అంజమ్మ, రాజేశ్వరిలను విడుదల చేయాలి



అమరుల బంధు మిత్రుల సంఘం అధ్యక్షురాలు కా. అంజమ్మ & చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కార్య వర్గ సభ్యురాల అక్రమ అరెస్టును పౌర హక్కుల సంఘం ఆంధ్ర  ప్రదేశ్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది.

ఈ ఉదయం 6.30కి గుంటూరు జిల్లా గణపవరంలో అంజమ్మను పోలీసులు అరెస్టు చేశారు. అరకు నుంచి వచ్చిన పోలీసులు ఇంకా తెల్లారకముందే అమెను ఇంటి నుంచి తీసికెళ్లారు. CMS రాజేశ్వరి, రాష్ట్ర కార్య వర్గ సభ్యురాలును  గుంటూరు జిల్లా, మంగళగిరిలో తన ఇంటి నుండి ఈ ఉదయం 8:45 గంటలకు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లినారు.23వ తేదీ విశాఖ జిల్లా ముంచింగుపుట్టు పోలీసు స్టేషన్లో అక్రమంగా నమోదు చేసిన ఒక కేసులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన అన్ని ప్రజాసంఘాల బాధ్యులుసభ్యులు 64 మంది పేర్లు చేర్చారు. ఉపా సహా అనేక సెక్షన్ల కింద కేసు పెట్టారు.అంజమ్మ మరియు రాజేశ్వరిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, ప్రజా సంఘాల నాయకులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని పౌర హక్కుల సంఘం ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.

ఈ ఉదయం 6.30కి గుంటూరు జిల్లా గణపవరంలో అంజమ్మను పోలీసులు అరెస్టు చేశారు. అరకు నుంచి వచ్చిన పోలీసులు ఇంకా తెల్లారకముందే అమెను ఇంటి నుంచి తీసికెళ్లారు. 23వ తేదీ విశాఖ జిల్లా ముంచింగుపుట్టు పోలీసు స్టేషన్లో అక్రమంగా నమోదు చేసిన ఒక కేసులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రజాసంఘాల బాధ్యులు, సభ్యులు 30 మంది పేర్లు చేర్చారు. ఉపా సహా అనేక సెక్షన్ల కింద కేసు పెట్టారు.అంజమ్మ ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, ప్రజా సంఘాల నాయకులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.

1.ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్,అధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
2.N. నారాయణరావు,ప్రధాన కార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ.

ఉదయం,8:30 గంటలు,
27 నవంబర్,2020.
హైదరాబాద్.

Comments