తర్వాత మీరే | వి. నాగేశ్వరావు


 ఆంధ్రప్రదేశ్లో అక్రమ అరెస్టుల  పర్వం కొనసాగుతోంది. మొదటగా పోలీసులు రెండు కేసులు ద్వారా ప్రజా సంఘాల నాయకులు పై కత్తి వేలాడుతోంది అని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. పిడుగురాళ్ల లో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.  అతను ఇచ్చినట్టు చెప్తున్న  వాంగ్మూలంలో పోలీసులు అబద్ధాలు చెప్పి అక్రమంగా ప్రజాసంఘాల నాయకుల పేర్లను చొప్పించారు.  ఆ చార్జిషీట్లో ప్రజాసంఘాలు వాటి అధ్యక్ష,  కార్యదర్శులను  ముద్దాయిలుగా చూపారు. అలాగే విశాఖపట్నంలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి అతను ఇచ్చిన వాంగ్మూలం లోనూ ఇదే ప్రజాసంఘాల,  వాటి నాయకుల పేర్లను ఉదహరించారు. వీటన్నిటికి మూలం కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న మోడీ అమిత్ షా ద్వయమే.

 కసబ్ ని అరెస్ట్ చేసినప్పుడు ఉగ్రవాదులను కఠినంగా శిక్షించే చట్టాలు కావాలని దేశవ్యాప్తంగా మధ్యతరగతి బుద్ధిజీవులు ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని సాకుగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఉపా  అనే నల్ల చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం తీసుకు వస్తున్నప్పుడే దేశవ్యాప్తంగా ఉన్న వామపక్ష మేధావులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ చట్టం ప్రజాస్వామిక మేధావులపై ఉపయోగించ పడుతుందని వాళ్లు ముందుగానే గ్రహించారు. ఊహించినట్టుగానే ఆ చట్టం కసబ్ నుండి వరవరరావు వరకు వచ్చింది. కసబ్ ని  అరెస్టు చేసిన  చట్టం తోనే అంబేద్కరిస్టులను,  బుద్ధిస్టులను,  హేతువాదులను,  న్యాయవాదులను,  జర్నలిస్టులను, విద్యార్థి నాయకులను ఉపా కింద అరెస్టు చేయడం ప్రారంభించారు.   అలాగే ఇది  మేధావులను  మాత్రమే కలవరపరుస్తోంది అని అందరూ భావించారు. కానీ చివరికి ఇది  సిపిఎం నేత సీతారాం ఏచూరి వరకు వెళ్ళింది.

తెలంగాణలో కూడా  ఉపా   అక్రమ అరెస్టులు చాలా వేగంగా కొనసాగాయి. అటు తర్వాత అది దేశవ్యాప్త ఆందోళన అవడంతో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వానికి ప్రజాసంఘాల కన్నా బీజేపీ అతిపెద్ద ప్రధాన శత్రువు అయి  కూర్చుంది. అందులో భాగంగానే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో స్వయంగా కేటీఆర్  రోడ్డుపై బైఠాయించారు. ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బీజేపీని ప్రధాన శత్రువుగా చూడటం లేదు. జగన్ పై  ఉన్న అక్రమాస్తుల కేసుల వల్ల  బీజేపీతో లోపాయికారి ఒప్పందం తోనే జగన్ ప్రభుత్వం పని చేస్తోంది.

కొన్ని రోజుల క్రితం అమిత్ షా అధ్యక్షతన జాతీయ భద్రతా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చాలా రాష్ట్రాల హోం మంత్రులు, డీజీపి లు పాల్గొన్నారు. అందులో మావోయిస్టులను 2021 కల్లా ఏరి  వేస్తామని,  వాళ్లకి దేశంలో చోటు లేకుండా చేస్తామని అమిత్ షా  ప్రకటించాడు.  అంతేకాకుండా మైదాన ప్రాంతాల్లో మావోయిస్టులు  వారి అనుబంధ ప్రజా సంఘాలతో పని చేస్తున్నారని  ఆయన బాహాటంగానే విమర్శించాడు. అందువల్ల  
 ప్రజాసంఘాల నాయకులను  పనిచేయకుండా చేయాలని అమిత్షా భావించారు. అందుకోసం దేశంలోని బుద్ధి జీవుల్ని ఉపా కేసుల్లో ఇరికించి  జైల్లో వేశారు. అదేవిధంగా రాష్ట్రాల్లోని  ప్రభుత్వాలూ అక్కడ చురుకుగా పని చేస్తున్న ప్రజా సంఘాలను గుర్తించాలని చెప్పాడు. ఆ ప్రజాసంఘాల నాయకత్వంపై ఉపా కేసులు పెట్టి జైళ్లల్లో వేయాలని చెప్పాడు. తద్వారా ప్రజా సంఘాలని నిర్వీర్యం చేయొచ్చని ప్రభుత్వాలు భావించాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఒక భయానక వాతావరణాన్ని ప్రభుత్వాలు సృష్టించాయి. పోలీసులు చార్జిషీటులో చెప్పిన ప్రకారం ప్రజాసంఘాల నాయకులు నిరుద్యోగ యువతను ఆకర్షిస్తున్నారు. వాళ్లని రెచ్చగొట్టి మావోయిస్టు పార్టీ కార్యకలాపాలలో పాల్గొనే విధంగా ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగానే ప్రజాసంఘాలు ఉపా చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాల్లో పనిచేస్తున్నాయి. అలాగే ఎన్కౌంటర్ జరిగినప్పుడు నిజనిర్ధారణకు  వెళుతున్నాయి. ఈ విధంగా నిర్ధారణకు వెళ్లిన ప్రజాసంఘాల నాయకులు  మావోయిస్టు నాయకులతో సంబంధాలు కలిగి దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని వాళ్ళ పై పోలీసులు అభియోగం మోపారు.

అలాగే రాష్ట్రాలలో అనేక చోట్ల కార్యక్రమాలు ఏర్పాటు చేయటం ద్వారా యువతను ఆకర్షించి వాళ్లని  మావోయిజం వైపు మళ్ళిస్తున్నారని చార్జిషీటులో ఆరోపించారు. మొదటగా పీకేఎస్ నేత ఆంజనేయుల్ని  మదనపల్లిలో అరెస్ట్ చేశారు.  చార్జిషీట్లో అతన్ని గుంటూరు జిల్లాలో అరెస్ట్ చేసినట్టుగా చూపించారు.

ఇప్పుడు చార్జ్ షీట్ లో పేర్కొన్న 30 మంది ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేయడానికి పోలీసులు ఉవ్విళ్ళు వూరుతున్నారు.   పీకేఎస్ నాయకత్వాన్ని భయబ్రాంతులకు గురి చేయడానికి కొండారెడ్డి ని కూడా అరెస్ట్ చేశారు. ఇక మిగిలిన ప్రజా సంఘాల నాయకులను  కూడా అరెస్టు చేయటానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. దానికోసం అబద్ధపు మధ్యవర్తి పత్రాలను,  అబద్ధపు వాంగ్మూలాలను  ఉపయోగించుకున్నారు. ఆ  విధంగా రాష్ట్రంలో అక్రమ ఎమర్జెన్సీ ప్రకటితమైంది. ఈ నేపథ్యంలో పోలీసుల అక్రమ అరెస్టులను    పెద్ద ఎత్తున ఖండించాల్సిన అవసరం ఉంది. అలాగే ఉపా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్త ఉద్యమంగా మలచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మోడీ ప్రభుత్వం ఇదే తరహా నమూనాని దేశవ్యాప్తంగా ప్రయోగిస్తోంది. దీన్ని అరికట్టాలంటే ప్రజాసంఘాల నాయకులు మనోధైర్యంతో ముందుకు నడవాలి. అంతేగాకుండా అన్ని ప్రజా సంఘాలను, కుల సంఘాలను, కలిసి వచ్చే వామపక్ష రాజకీయ పార్టీలను ఒక గొడుగు కిందకు తేవాలి. వారితో అక్రమ ఉపా అరెస్టుల వ్యతిరేక ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది

 ఈ అక్రమ అరెస్టులు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రజా సంఘాల నాయకులు అరెస్ట్ చేసేంతవరకు ఆగవు. ఈ నేపధ్యంలో అన్ని ప్రజా సంఘాల నాయకులు జూమ్మీ
మీటింగ్ ద్వారా ఒకసారి సమావేశం అయి తదుపరి కార్యాచరణను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పీకే ఎస్ ఆంజనేయులు అరెస్టు ఆయునపుడు,  అప్పుడు గుంటూరులో పౌరహక్కుల సంఘం తో పాటు పీకేఎస్ నాయకుడు కొండారెడ్డి కూడా పత్రికా సమావేశంలో పాల్గొన్నాడు. ఇప్పుడు కొండారెడ్డి విడుదల కోసం పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చిపడింది. దీన్ని చాలా సీరియస్ గా ప్రజాసంఘాలు పరిగణించాలి. అలాగే  ఈ నిర్బంధాన్ని ఎలా ఎదుర్కోవాలో కార్యాచరణ కూడా రూపొందించు  కోవాలి. ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో అనే  ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా నెలకొని ఉంది. ఈరోజు మాట్లాడిన వ్యక్తి రేపు జైల్లో ఉండే పరిస్థితి నెలకొంది. తమ దాకా రాదు అని నిశ్చింతగా కూర్చునే పరిస్థితి ఇప్పుడు లేదు. అరెస్టు కాబడ్డ వారందరి తరుపున బలమైన న్యాయ పోరాటం చేయాలి. పెద్ద ఎత్తున మేధావులను, ప్రజాస్వామిక మేధావులను కదిలించాలి. ఈ ఉపా అరెస్టులు రాజకీయ పార్టీ నేతల  వరకు, చివరకు చంద్రబాబు వరకు పాకడానికి ఎక్కువ సమయం పట్టక పోవచ్చు.

ఉపా కేసు బైలబుల్

ఆరు సంవత్సరాల జైలు జీవితం గడిపిన చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) చట్టం (యుఎపిఎ) కింద నిందితుడికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ రోహింటన్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఒక ఉత్తర్వులో, రాజస్థాన్ హైకోర్టు నిందితులకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో అంగీకరించలేదు.

చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు శిక్ష
 (1) ఎవరైతే (ఎ) పాల్గొంటారు లేదా పాల్పడతారు, లేదా. (బి) ఏ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకైనా న్యాయవాదులు, సహాయాలు, సలహా ఇవ్వడం లేదా ప్రేరేపించడం, ఏడు సంవత్సరాల వరకు పొడిగించే పదం కోసం జైలు శిక్షతో శిక్షించబడతారు మరియు జరిమానా కూడా విధించబడతారు.

ఉపా లక్ష్యం 

చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) చట్టం భారతదేశంలో చట్టవిరుద్ధ కార్యకలాపాల సంఘాలను సమర్థవంతంగా నివారించడానికి ఉద్దేశించిన భారతీయ చట్టం. భారతదేశం యొక్క సమగ్రత మరియు సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా సూచించే కార్యకలాపాలతో వ్యవహరించడానికి అధికారాలను అందుబాటులో ఉంచడం దీని ప్రధాన లక్ష్యం.

ఉపా అరెస్టులు ఎందుకు

ఉదాహరణకు, UAPA కింద అరెస్టయిన వారిని చార్జిషీట్ దాఖలు చేయకుండా 180 రోజుల వరకు జైలు శిక్ష అనుభవించవచ్చు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ను నేరుగా ఉల్లంఘిస్తుంది. ... 'భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని మరియు సమగ్రతను' రక్షించడానికి పౌరుల హక్కులు మరియు స్వేచ్ఛలను పరిమితం చేయడానికి UAPA పార్లమెంటుకు అధికారం ఇస్తుంది. జూన్ 2, 2020

ఉపా ప్రకారం ఎవరు నేరస్తులు 
ప్రస్తుతం, సంస్థలను మాత్రమే 'ఉగ్రవాద సంస్థలు' గా నియమించారు, కాని UAPA, 1967 లో మార్పు తరువాత ఒక వ్యక్తిని టెర్రర్ నిందితుడిగా కూడా పిలుస్తారు. 1. బినాయక్ సేన్, డాక్టర్ మరియు మానవ హక్కుల కార్యకర్త.

ఉపా రాజ్యాంగ వ్యతిరేకం 

ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంటు ఆమోదించిన రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి నిలిపివేయకూడదు. రాష్ట్రపతి తన అంగీకారం ఇస్తే, బిల్లు ది గెజిట్ ఆఫ్ ఇండియాలో ప్రచురించబడుతుంది మరియు అతను అంగీకరించిన తేదీ నుండి ఒక చర్య అవుతుంది. అతను తన అంగీకారాన్ని నిలిపివేస్తే, బిల్లు తొలగించబడుతుంది, దీనిని సంపూర్ణ వీటో అంటారు.

భారత రాజ్యాంగంలోని 7 వ షెడ్యూల్ ప్రకారం 'పోలీస్' ఒక రాష్ట్ర విషయం కనుక ఈ చట్టం సమాఖ్య నిర్మాణానికి విరుద్ధం. ... చట్టం ప్రకారం ఏకపక్షతను న్యాయ సమీక్ష ద్వారా తనిఖీ చేయాలి.

చట్ట విరుద్ధం అంటే 

చట్టవిరుద్ధం "చట్టంచే అధికారం లేదు, చట్టవిరుద్ధం" అని నిర్వచిస్తుంది. చట్టవిరుద్ధం "చట్టం ద్వారా నిషేధించబడింది, చట్టవిరుద్ధం" అని నిర్వచించబడింది. అర్థపరంగా, కొద్దిగా తేడా ఉంది. చట్టవిరుద్ధమైన ఏదో శాసనం ద్వారా స్పష్టంగా నిషేధించబడినట్లు అనిపిస్తుంది మరియు చట్టవిరుద్ధమైన విషయం స్పష్టంగా అధికారం లేదు.

చట్టవిరుద్ధం అంటే ఆమోదించబడిన చట్టం ద్వారా ఇది నిషేధించబడింది. చట్టవిరుద్ధం అంటే చట్టంచే అధికారం లేదు ఎందుకంటే అలాంటి చట్టం ఆమోదించబడలేదు.

ఉపా కేసులు

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం, యుఎపిఎ కేసుల కింద దేశవ్యాప్తంగా 2016 లో 33.3%, 2015 లో 14.5% మరియు 2014 లో 27.3% గా ఉంది. యుఎపిఎ కేసులలో శిక్షా రేటు 2017 మరియు 2018 సంవత్సరాలకు ప్రస్తావించబడలేదు. నివేదికలలో. 2018 లో అస్సాంలో అత్యధికంగా 308 కేసులు నమోదయ్యాయి, మణిపూర్ (289), జమ్మూ కాశ్మీర్ (245), జార్ఖండ్ (137), ఉత్తర ప్రదేశ్ (107) ఉన్నాయి.

ఉపా కేసులు ఎందుకు నిలవవు

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కోలిన్ గోన్సాల్వ్స్ TOI తో ఇలా అన్నారు: "తక్కువ నేరారోపణ రేటు ఉన్నందున UAPA అసమర్థంగా ఉంది. నిజం ఎన్ఐఏ లేదా పోలీసులకు ఆసక్తి లేదు ఎందుకంటే వారు ఉత్పత్తి చేసే సాక్ష్యాలు నిర్దోషులు అవుతాయని వారికి తెలుసు. బెయిల్ సదుపాయం కఠినంగా ఉన్నందున, ప్రజలను ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలులో ఉంచడానికి పోలీసులు చట్టాన్ని ఉపయోగిస్తున్నారు. దురదృష్టవశాత్తు, న్యాయమూర్తులు దీనిని చూడలేదు. ” ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించే బెయిల్ నిరాకరణ 90% అని ఆయన అన్నారు. పంజాబ్ పోలీసు అధికారి ఎవరూ రికార్డులో రావడానికి సిద్ధంగా లేరు. శిక్షా రేటుపై, ఉత్తర ప్రదేశ్ మాజీ పోలీసు చీఫ్ ప్రకాష్ సింగ్ మాట్లాడుతూ, "దీని అర్థం పోలీసుల దర్యాప్తు చాలా కష్టంగా ఉంది లేదా ప్రాసిక్యూషన్ బలహీనంగా ఉంది లేదా న్యాయవ్యవస్థ చాలా సమయం తీసుకుంటుంది, ఈ కేసులు ఫ్లాట్ అవుతాయి."

ఉపా ప్రముఖ కేసు

స్టేట్ VS కోబాద్ గాంధీ

ఈ కేసును జనవరి 1, 2010 న సదార్ పాటియాలా పోలీస్ స్టేషన్‌లో యుఎపిఎ మరియు ఇండియన్ పీనల్ కోడ్ కింద కోబాద్ గాంధీపై నమోదు చేశారు. గాంధీని అక్టోబర్ 18, 2016 న నిర్దోషిగా ప్రకటించారు. జనవరి 23, 2010 న, పాటియాలాలోని పంజాబీ విశ్వవిద్యాలయం యొక్క ప్రధాన ద్వారం సమీపంలో ఉన్న ఒక పోలీసు బృందానికి రహస్య సమాచారం అందిందని ప్రాసిక్యూషన్ తెలిపింది “అంతర్జాతీయ కార్యకలాపాలకు అధిపతి అయిన కోబాద్ గాంధీ, జాతీయ పార్టీలు ”సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ రాజ్ (రుహ్పోష్) తో పాటు దేశానికి వ్యతిరేకంగా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడ్డారు. సిపిఐ (మావోయిస్టు) లో చేరడానికి ప్రజలను చైతన్యపరిచేందుకు ఆయన విశ్వవిద్యాలయంలో ప్రసంగం చేస్తున్నారని ఆరోపించారు. ఫిబ్రవరి 20, 2010 న గాంధీని అరెస్టు చేశారు. కోర్టు ఇలా గమనించింది: “ఈ సందర్భంలో, నిందితుల సందర్భంలో ఎటువంటి రికవరీ ప్రభావితం కాలేదు. నిందితుడు మిలిటెంట్ గ్రూపుకు చెందినవాడని లేదా అతడికి శత్రు దేశాలతో ఎలాంటి సంబంధం ఉందని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందున, నిందితుడికి ఉగ్రవాద కార్యకలాపాలతో లేదా ఉగ్రవాద సంస్థతో ఎలాంటి సంబంధం ఉందని చూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు ... సుప్రీంకోర్టు ... నిషేధించబడింది, నిషేధించబడిన సంస్థ యొక్క సభ్యత్వం ఒక వ్యక్తిని దోషులుగా చేయదు ... "

- వి. నాగేశ్వరావు రావు
పౌర హక్కుల సంఘం 

Comments