మానవహక్కులు

మానవహక్కులు  అనేది ఒక దేశానికో ఒక వర్గానికి ఒక జాతికో సంబందించిన సమస్య కాదు మానవ హక్కులు ఉల్లంఘన అనేది మనందరికీ సంబందించిన విషయం ప్రపంచంలో 1948 సం.లో  మానవహక్కుల రక్షణ కోసం చట్టం చేయబడినది మన దేశంలో 1993 సంవత్సరం అమలులోకి వచ్చింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2005 సంవత్సరం రాష్ట్ర మానవహక్కుల కమీషన్  ఏర్పడండి*         . ప్రాథమిక హక్కు ఉల్లంఘననే మానవ హక్కుల  మానవహక్కుల ఉల్లంఘన అంటారు.

 పోలీసు వ్యవస్థ మనకి బ్రిటిషు వారి నుంచి సంక్రమించింది. మానవ హక్కులను గౌరవించాలన్న భవన పోలీసులకు లేదు. బ్రిటిష్ వారు మన స్వేచ్ఛను అనణదొక్కడనికి మాత్రమే  పోలీసు వ్యవస్థను ఉపయోగించేవారు. మన దేశంలో పోలీసు వ్యవస్థ ఇలాగే తయారు అయినది.

#సంకెళ్ళు_బేడిలు:- మనదేశంలో నిందితులకు బేడీలు వేయడం అతి మామూలు విషయం.  కానీ చట్టరీత్య నేరం. చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన వ్యక్తులు చట్టాన్ని చూసి అలాంటి చర్యలు చట్టబద్ధమైనవేనని మనలో చాలా మంది అనుకుంటారు. అలాంటిదే ముద్దాయిలకు, నేరస్తులకు సంకెళ్లు వేయడం లాంటివి. 

సంకెళ్లు వేసి నేరారోపణకు గురైన వ్యక్తులను ఊరేగించడం కూడా మనము చూస్తున్నాము. ప్రజలు ఆ విధంగా ఊరేగించాలని కోరుకుంటున్నారు కాబట్టి మేము ఆ విధముగా ఊరేగిస్తున్నాం అంటారు పోలీసులు.

*ఆర్థిక దోపిడీ కూడా మన హక్కుల ఉల్లంఘన  పరిగణిస్తారు. మనదేశంలో పార్లమెంటు చేత ఆమోదించిన హక్కులు  మనవాహక్కులుగా పరిగణిస్తాము.  జీవించే హక్కు, సమనత్వపు హక్కు, స్వేచ్ఛ మొదలైనవి......

*ఎలాంటి ముద్దాయులకు సంకెళ్లు వేయరాదు*

ముద్దాలగా ఉండి  చికిత్స పొందుతున్న వారికి సంకెళ్లు వేయరాదు.  శిక్ష పడిన ఖైదీలకు,  విచారణలో  ఖైదీలకు,  జైల్లో ఉన్నపుడు కోర్టుకి తీసుకెళ్లేన్నప్పుడు, ఒక జైలు నుంచి మరో జైలుకు  తీసుకెళ్ళునప్పుడు, సంకెళ్లు( బంధనాలు)  వేయడానికి వీలు లేదు అని సుప్రీంకోర్టు  పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

పరిపోవడానికి  ప్రయత్నం చేస్తున్నాడని   ఆధారాలు  ఉంటే అలాంటి  వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచి  వ్రాతపూర్వకముగా  అనుమతి పొందాలి.  హింసాత్మక ప్రవృత్తి కలిగిన కేసుల్లో  ముద్దాయులకు సంకెళ్లు వేయమని  మేజిస్ట్రేట్ ఆదేశాలు జరిచేయవచ్చు.

 కోర్టుముందు హాజరు పర్చిన  ముద్దాయిలకి వల్కనీ జ్యుడీషియల్ కస్టిడీకి పంపించిన లేక పోలీసు కస్టిడీకి ఇచ్చినా   మేజిస్ట్రేట్ నుంచి ఆ విషయమై ప్రత్యేకమైన ఉత్తర్వులు ఉంటే తప్ప సంకెళ్లు ఎట్టి పరిస్థితుల్లో వేయరాదు.

*వారెంట్ కేసుల్లో కూడా అరెస్టు చేయడానికి ప్రత్యేకఅనుమతులు తీసుకొని సంకెళ్లు వేయాలి*

 ఎవరైనా వ్యక్తిని పోలీసులు వారెంట్ లేకుండా అరెస్టు చేసినప్పుడు  పై మార్గదర్శక సూత్రాల్ని ఆధారంగా చేసుకొని,అవసరమని భవించినప్పుడు మాత్రమే సంకెళ్లు వేయడానికి అవకాశం ఉంది. ప్రదేశం నుంచి పోలీసు స్టేషన్ వరకు అక్కడి నుంచి మెజిస్ట్రేట్ వద్దకు తీసుకొని వెళ్లేంతవరకు మాత్రమే సంకెళ్లు వెయ్యాలి  మరల కూడా సంకెళ్లు వేయాలంటే మేజిస్ట్రేట్ అనుమతి పొందాలి.  ఈ విషయం అన్ని హోదాలో ఉన్న పోలీసు వారికి వర్తిస్తుంది.  ఒక వేళ సంకెళ్ళువేస్తే కోర్టుధిక్కరణ నేరమని సుప్రీంకోర్టు సిటీజన్స్ దేమోక్రసి V/s  స్టేట్ ఆఫ్ అస్సాం జార్జిమెంట్ 1995సామ్ స్పష్టం చేసింది. కారణాలు లేకుండా మేజిస్ట్రేట్ అనుమతి పొందుకుండా సంకెళ్లు వేస్తే  పోలీసులతో పాటు మేజిస్ట్రేట్ కూడా శిక్షార్హుడు అవుతారు. నష్టపరిహారం కూడా వేయవచ్చు.
బేడీలు(సంకెళ్లు) వేస్తే  ఆర్టికల్స్ 14,19,21  విరుద్ధం.

*అరెస్టు చేసినప్పుడు సంకెళ్లువేయవచ్చు అని ఏచట్టంలో పేర్కొనలేదు.* 
అరెస్టు అంటే ఏమిటో చట్టంలో ఎక్కడ నిర్వహించలేదు. ఒక వ్యక్తిని  శారీరకంగా నిర్బంధించడం అతన్ని కదికలను నిలుపుదల చేయడాన్ని అరెస్టు అంటారు. అయితే నేరం చేశాడని బలమైన ఆరోపణలు   ఉండాలి .అని సుప్రీంకోర్టు 1953 స్పష్టం చేసింది.

అరెస్టు ఉద్దేశ్యం 2 రకాలు
1.అతనిపై ఉన్న క్రిమినల్ ఆరోపణలకు కోర్టుకు జవాబు చెప్పడానికి
2. అతను ఏదైనా నేరం చేయకుండా నిరోధించడానికి.
అరెస్టు శరీరాన్ని తాకడం ద్వారా నిర్బంధించడం ద్వారా  చేయవచ్చు అయితే నిన్ను అరెస్టు చేస్తున్నామని మాటల ద్వారా చెపోయాల్సి ఉంటుంది.

*సంకెళ్లు ఎప్పుడు వేస్తారో తెలుసుకుందాం*

ఎవరినైనా అరెస్టు చేసినప్పుడు విచారణలో ఉన్న ముద్దాయిని  కోర్టుకు తీసుకెళ్ళునప్పుడు  సాధారణంగా సంకెళ్లు వేస్తారు. సంకెళ్లు సాధారణ పరిస్థితుల్లో వేయరాదు. అరెస్టు విషయంలో  అత్యవసరమైనప్పుడు మాత్రమే వేయాలని సుప్రింకోర్టు జోగిందర్ కుమార్ కేసులో స్పష్టంగా చెప్పింది.

అరెస్టు చేసిన వ్యక్తిని  ఆ వ్యక్తి కొరినప్పుడు అతని బంధువులనుగాని న్యాయవాదిని గాని  అతని ప్రయోజనాలని చూసే ఏ వ్యక్తినైనగాని అతను సంప్రదించే అవకాశాన్ని పోలీసులు కల్పించాలి.

కస్టిడీ ఎవరిని చిత్రహించలు పెట్టారాదు ఒకవేళ చిత్రహింసలు గురిచేస్తే ఆర్టికల్ 21 ఉల్లంఘించినట్లే 
కస్టిడి మరణం కన్న అతిహీమైన నేరం మరొక్కటిలేదు.  అలాంటి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోమని సుప్రీంకోర్టు  ఆదేశాలు జారీ చేసింది.

*అరెస్టు విషయంలో మార్గదర్శకాలు*

1.అరెస్టు గాని ఇంటరాగేషన్ గాని చేసినప్పుడు పోలీసు అధికారులు తమపేరు హోదాగల పేరు గల  ప్లేట్లను(గుర్తింపు) ధరించాలి.  అది ఖచ్చితంగా గుర్తించాడు వీలు ఉండాలి.అరెస్టు ఇంటరాగేషన్ పాల్గొన్న అధికారుల వివరాలు  ఈ రిజిస్ట్రర్ నందు నమోదు చేయాలి.
2.అరెస్టు చేస్తున్న అధికారి  అరెస్టు చేసినప్పుడు విధిగా అరెస్టు మెమో తయారు చేసి  దాని మీద సంతకాలు తీసుకోవాలి.  ఈ సంతకం చేసినవ్యక్తి ఆ వ్యక్తి  కుటుంబానికి చెందిన వ్యక్తి గాని, ఆ ప్రాంతంలో గౌరవప్రదమైన  వ్యక్తి అయి ఉండాలి
3.అరెస్టు గురించి   ఆ వ్యక్తి  బందువులకు గాని, స్నేహితులు గాని, తన యోగక్షేమాలు పాటించుకొని వ్యక్తికి గాని తెలియపరచాలి.
4. అరెస్టు అయిన వ్యక్తి బంధువులు స్నేహితులు వేరే జిల్లా,రాష్ట్రం ఉన్నట్లేయితే  లీగల్ ఎయిడ్ సంస్థ ద్వారా  ఆ వ్యక్తులకు అందే విధముగా సంబంధిత పోలీసు స్టేషన్ సమాచారం ఇవ్వాలి.
5.అరెస్టుగాని,నిర్బంధంగానీ చేసిన వెంటనే ఆ విషయాన్ని తమ బంధువులకు  స్నేహితులకు తెలియజేకునే హక్కు పోలీసులు అరెస్టు అయిన వ్యక్తికి కల్పించాలి.
6.అరెస్టు సమాచారాన్ని ఎవరికి తెలియజేశారో ఆ వివరాలు ఏ పోలీసుస్టేషన్ కి ఏ అధికారికి తెలియజేశారో ఆ వివరాలు ఆ వ్యక్తిని ఎక్కడ నిర్బంధించారో అక్కడ ఉన్న డైరీలో  ఏ పోలీసు స్టేషన్లో  ఏ అధికారి పరిధిలో  ఉన్నాడో  నమోదు చేయాలి.
7.అరెస్టు అయిన వ్యక్తిని తప్పకుండా  శారీరక పరీక్షలు చెహించాలి. అతని శరీరం మీద ఉన్న గాయాలను నమోదు చేయాలి మెమో తయారు చేసి సంతకాలు చూపించాలి. ఒక కాపీని అరెస్టు అయిన వ్యక్తికి ఇవ్వాలి. 
8.డిటెన్షన్ లోకి  48 గంటలలోపు  వైద్యపరీక్షలు పొందాలి.
9.మేజిస్ట్రేట్ కి సమాచారం ఇవ్వాలి అన్ని మెమోలు అన్ని డాక్యుమెంట్లను మీద సమాచార నిమితం మేజిస్ట్రేట్ పంపాలి.
10 న్యాయవాది సమక్షంలో  ఇంటరాగేషన్ చేయాలని   అరెస్టు అయినవ్యక్తి కోరితే అలానే చేయాలి.
11. ప్రతి  జిల్లాలోని ప్రతి రాష్ట్రంలో ఉన్న పోలీసు కంట్రోల్ రూములకు అరెస్టు అయిన వివరాలు  నిర్బంధించి స్థలాన్ని/ప్రదేశాన్ని స్పష్టంగా నోటీసులు బోర్టులో ఉంచాలి.

 పై మార్గదర్శకాలు ప్రతి పోలీసు అధికారి  పాటించి తీరాలి పాటించకుంటే  శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి సంబంధిత హైకోర్టు ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

*మానవహక్కుల పరిధి*

బానిస సమాజంలో మానవహక్కుల సమస్య కేవలం  జీవించే హక్కుకు సంబందించిన విషయం ఈ బానిస సంకెళ్లు తెగితే చాలు అని బానిసలు భవిస్తున్నారు.  బౌతికదాడులు  చిత్రహింసలు గొడ్డు చాకిరి  వంశపారంపర్యంగా బానిసత్వం బానిసత్వంపై పోరాటాలు తిరుగుబాట్లు, ప్రతిగటనలు భూస్వామ్యవ్యవస్థలో  వ్యవసాయ కూలీలు పోరాటాలు మానవహక్కుల ఉల్లంఘన కింద వస్తాయి.  

ఇంకో విధంగా చెప్పాలంటే  రాజ్యాంగ ద్వారా సంక్రమించిన హక్కులు  సహజంగా వచ్చిన హక్కులకు భంగం వాటిల్లేవిధముగా చేయడమే మానవహక్కులు ఉల్లంఘనగా పరిగణించవచ్చు.    

 *పెట్టుబడిదారీ విధానం వచ్చేసరికి  పూర్తిగా మారిపోతుంది.*

   జీవించే హక్కు కాకుండా  అనేక హక్కులు మానవహక్కుల పరిధిలోకి వస్తాయి . సమనత్వపు హక్కు, సమాన అవకాశాల హక్కు, దోపిడీ నుండి రక్షణపొందే హక్కు విద్య,ఉద్యోగాల్లో సమనహక్కు మొదలైనవి కూడా మానవహక్కుల కింద పరిగణిస్తారు. కులం, మతం,లింగం,ప్రాంతం, ప్రాతిపదికన విసక్షత చూపరాదు. అల్పసంఖ్యాక, మైనార్టీ తెగలు, జాతులకు చెందిన సాంస్కృతి సాంప్రదాయాలు భాష పరమైనవి కూడా మానవహక్కుల కింద పరిగణిస్తారు.  బాలలు, మహిళలు,వికలాంగులు హక్కులు కూడా మానవహక్కుల కిందకు వస్తారు.                                       

*పోలీసులు చట్టబద్ధంగా నడుచుకోవాలా? లేక చట్టాన్ని అతిక్రమించాలా?*

ఈ చట్టప్రకారం  భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు పొందుపరచబడి అభయం ఇవ్వబడిన వ్యక్తి జీవితం స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం గౌరవం ఇంకా అంతర్జాతీయ ఒప్పందాలలో పొందుపరిచిన హక్కులు భారతీయ కోర్టుల ద్వారా అమలుపరిచే అవకాశం ఉన్న హక్కులన్నీ మానవ హక్కులే.

భారతదేశం పోలీస్ వ్యవస్థ బ్రిటిష్ పాలకుల నుంచి సంక్రమించింది వ్యక్తి స్వేచ్ఛకు మూలాధారం తమ మాగ్నా కార్టా (1250) అని బ్రిటిష్ వారు భావించినప్పటికీ హభియాస కార్పస్ హక్కుల చట్టము 1689 ప్రిన్సి డిక్లరేషన్ 1789 కన్నా పూర్వమే బ్రిటిష వాళ్లు అమల్లోకి తెచ్చినప్పటికీ ఈ హక్కులని వారి పాలనలో మనకు ఇవ్వలేదు. 

పోలీసు వ్యవస్థ సర్వీస్ సంస్థగా కాకుండా ఒక కోర్సుగా మాత్రమే వాళ్లు మనదేశంలో రూపొందించినారు మన దేశ ప్రజలను, వారి స్వేచ్ఛని అణగదొక్కడానికి మాత్రమే మనదేశంలో రూపొందించారు వ్యక్తులంతా స్వేచ్ఛని హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని మన పోలీసులకు తెలియనివ్వలేదు పోలీసులకు ఇచ్చిన లాఠీ డ్రిల్లు లాంటి శిక్షణను కూడా ప్రజలను అణచడానికి కోసం ఇచ్చిన శిక్షణ ఈ డ్రిల్లు వలన బలమైన గాయాలు ఏ విధంగా చేయవచ్చు పోలీసులకు తెలిసిపోయింది ఇది ఆత్మరక్షణకోసం అయినప్పటికీ ఆ డ్రిల్లు ని గాయాలు చేయడానికి మాత్రమే ఉపయోగించారు. ఏవైనా దేశానికి జాతికి ఉపయోగించే పోరాటాలను పోలీసులు తమ బలప్రయోగాన్ని ఉపయోగించి అణచివేయడానికి మాత్రమే పోలీసులని బ్రిటిష్ పాలకులు ఉపయోగించుకున్నారు. పోలీసు ఉద్యోగాలకు శారీరక ధారుడ్యం లాంటి విషయాలపై ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చే వారు క్రమశిక్షణ అనేది పెరేడ్ గ్రౌండ్ నుంచి మాత్రమే వస్తుందన్న బ్రమ కూడా కలిగించారు. శారీరక శిక్షణకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు పాయింట్ ట్రైనింగ్ అని సాధారణంగా తమ శత్రువులను ఎదురుకోవడానికి సాయుధ దళాలకు ఇస్తారు పోలీసులకు ఎదురుగా వచ్చే ప్రతి వ్యక్తి శత్రువే అన్న భావనని వాళ్లకు కలిగించారు.
 
రాజ్యాంగం గురించి ప్రాథమిక హక్కుల గురించి భావన వాళ్లకి ట్రైనింగులో ఇవ్వలేదు. పోలీసులకు కూడా సాయుధ దళాలు మాదిరిగా కాకి(యూనిపోర్మ్) డ్రెస్ ఇచ్చారు.

స్వతంత్రం వచ్చిన తరువాత ఇంకా అప్పటి పరిస్థితులు వున్నాయి. తాము చట్టానికి అతిథులం అన్న భావన పోలీసులలో నెలకొని ఉంది. అందుకే పోలీసులకి చట్టం అంటే గౌరవం అసాధారణ పరిస్థితుల్లో తప్ప సంకెళ్లు వేయకూడదని చట్టం నిర్దేశించిన కూడా పాటించడం లేదు.నేరం జరిగిన వెంటనే ముద్దాయిలను గుర్తించడానికి దొంగిలించబడిన వస్తువులు దొరక పట్టడానికి ప్రజలు మరియు మీడియా కూడా సత్వరం కేసులో నేర పరిశోధన త్వరలో పూర్తి వాలని పోలీసులపై ఒత్తిడి తేరాదు.

  *సంకెళ్లువేయడానికి మార్గదర్శకాలు*

22 డిసెంబర్1994 రోజున ప్రముఖ జర్నలిస్టు కులదీప్ నయ్యర్ సుప్రీంకోర్టుకు సిటిజన్స్ ఫర్ డేమోక్రసీ అనే సంస్థ అధ్యక్షతన ఒక హోదాలో ఒక ఉత్తరం రాశాడు  "నేను కొద్ది రోజుల క్రితం ఓ పేషంటుని చూడడానికి గౌహతిలోని ఒక ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాను అక్కడ బేడిలతో ఉన్న ఏడుగురు టాడా నేరస్తులను చూసి భయభ్రాంతుల్ని అయ్యాను ఆ దవాఖానలో డెటెన్యూలని బంధించిన రూంకి సరి అయిన భద్రత ఉంది బయటి సాయుధులైన పోలీసులు కూడా ఉన్నారు తాళం కూడా వేసి ఉంది అది చూసి నేను వారితో మాట్లాడాను వాళ్లు తమకి కావాల్సిన మందులకి డబ్బులు కూడా తామే ఇస్తున్నాం అని చెప్పారు ఆవిధంగా చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు కోర్టునుంచి ఉన్నప్పటికీ అస్సాం ప్రభుత్వం ఎందుకు చేస్తుందో నాకు అర్థం కాలేదు. ఈ విషయం గురించి అస్సాం ముఖ్యమంత్రి కి ఉత్తరం రాశాను కానీ ఎలాంటి స్పందన లేదు అందుకని సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ఈ ఉత్తరం ద్వారా కోరుతున్నాను.

          ఈ ఉత్తరాన్ని ఆర్టికల్ 32 ప్రకారంగా రిట్ గా సుప్రీంకోర్టు స్వీకరించి ఛీఫ్ సెక్రటరీ, హోం సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది వాదనలు విని సుప్రీంకోర్టు సంకెళ్ళు ఎప్పుడు వేయాల్సి ఉంటుంది అనే విషయం గురించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

          "కేసులో అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలించాం.అక్కడ బంధించిన ఏడుగురు డిటెన్యూలు తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు.గత చరిత్ర తెలియదు వారు హింసాత్మక చర్యలకు అలవాటుపడిన వ్యక్తులని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు వారు విచ్చిన్న శక్తులని, ఆయుధాలు అక్రమ సరఫరా చేశారని ఆరోపణలు మాత్రమే ఉన్నాయి అవసరమైన సంఖ్యలో డ్యూటీలో పోలీసులు ఉన్నారు వాళ్లకు సంకెళ్లు వేశారు అన్నది స్పష్టం.  చికిత్సకోసం ఉన్న వ్యక్తులకు ఆవిధంగా సంకెళ్లు వేయడం అమూల్యమైన చర్య మరొకటి లేదు వాళ్లు పారిపోతారని ప్రభుత్వం భావిస్తే సెక్యూరిటీ గార్డుల సంఖ్యను పెంచాలి అంతేకానీ ఈ విధంగా బందనాలతో కట్టివేయడం అమానుషమైన మరియు మానవ హక్కుల ఉల్లంఘన దాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ సమర్థించుకోవడానికి అవకాశం లేదు అంతర్జాతీయం చట్టంలకు కూడా ఈ చర్య ఉల్లంఘనలే.అందుకనీ ఆ డిటెన్యూ లు ఇంకా దవాఖానాలో ఉంటే వారిని వెంటనే బంధవిముక్తులను చేయాలని ఆదేశిస్తూ ఉన్నాము.
 అంతేకాదు సంకెళ్ళు వందనాలు శిక్ష పడిన ఖైదీలకు గాని విచారణలో ఉన్న ఖైదీలకు గానీ జైల్లో ఉన్నప్పుడు కోర్టుకు తీసుకు వెళ్తున్నప్పుడు గాని జైలు నుంచి ఇంకో జైలుకు తీసుకు వెళ్తున్నప్పుడు గాని మళ్లీ తిరిగి తీసుకు వస్తున్నప్పుడు గాని వేయకూడదని మేము శాసిస్తున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది పోలీసులకు గాని, జైలు అధికారులకి గానీ సంకెళ్ళు వేయమని ఆదేశించడానికి ఈ దేశంలో అధికారం లేదు.

         ఎవరైనా వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడని ఆధారాలు ఉన్నప్పుడు లేక ఆధీనం నుంచి పారిపోతారని కచ్చితంగా భావించినప్పుడు అలాంటి వ్యక్తిని సంబంధిత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి సంకెళ్లు వేయడానికి రాతపూర్వకమైన అనుమతి పొందాలి అరుదైన కేసుల్లో హింసాత్మకమైన ప్రవృత్తి ఉన్నప్పుడు పారిపోవడానికి అవకాశాలు ఉన్నప్పుడు అపాయకరమైన వ్యక్తులని ఋజువు అనిపించినప్పుడు వారు పారిపోకుండా ఉంచడానికి ఎలాంటి ఇతరత్రా చర్యలు లేవని మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేయవచ్చు.

     కోర్టు ముందు హాజరు పరిచిన ముద్దాయిలకు వాళ్ళని జుడిషియల్ కస్టడీకి పంపించిన లేక పోలీస్ కస్టడీకి ఇచ్చిన మెజిస్ట్రేట్ నుంచి ఆ విషయమై ప్రత్యేకమైన ఉత్తర్వులు ఉంటే తప్ప సంకెళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ వేయకూడదు.

  అవసరమని భావించినప్పుడు మాత్రం సంకెళ్ళు వేయడానికి అవకాశం ఉంది అది కూడా అరెస్టు చేసిన ప్రదేశం నుంచి పోలీస్ స్టేషన్ వరకు అక్కడినుండి మేజస్ట్రీట్ వద్దకు తీసికొని వెళ్ళి అంతవరకు మాత్రమే సంకెళ్ళు వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సంకెళ్లు వేయడం విషయంలో మెజిస్ట్రీట్ అనుమతి ఉంటే సంకెళ్లు వేయాలి. మేజిస్ట్రేట్ ఉత్తర్వులు తప్పని సరి  ఉండాలి. ఎవరికైనా ముద్దాయికి సహేతుకమైన కారణాలు ఉన్నప్పుడు మాత్రమే సంకెళ్లు వేయాల్సి ఉంటుంది అలా లేనప్పుడు తగు చర్యలు తీసుకోవడంలో విఫలం అయిన పై అధికారులు మేజిస్ట్రేట్ కూడా శిక్షార్హులవుతారు. అలా సంకెళ్లు వేసినప్పుడు సాధారణంగా డిఎస్పి ఎస్పీలు ఉండరు ఆ విషయం తమకు తెలియదని ఆ సమయంలో మేము లేమని తప్పించుకోవడానికి కూడా వీలు లేదు. సంకెళ్లు వేయకుండా తగు జాగ్రత్తలు కిందిస్థాయి అధికారులకు తెలియకపోవడం కూడా తప్పేనని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేకాదు సంకెళ్ళతో ముద్దాయిలను హాజరుపరచినపుడు ఇలాంటి చర్య మెజెస్ట్రీట్ తీసుకోకపోవడం కూడా శిక్ష అర్హం అవుతుంది (1966 సుప్రీంకోర్టు  (క్రిమినల్) 612)

   సుప్రీంకోర్టు నిర్దేశించిన విధంగా విచారణలో ఉన్న ఖైదీలకు బేడీలు వేయడం సరైనది కాదు జుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు సంకెలతో ఖైదీని హాజరుపరిచినపుడు తీసివేయమని ఆదేశించకపోవడం, ఆవిధంగా తెచ్చిన పోలీసు ఎస్కార్ట్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా తీవ్రమైన విషయమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మానవ హక్కులను పరిరక్షించాల్సిన జుడిషియల్ మెజిస్ట్రేట్ వాటిని పాటించకపోవడం చాలా విచారించదగ్గ విషయమనీ అయితే ఈ మేజిస్ట్రేట్ యువకుడు అయినందువల్ల భవిష్యత్తు చాలా ఉన్నందువల్ల ఎలాంటి షరతులు లేకుండా క్షమాపణ కోరినందుకు శిక్ష విధించడం లేదని సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టం చేసింది. అయితే తమ అసంతృప్తిని, అసమ్మతిని అతని వ్యక్తిగత రికార్డులలో నమోదు చేయాలని సంబంధిత హైకోర్టును ఆదేశించింది.

      అదేవిధంగా ఈ కేసులో ఎస్పి డి.ఎస్.పి ఆ సంకెళ్ళు వేసినప్పుడు అక్కడ లేనందువల్ల ఆ విషయంలో వారికి ప్రత్యక్షంగా సంబంధం లేనందువల్ల వాళ్లని శిక్షించడం లేదుగా అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా తగు చర్యలు తీసుకోనందుకు తమ అసంతృప్తిని వాళ్ల వ్యక్తిగత రికార్డులలో నమోదు చేయాలని చీఫ్ సెక్రటరీ మధ్యప్రదేశ్ ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

         అంతేకాకుండా సంకెళ్లు వేయడానికి సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల సూత్రాలను పోలీస్ మాన్యువల్లో పొందుపరచాలని ఆదేశించింది.

*బేడీలు వేస్తే నష్ట పరిహారం?*

       నిలోలీ గుప్తా గౌహతి హైకోర్టు న్యాయవాది. మానవ హక్కుల సంస్థకు కన్వీనరు. మార్చి 2 1992 రోజు రాత్రి 11 గంటలకు పోలీసు ప్రత్యేక దళం అతన్ని అరెస్ట్ చేసి దగ్గర్లో ఉన్న లాకప్పులో బందించారు తెల్లవారి ఉదయం అతనికి బేడీలు వేసి మిస్సా జైలుకు బస్సులో తీసుకువెళ్లారు ఆయన బేడీలు తీయమని కోరాడు ఆ తరువాత బేడీలు వేయడం గుప్త ప్రశ్నించాడు.ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బేడీలు వేశామని పోలీసులు చెప్పారు. అతన్ని నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం  అరెస్టు చేశారు.

        తనకు బేడీలులు వేసి అగౌరవపరిచారని తన గౌరవానికి భంగం కలిగించారని ప్రజల దృష్టిలో తను కించపరిచారని అందుకని సంబంధిత అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జైలు నుంచి గుప్తా ఉత్తరం పంపించాడు ఆ ఉత్తరాన్ని రిట్ గా స్వీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వానికి పోలీసు అధికారులకు నోటీసు జారీ చేశారు.

        సెక్యూరిటీ నిమిత్తం తప్పనిసరి పరిస్థితుల్లోనే బేడీలు వేయాల్సి వచ్చిందని అంతేకానీ ఉద్దేశపూర్వకంగా బేడీలు వేసింది కాదని ఒకవేళ అతని గౌరవానికి భంగం కలిగినట్లయితే సివిల్ కోర్టులో దావా చేసుకోవాలని అడ్వకేట్ జనరల్ వాదనలు చేశారు.

        గుప్తాని అరెస్ట్ చేసినప్పుడు అతను అరెస్టుకు పూర్తిగా సహకరించాడని తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఎటువంటి ప్రతిఘటన చూపించలేదని ఉద్దేశపూర్వకంగా అతని గౌరవానికి భంగం కలిగించడానికి మాత్రమే బేడీలు వేశారని ఎలాంటి సహేతుక కారణం లేకుండా  బేడీలు వేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19,21 లకు విరుద్ధమని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని నష్టపరిహారం చెల్లించాలని తరపు న్యాయవాది వాదించారు.

       ఇరువైపుల వాదనలు విన్న తరువాత హైకోర్టు  బేడీలు వేయడం న్యాయ సమ్మతం కాదని తీర్పుచెప్పింది. అరెస్ట్ సమయంలో ఎలాంటి  ప్రతిఘటనను చూపలేదని అందుకని జైలుకు బేడీలు వేసి తీసుకెళ్లడం ఏకపక్ష చర్య అని అలా చేయడం గుప్త గౌరవానికి భంగం కలిగించేదని దానివల్ల అతని ప్రతిష్ట ప్రజల దృష్టిలో దిగజారిందని రాజ్యాంగం ప్రసాదించిన 14,19,21 ఆర్టికల్లోని హక్కుల భంగం వాటిల్లిందని హైకోర్టు అభిప్రాయపడింది.

     చట్టాన్ని అమలుచేసి మనిషికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత హైకోర్టు పైన ఉంది పోలీసుల అమానుష ప్రవర్తనను కోర్టు చూస్తూ ఊరుకోదని గుప్తాకు కలిగిన నష్టాన్ని ఎలాంటి పరిహారంతో పూరించలేమని అయితే నష్టపరిహారాన్ని డబ్బు రూపంలో ఇవ్వమని ఆదేశించడం తప్ప ఇతర చర్యలు కోర్టు దగ్గర ఏవీలేవని అందుకని అతనికి 15 వేల రూపాయలు నష్టపరిహారం ప్రతివాదులు మూడు నెలల్లో చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.

    *అరెస్ట్ చేయాలంటే సంకెళ్ళు తప్పనిసరిగా వేయాల్సి ఉంటుందా* ??

       అరెస్టు చేసినప్పుడు సంకెళ్ళు వేయాలని చట్టంలో ఎక్కడా పేర్కొనలేదు అరెస్టు అంటే ఏమిటి?
 అరెస్టు ఎలా చేస్తారు?

       అరెస్టు అంటే ఏమిటో చట్టములో ఎక్కడ నిర్వహించలేదు. ఒక వ్యక్తిని శారీరకంగా నిర్బంధించడం అతని కదలికలను నిలుపుదల చేయడాన్ని అరెస్టు అంటారు. అయితే ఈ అరెస్ట్ ఏదైనా నేరం చేశాడని బలమైన ఆరోపణలు ఉన్నప్పుడు గాని లేక ఏదైనా ఖూని నేర స్వభావం ఉన్న నేరం చేసినప్పుడు మాత్రమే చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే అది అరెస్టు అవుతుంది (ఏ.ఐ.ఆర్ 1953 సుప్రీంకోర్టు 10)

      అరెస్టు అంటే ఒక వ్యక్తి స్వేచ్ఛని నిలుపుదల చేయడం అది కోర్టు ఉత్తర్వుల వల్ల కావచ్చు లేక అతనిమీద ఆరోపించబడిన నేరానికి జవాబు చెప్పడానికి కావచ్చు అరెస్టు ఉద్దేశం రెండు రకాలుగా ఉంటుంది.
 1 అతనిపై ఉన్న క్రిమినల్ ఆరోపణలకు కోర్టులో జవాబు చెప్పడానికి అతను ఏదైనా నేరం చేయకుండా నిరోధించడానికి.అరెస్టు శరీరాన్ని తాకడం వారిని నిర్బంధించడం ద్వారా చేయవచ్చు. అయితే నిన్ను అరెస్ట్ చేస్తున్నాము అని మాటల ద్వారా చెప్పాల్సి ఉంటుంది. మాటల ద్వారా గాని చర్యలవల్ల గాని అతని ఒప్పుకున్నప్పుడు అరెస్టు పూర్తయినట్లు భావించబడుతుంది. అరెస్ట్ చేసే క్రమంలో అవసరమైన బలప్రయోగాన్ని ఉపయోగించవచ్చు. అయితే ఆ వ్యక్తి అరెస్టును నిరోధించినప్పుడు మాత్రమే. బలప్రయోగాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. జీవితఖైదుగా మరణశిక్ష విధించే నేరం చేసిన వ్యక్తుల అరెస్టులో అవసరమైతే చంపవచ్చు. అంతేకానీ సంకెళ్ళను వేయాలని ఎక్కడా పేర్కొనలేదు.

*సంకెళ్లు ఎప్పుడు వేస్తారు*

           ఎవరినైనా అరెస్టు చేసినప్పుడు విచారణలో ఉన్న ముద్దాయిని కోర్టుకు తీసుకు వచ్చినప్పుడు సాధారణంగా సంకెళ్ళు వేస్తారు. సంకెళ్ళు అసాధారణ పరిస్థితుల్లో తప్ప మిగతా సమయాలలో వేయకూడదు అదేవిధంగా అరెస్టు అనేది కూడా అత్యవసరమైనప్పుడు మాత్రమే వేయాలని సుప్రీంకోర్టు ఓ కేసులో స్పష్టం చేసింది.

     అరెస్టు చేసే  అధికారం ఉండడం ఒక ఎత్తు.దానికి గల కారణాలను చూపించడం మరో ఎత్తు.అధికారం ఉందని అరెస్టు చేయడం కాదు దానిని సమర్థించుకునేందుకు న్యాయబద్ధత కూడా ఉండాలి వ్యక్తిని అరెస్టు చేసి బంధించడం అనేది ఆ వ్యక్తి ప్రతిష్ట కి ఎంతో భంగం కలిగిస్తుంది కాబట్టి ఆరోపణ రాగానే అరెస్టు చేయడం కాకుండా వివేచనతో ఆలోచించి తగు కారణాలు ఉన్నప్పుడు మాత్రమే అరెస్టు చేయాలి. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడడంలో పోలీసుల బాధ్యత ఎంతో ఉంది. సంతృప్తికరమైన కారణాలు ఉన్నప్పుడు హీనమైన నేరాలకు పాల్పడినపుడు మాత్రమే అరెస్టు చేయాలి.

ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తి కోరినప్పుడు అతని బంధువులను కానీ, న్యాయవాదిని గాని, అతని ప్రయోజనాలని చూసే ఏ వ్యక్తినైనా గాని అతను సంప్రదించి అవకాశాన్ని పోలీసులు కల్పించాలి.

 ఈ హక్కులు అన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21,11(1) లతో మిళితమై ఉన్నాయని, వాటిని అమలు చేయడానికి సుప్రీంకోర్టు ఈ సూత్రాన్ని తన తీర్పులో పేర్కొంది.

  ఎవరినైనా అరెస్టు చేసినప్పుడు అతని కోరిక ప్రకారం అతని బంధువులనుగానీ స్నేహితులను గాని అతని యోగక్షేమాలు పట్టించుకునే అవకాశం ఉన్న ఏ వ్యక్తినైనా అతను మాట్లాడే అవకాశాన్ని సాధ్యమైనంత త్వరగా కల్పించాలి.
-ఆవ్యక్తిని పోలీస్ స్టేషన్ కి తెచ్చిన వెంటనే ఈ హక్కులని ఆ పోలీస్ అధికారి తెలియజేయాలి.
- ఈ విషయాన్ని అతనికి తెలియజేశామని ఆ వ్యక్తి కోరికమేరకు అతను కోరిన వ్యక్తులకు అరెస్ట్ సమాచారాన్ని తెలియజేశామని పోలీసు అధికారులు డైరిలో రాయలయును. ప్రతి వ్యక్తికి ఈ హక్కుల రక్షణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 22(1)ప్రసాదిస్తుంది.

●ఆ వ్యక్తిని ఏ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారో ఆ మేజిస్ట్రేట్ ఈ హక్కులు పోలీసులు అమలు చేశారా లేదా అన్న విషయాన్ని పరిశీలించాలి.
●ఈ ఆవశ్యకతని ప్రతి అరెస్టులో పోలీసులు పాటించాలి మాన్యువల్లో ఉన్న హక్కులకి ఇవి అదనం. ఈ ఆవశ్యకతలు సంపూర్ణమైనది కావు. అయినప్పటికీ వీటిని పోలీసులు పాటించాల్సిందిగా పోలీసు డైరెక్టర్ జనరల్స్ అధికారులకి డిపార్ట్మెంటల్ ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అంతేకాక అరెస్ట్ చేయడానికి గల కారణాలను కూడా కేసు డైరీలలో తప్పనిసరిగా వ్రాయవలసి ఉంటుంది.

 *మానవహక్కుల వర్గీకరణ*         
1) స్వేచ్ఛగా  జీవించేహక్కు.              
2) భావప్రకటన హక్కు.                     
3) విద్యహక్కు.                                
4) తనకు ఇష్టమైన వృత్తి  వ్యాపారం చేసుకొనే హక్కు.                          5)ఆరోగ్యవంతమైన ఆహార తీసుకొనే హక్కు.                                6)స్వచ్ఛమైన గాలి,నీరు పొందే హక్కు  పర్యావరణ హక్కు.                               7)వయోవృద్ధులు హక్కులు.                   
8)మహిళ హక్కులు.                              
9)బాలల హక్కులు.....                   
10) ఖైదీల హక్కులు.....                     
11) శరణార్ధుల హక్కులు.                12)శారీరక,మనసికవైకల్యం గల వ్యక్తుల హక్కులు..                         13) పౌరసత్వం లేని వ్యక్తుల హక్కులు   
14)రాజకీయ పరమైన హక్కులు         
15)అల్పసంఖ్యాక తెగల,జాతుల, భాష మతల హక్కులు.                      
16) సామాజిక పరమైన హక్కులు.    
17) సాంస్కృతిక పరమైన హక్కులు.   
18) వివక్షత నుంచి రక్షణ పొందే హక్కు.       
19) వివిధ రకాలైన  దోపిడీ అణచివేత నుంచి రక్షణ పొందే హక్కు.      
20) మేదోసంపత్తి  హక్కులు.           
21) ట్రేడ్ మార్క కాపీరైట్స్ హక్కు.   
22)స్వేచ్ఛ సంచరించే హక్కు.   
ఈ మధ్యకాలంలో స్వలింగ సంపర్కం స్వేచ్ఛయుట శృగరం, వైవహికబందం లేకుండా స్క్హజీవనం చేయుట,లైంగిక స్వేచ్ఛ తదితర హక్కులు కూడా మానవహక్కుల కింద వస్తాయని సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చినది.

ఆంధ్రప్రదేశ్ మనవాహక్కులు కమిషన్ చిరునామా
Gruhakalpa Complex, M.J. Road, Opp: Gandhi Bhavan, Nampally, Hyderabad, Telangana 500001

జాతీయ మనవాహక్కుల కమీషన్ చిరునామా
GPO Complex, Manav Adhikar Bhawan,
 C  block, INA, New Delhi, Delhi 110023

*మనవాహక్కులు ఉల్లంఘన జరిగితే కేంద్రరాష్ట్ర కమిషన్లు ఎలా దరఖాస్తు చేసుకోవాలి*

మీ హక్కులు భంగం వాటిల్లితే మొదట మీ సమీపంలోని పోలీసు స్టేషన్ నందు పిర్యాదు చేసుకోవాలి. వారు పాటించుకోకపోతే జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుకు దరఖాస్తు చేసుకోవాలి. వారి ద్వారా న్యాయం జరగకపోతే మానవహక్కుల కమిషన్ కు లెటర్ వ్రాసి మీరు పోలీసువారికి ఇచ్చుకున్న అర్జీలు జతపరచి మనవాహక్కులు కమిషన్ పోస్టు ద్వారా గాని లేక స్వయంగా గాని పిర్యాదు చేసుకోనవచ్చు. వారు  సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ద్వారా రిపోస్టు తెప్పించుకొని మానవహక్కుల జరిగిందని నిరూపితం అయితే వారి మీద కేసు నమోదు చేసి జరిమానా విదిస్తుంది.

ఎస్.ఆర్.ఆంజనేయులు
న్యాయవాది -హిందూపురం
9848018828*మానవహక్కులు*

Comments