-------------------------------------
ప్రజా కళామండలి "విజయ్"ను కోర్టులో హాజరు పరచాలి.
–----------------------------------
ఈరోజు ఉదయం అనంతపురం జిల్లా, పెదవడుగూరు మండలం, పుప్పాళ్ళ గ్రామంలో ప్రజాకళామండలి జిల్లా కన్వీనర్ "విజయ్" ను గుర్తు తెలియని వ్యక్తులు తాము పోలీసులమని చెప్పి ఇంట్లో నుండి బలవంతంగా తీసుకుని పోయారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసంఘాల నాయకులపై కుట్రపూరితంగా "ఊపా" (Unlawful Activities Prevention Act) చట్టం కింద అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే చైతన్య మహిళా సంఘం నాయకురాలు రాజేశ్వరి(గుంటూరు), ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయకులు కొండారెడ్డి(గుంటూరు), ఆంజనేయులు(చిత్తూరు) తదితరులను "ఊపా" చట్టం కింద అరెస్టులు చేశారు.
ప్రజల సమస్యలపై చట్టబద్ధంగా పోరాడుతూ, వారికి అండగా ఉంటున్న ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, హక్కుల సంఘాలు, మహిళా సంఘాలపై మావోయిస్టు అనుబంధ సంఘాల పేరిట ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోంది. ఒకవైపు రాష్ట్రంలో మావోయిస్టులు లేరు, వారిని పూర్తిగా నిరోధించాం అంటూనే మరోవైపు ప్రజల సమస్యలపై గొంతెత్తి మాట్లాడుతున్న వారిని అనుబంధ సంఘాలంటూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. భూస్వామ్య, సామ్రాజ్యవాద విచ్చలవిడి సంస్కృతిని వ్యతిరేకిస్తూ ప్రజా కళలు అభివృద్ధి చేసే సంఘంను మావోయిస్టు ముద్ర వేసి అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గం.
Comments
Post a Comment