పి కే ఎం కోటిని బేషరతుగా విడుదల చేయాలని నిరసన | తెలంగాణా కమిటీ

ప్రజా కళా మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.బేషరతుగా విడుదల చేయాలి..
 ప్రజా సంఘాల నాయకులపై బనాయించిన ఉపా కేసులను ఉపసంహరించుకోవాలి.
 ఉపా చట్టాన్ని రద్దు   చేయాలి
          
     నిన్న 23,డిసెంబర్,2020, హైదరాబాద్ నాగోల్ లో తన నివాసం నుండి యూనిఫారం లేని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రజాకళామండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె. కోటేశ్వరరావు (కోటి)ను అరెస్ట్ చేసి, ఏపీకి తరలించడాన్ని పౌర హక్కుల సంఘం మరియు ప్రజాసంఘాలు  తీవ్రంగా ఖండిస్తున్నాయి . గత నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో మరియు నిన్నటి హైదరాబాద్ కోటి అరెస్టుతో ప్రజా సంఘాల కార్యకర్తల అరెస్టులో ఇది ఎనిమిదవది. అందరిలాగానే ఇంటి పై దాడి చేయడం, అరెస్ట్ కు సంబంధించిన చట్టబద్ధ నియమాలు పాటించకపోవడం, ఉపా కేసుల్లో అక్రమంగా ఇరికించి జైలుకు పంపడం...  ప్రజా సంఘాల ప్రశ్నించే గొంతును అణిచివేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వము మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అనుసరించే పద్ధతి గా మారిపోయింది.

        మూడు దశాబ్దాలుగా ప్రజా సాంస్కృతిక రంగంలో కవిగా, గాయకునిగా కోటి సుప్రసిద్ధుడు. ప్రజా క్షేత్రములోని అనేక రంగాలలో... అలాగే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ పాటగా కోటి తెలంగాణ ప్రజలకు సుపరిచితుడు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత కూడా టిఆర్ఎస్ పార్టీ చేసిన వాగ్దానాలను అమలు చేయాలని, ప్రత్యేక తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్షలను సాకారం చేయాలని ఊరూరా తిరిగి ప్రజలను చైతన్యవంతం చేస్తూనే ఉన్న ప్రజాగళం కోటిది. నేడు గత29 రోజులుగా ఢిల్లీసరిహద్దుల్లో రైతాంగం చేస్తున్న ఉద్యమానికి బాసటగా శక్తిమంతమైన పాటలు రాసి అండగా నిలబడ్డ కలం,గళం కోటిది. ఈ ప్రశ్నించే గొంతును నొక్కి వేయడానికి UAPA, IPC, APPSA చట్టాల కింద అక్రమ కేసులు పెట్టి కొంతకాలము జైల్లో ఉంచడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పన్నిన కుట్ర లో భాగమే ఈ అరెస్టు. 
         రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజా సంఘాల నాయకులను అక్రమ అరెస్టు చేసి అప్రకటిత ఎమర్జెన్సీని అమలు పరుస్తున్నారు. చైతన్య మహిళా సంఘం, అమరుల బంధుమిత్రుల సంఘం, ప్రగతిశీల కార్మిక సమాఖ్య, ప్రజా కళా మండలి కార్యకర్తలపై బనాయించిన ఉపా కేసులను ఉపసంహరించుకోవాలని, మొత్తంగా ఉపా చట్టాన్ని రద్దు చేయాలని ప్రజాసంఘాలు  డిమాండ్ చేస్తున్నాయి.

1.మాదన కుమారస్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పౌర హక్కుల సంఘం, తెలంగాణ.
2.GAV ప్రసాద్,అధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
3.ఏనుగు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
4.పుల్ల సుచరిత,సహాయ కార్యదర్శి,పౌర హక్కుల సంఘం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
5.నార వినోద్, కోశాధికారి,పౌర హక్కుల సంఘం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
6.పొగుల రాజేశం, EC మెంబర్,పౌర హక్కుల సంఘం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
7.కడ రాజన్న,EC మెంబర్,పౌర హక్కుల సంఘం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
8.మోటపలుకుల వెంకట్,EC మెంబర్,పౌర హక్కుల సంఘం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.
9.బాలసాని రాజయ్య,కన్వీనర్, విరసం,ఉమ్మడి కరీంనగర్ జిల్లా
10.గుమ్మడి కొమురయ్య,కన్వీనర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్,పెద్దపెల్లి జిల్లా కమిటీ.
11.గాండ్ల మల్లేశం, జిల్లా కమిటీ మెంబర్,తెలంగాణ ప్రజా ఫ్రంట్,పెద్దపెల్లి జిల్లా కమిటీ.
12.రాజు,జిల్లా కమిటీ మెంబర్,తెలంగాణ ప్రజా ఫ్రంట్,పెద్దపెల్లి జిల్లా కమిటీ.
13.గూళ్ల రాజు,కన్వీనర్,కూనారం భూపోరాట సాధన సమితి,కూనారం.
14.ఎరుకల రాజన్న,కార్యదర్శి, తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి.
15.పులిపాక రవిందర్, ప్రజా సంఘాల నాయకులు. పెద్దపెల్లి.
16.ఈదునూరి ప్రేమ్ కుమార్,అధ్యక్షుడు, AISF, పెద్దపెల్లి జిల్లా.

తెలంగాణ అమరుల స్తూపం.
24-12-20 20,పెద్దపెల్లి.

Comments