క్రాంతిని కోర్టులో హాజరు పర్చాలి | ఆంధ్రప్రదేశ్ కమిటి

గుంటూరు పట్టణంలోని సంజీవ నగర్ లోని పోట్లూరి క్రాంతి ఇంట్లో ఉండగా పగలు 12 గంటల సమయంలో షమారు 8 మంది సివిల్ డ్రస్ లో వచ్చిన పోలీసులు, అందులో కొంత మంది మహిళలు కూడ వచ్చి ఇంటి తలుపులు మూసి సెల్ ఫోన్లు లాక్కోని బలవంతంగా తమ వాహనంలో ఎక్కించబోయారు.అమె తల్లి అడ్డుపడగా ఆమెను కూడా బలవంతంగా వాహనంలోకి త్రోసి తీసుకు వెళ్ళారు. ఇరువుర్ని కద్దిసేపు గుంటూరులోని నగరంపాలెం,సత్తైనపల్ల పోలీసు స్టేషన్ లలొ ఉంచి పిడుగురాళ్ల వైపు తీసుకెళ్ళారు. పోలీసులు ఎ మాత్రం చట్టబద్దంగా వ్యవహరించలేదు.అరెస్టు చేయటానికి వచ్చిన పోలీసులు ఎలా చట్టబద్దంగా వ్యవహరించాలి ?ఆవిధానాలు ఏవిపాటించ లేదు.తన దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా మవోయిస్ట(cpi)పార్టీ నుండి బయటకు వచ్చింది.తన పై ఉన్న వివిధ కేసులు పూర్తిగా కొట్టివేసిన అనంతరం తన తల్లి తండ్రుల వద్దనే ఉంటూ ధీర్గకాలిక అనారోగ్యనికి చికిత్స పొందుతూ, న్యాయ విద్యను అభ్యసిస్తుంది.తిరిగి ఆమె తప్పడు కేసులు మొపటం ద్వారా ఇటువంటి వారికి ప్రభుత్వం ఇచ్చే సందేశం ఏంటో పోలీసులకు, ప్రభుత్వానికే తలయాలి.
       చిలుకా చంద్రశేఖర్.
  పౌరహక్కుల సంఘం.

Comments