పత్రికా సమావేశం. పులివెందుల, 13/12/2020
___________________________
07/12/2020 న పులివెందుల రూరల్ పరిధి అయిన పెద్ద కూదాల గ్రామ పొలాల్లో హత్యకు గురి అయిన నల్ల రామయ్య గారి నాగమ్మ(45) హత్య పై పౌర హక్కుల సంఘం కడప జిల్లా శాఖ హత్యకు నాగమ్మ కుటుంబీకులను ,పోస్ట్ మార్టం నిర్వ హించిన డాక్టర్ ను,రూరల్ సీఐ ను, హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన పిదప మా పరిశీలనలో తేలిన వాస్తవాలు.....
హత్యకు గురి అయిన నాగమ్మకు బిదినం చెర్ల కు చెందిన నరసింహులు తో 20 సంవత్సరాల క్రితం వివాహం అయినది.10 సంవత్సరాలు వారి సంసారం సాఫీగా జరిగిపోయింది.భార్య భర్తల మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు.విడిపోయిన తరువాత నాగమ్మ తల్లి దండ్రులు ఊరు పెద్ద కూడాలకు వచ్చి వారితోనే ఉంటూ,మేకలు,గొర్రెలు కాచుకుంటూ జీవిస్తున్న ది. ఈక్రమంలోనే 07/12/2020 న ఉదయం 9_10 గంటల మధ్యలో మేకలు తోలుకొని ఇంటే పల్లి,పెద్ద కూడాలా,దొండ్ల వాగు గ్రామాల సరిహద్దు పొలాల్లో కి వెళ్ళింది.మధ్యానం 3.30__4 గంటల మధ్య మేకలు మాత్రమే ఇంటికి రావడం,నాగమ్మ రాక పోవడంతో నాగమ్మ తల్లి,కుటుంబీకులు ఆందోళనకు గురి అయ్యి ఏర్రమ్మ కుంట వద్ద చనిపోయి విగత జీవిగా ఉండటాన్ని చూసారు. శవం పై బట్టలు చిందర వందరగా ఉండటం తో తల్లి పుల్లమ్మ సర్దింది.ఎడమ చేయి కూడా విరిగి ఉండటం గమనించారు.హతు రాలు తల్లి పుల్ల మ్మ మరియు బందువులు లింగాల పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు మేరకు పోలీసు లు హత్యా కేసు నమోదు చేశారు, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి మాతో మాట్లాడుతూ తలకు తల వెనుక భాగాన బలమైన గాయం వల్ల 07/12/2020 న సుమారు 3pm..4pm మధ్యలో చనిపోయారని చెప్పారు,చెయ్యి పెనుగు లాటలో గాని బలంగా కొట్టడం వల్ల గానీ మెలి తిరిగి ఉండవచ్చని,అత్యాచారం చేసేసందర్బంలో ఇలాంటివి జరిగి ఉండవచ్చు,అయితే అత్యా చారం జరిగినట్లు పూర్తిగా మా పరీక్షలో తెలలేదని,పూర్తి స్థాయి పరీక్షల కొరకు FSL కు పంపామని కమిటీ దృష్టికి తెచ్చారు.కానీ గ్రామస్థుల కథనం మేరకు నాగామ్మకు గ్రామంలో ఎవరితో ఎలాంటి కక్షలు లేవని,కాకపోతే గ్రామానికే చెందిన కంచోల్ల గంగరాజు(55) మృతురాలు నాగమ్మను రెండో పెళ్లి చేసుకుంటానని పలు మార్లు బెదిరించాడని,అంతేగాక గ్రామ మహిళల పట్ల దురుసుగా,అసభ్యంగా ప్రవర్తించే వాడని మా దృష్టికి తేవడమే గాక అత్యాచార,హత్యా ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయిన మైనర్ బాలుర లకు మద్యం తాపించి,నాగమ్మ అత్యాచారానికి ప్రోత్స హించి నట్లు,నాగమ్మ హత్యకు గురి కావడానికి కంచోళ్ళ గంగరాజు అని గ్రామస్థులు కమిటీ ముందు బలంగా చెప్పారు.
కాబట్టి పోలీస్ ఉన్నతాధకారులు ఈ కోసులో మైనర్లే గాకుండా గ్రామస్థులు విశ్వసిస్తున్న ట్లుగా నేరం జరగ టానికి కారణమైన కంచొల్ల గంగరాజు పాత్ర పై కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాం..
సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడానికి అశ్లీల సినిమాల ప్రభావం, పోర్న్ వీడియో లు,మద్యం కారణాలు .website లలో పోర్న్ వీడియోలను నిలిపి వేయాలని,మద్య నిషేధం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం...
సి.వెంకటేశ్వర్లు,రాష్ట్ర సహాయ కార్యదర్శి,పౌర హక్కుల సంఘం,
పి. రెడ్డయ్య,జిల్లా ఉపాధ్యక్షుడు
యం.రవి శంకర్,జిల్లా సహాయ కార్యదర్శి.
పౌర హక్కుల సంఘం.
కడప జిల్లా కమిటీ.
13/12/2020.
Comments
Post a Comment