ఆంజనేయుల్ని కోర్టులో హాజరు చేయాలి | చిత్తూరు జిల్లా

"ఆంజనేయుల్ని కోర్టులో హాజరుపరచాలని పౌరుహక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది"

ప్రగతశీల కార్మిక సమైక్య (PKS) నాయకుడైన వి అంజనయులను నిన్న 10-12-2020 సాయంత్రం 5:300 గం॥ ప్రాంతములో మదనపల్లి శివారు ప్రాంతమైన వై యస్ ఆర్ కాలనీ వద్ద మఫ్టీలో వున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అభియోగంతో అరెస్ట్ చేయడం జరిగింది అన్నారు. అయితే అరెస్ట్ చేసిన వెక్తులు గుంటూరు జిల్లా నుండి వచ్చిన పోలీసులుగా సమాచారం వుంది. ప్రజాస్వామ్య పద్ధతిగా నడుచుకోవాల్సిన పోలీసులే ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి ఒక వెక్తిని ఏవిధంగా కిడ్నాప్ చేస్తారో అదే పద్ధిలో పోలీసులు ఆంజనేయులని అరెస్టు చేయడాన్ని పౌరూహక్కుల సంఘం కండిస్తుంది. ఆంజనేయులు అనే వెక్తి ఏదైనా చట్టవ్యతరేకమైన పనులు చేసినట్లు మీ దృష్టికి వచ్చినట్లయితే మీరు చట్టప్రకారం వాల్ల భార్యతో గాని, కుటుంబ సభ్యులుతో గాని మేము పోలీసులని చెప్పి పలాన కేసులో పలాన అభీయోగంతో అరెస్టు చేస్తున్నామని చెప్పి, అరెస్టు చేయడం పోయి, అలాకాకుండా దేర్జన్యంగా లాక్కుపోవడం సరైన్ పద్దతి కాదని అన్నారు.కావున ఆంజనేయులని వెంటనే విడుదల చేయాలి లేదా కోర్టులో హజరుపరచాలని పౌరహక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తుంది.ఈ కార్యక్రమంలో కార్యకర్తలు,ఆంజనేయులు బార్య వి సుగుణ, పి కె యస్ రాష్ట్ర నాయకులు జి రాజు పాల్గొన్నారు.

Comments