కూడా ప్రభుత్వానికి ప్రమాదకరమైన ఆయుధాలుగా కనిపిస్తున్నాయి.  వాటిని పట్టుకుని వారందరూ పైన కూడా దేశద్రోహం కేసులు పెడుతున్నారు.

గౌరవంగా బతికే  హక్కు అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గౌరవంతో జీవించే ప్రాథమిక హక్కు  అంతర్భాగం.  విచారణ ప్రారంభానికి ముందే ఒక వ్యక్తిని 'ఉగ్రవాది' అని పేర్కొనడం, ట్యాగ్ చేయడం జరగకూడదు. ఇది  చట్టానికి పూర్తి వ్యతిరేకం. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీసులు ప్రజా హక్కుల కోసం మాట్లాడే ప్రతి ఒక్కరిని మావోయిస్టు అని  చెపుతున్నారు.  అలా దుష్ప్రచారం చేస్తున్నారు. దుష్ప్రచారాన్ని చేయటమే కాక వాళ్ళ పై ఉపా కేసులు కూడా అక్రమంగా పెడుతున్నారు. ఇప్పుడు వరకు సుమారు 10 మందిని ఆంధ్రప్రదేశ్లో అక్రమంగా ఉపా చట్టం కింద అక్రమంగా అరెస్టు చేశారు.  

ఉపా లోని కొత్త సెక్షన్ 35 ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా పేర్కొనడానికి,  చట్టం  షెడ్యూల్ 4 లో అతని  గుర్తింపును చేర్చడానికి కేంద్రాన్ని అనుమతిస్తుంది. అయితే అంతకుముందు సంస్థలను మాత్రమే ఉగ్రవాద సంస్థలుగా తెలియజేయవచ్చు.  ఈ సవరణ ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా పేర్కొనడానికి గల కారణాలను పేర్కొనలేదు.  అటువంటి విచక్షణతో, నిర్దేశించని,  అపరిమితమైన అధికారాలను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం ఆర్టికల్ 14 కు విరుద్ధం.

ఉపా  కింద ఉమర్ ఖలీద్ (జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) విద్యార్థి నాయకుడు) మరియు మీరన్ హైదర్,  సఫూరా జర్గర్ (జామియా మిలియా ఇస్లామియా (జెఎంఐ) విశ్వవిద్యాలయపు  ఇద్దరు  విద్యార్థులు) పై ఢీల్లీ పోలీసులు బుక్ చేసినప్పుడు క్రూరమైన యుఎపిఎ వాడకానికి మరొక ఉదాహరణ కనిపించింది. CAA పై మత హింసను ప్రేరేపించడానికి కుట్ర పన్నినందుకు JMI నుండి వచ్చిన విద్యార్థులను అరెస్టు చేశారు, దీనిని పోలీసులు "ముందస్తుగా కుట్ర" అని చెప్పారు.

తెలుగు రాష్ట్రాలలో ప్రజా సంఘాలను నిర్వీర్యం చేయాలనే కుట్రను ప్రభుత్వాలు పన్నాయి. రోజుకు ఒకరు చొప్పున ప్రజాసంఘాల నాయకులు అందర్నీ కూడా  అక్రమ కేసులు పెట్టి జైల్లో వేయాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. బహుశా కొన్ని రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రజాసంఘాల అన్నీ  కూడా నిర్వీర్యం చేయబడతాయి. ఎందుకంటే వాటి నాయకులు జైలులో ఉంటారు కాబట్టి. అప్పుడు ప్రతిపక్షాలు  అయిన  రాజకీయ పార్టీల వంతు  వస్తుంది.

ఇప్పటివరకు ప్రతిపక్షాలపై కక్షపూరితంగా అక్రమ కేసులు మాత్రమే పెడుతున్నారు.  భవిష్యత్తులో వారిపై దేశద్రోహం కేసులు,  ఉగ్రవాద కేసులు కూడా పెడతారు. న్యాయ స్థానంలో ఉన్న న్యాయవాదులే ఆంధ్రప్రదేశ్ లో  పోలీసుపాలన  నడుస్తోందని ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు. అటువంటి న్యాయవాదులపై ప్రభుత్వం ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళని ఇక్కడి నుంచి బదిలీ చేయాలని విన్నపాలు చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన న్యాయమూర్తుల పరిస్థితే  అగమ్యగోచరంగా ఉన్నప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. న్యాయమూర్తులనే  బ్లాక్ మెయిల్ చేస్తున్న ప్రభుత్వాలకి,  ప్రజాసంఘాలు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు పెద్ద  విషయం కాదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ కన్నా హీనమైన  ఫాసిస్టు పాలన నడుస్తోంది.

 ఈ నేపథ్యంలో అన్ని ప్రజా సంఘాలు,  కుల సంఘాలు బహుజన సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ఏక తాటిపై నిలబడి ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. నిజానికి ఉపా కేసును రివ్యూ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు  ఉంది. ఇప్పటికే దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఊపా చట్టం రివ్యూ చేయబడి అక్కడ ఉపా కింద అరెస్ట్ అయిన వారిని రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో స్వయంగా రాష్ట్ర ప్రభుత్వాలే అక్రమ కేసులను ప్రజాసంఘాల నాయకులపై  పెడుతున్నాయి. ఈ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలి.

ప్రజాకళా మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగాల కోటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు విజయ్, 
ప్రగతి శీలకార్మిక సమైక్య రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నపూర్ణ, ఆంజనేయులు, అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బోప్పుడి అంజమ్మ, చైతన్య మహిళ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులురాలు రాజేశ్వరి, లా విద్యార్ధిని క్రాంతి ని వెంటనే విడుదల చేయాలి. 

- వేదంగి  చిట్టిబాబు
- చిలుకా చంద్రశేఖర్ 
 పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆంధ్ర ప్రదేశ్

Comments