పద్మావతిని విడుదల చేయాలి (కర్నూలు జిల్లా)


        04/11/2020 న నంద్యాల  పట్టణానికి చెందిన కనకరాజు పద్మావతి @ పద్మక్క (56)  బెంగుళూర్ లో ఉన్న తన కుమార్తె వద్దకు వెళ్లడానికి నంద్యాల నుండి ఆర్టీసి బస్సులో  బెంగళూరు బస్ కు రిజర్వేషన్ చేయించుకొని రాత్రి 8.30 గంటల బస్సులో  ప్రయాణం చేయుచుండగా నంద్యాల శివారు ప్రాంతమైన రైతు నగర్ వద్ద నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు (మఫ్టీలో ఉన్న పోలీసులు) కారును బస్ కు అడ్డం పే ట్టి బస్సు లో ఉన్న పద్మావతిని బలవంతంగా బస్ నుండి దింపుకొని తీసుకెళ్ళి పోయారని తెలుస్తున్నది.

05 వ తేది బెంగుళూర్ చేరాల్సిన ఆమె చేరక పోవడం తో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెంది చుట్టు పక్కల గాలించినా ఫలితం లేదు.ఈమె గతంలో పీపుల్స్ వార్ పార్టీ లో పని చేసింది..2001 వ సంవత్సరం నుండి జన జీవన స్రవంతిలో ఉండి కుటుంబ సభ్యులతో కలసి నంద్యాలలో నివసిస్తున్న ది.బెంగుళూర్ లో ఉన్న కూతురు దగ్గరకు అపడపుడూ వెళ్ళి వస్తుండే ది...ఈమె ఈమె పీపుల్స్ వార్ లో పని చేసి దివంగత నేత దివాకర్ కు అక్క అని కుటుంబ సభ్యులు  పౌర హక్కుల సంఘం దృష్టికి తెచ్చారు....ఈమె గత 15 సంవత్సరాలుగా నంద్యాలలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెపుతున్నారు..ఈమెను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుక పోవడానికి అవసరంలేదు,మఫ్టీలో అరెస్ట్ చేసిన ఈమెను వెంటనే విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది.

 1.సి.వెంకటేశ్వర్లు రాష్ట్ర సహాయ కార్యదర్శి,పౌర హక్కుల సంఘం.
2. యస్.అల్లా బకాష్,జిల్లా కార్యదర్శి,పౌర హక్కుల సంఘం,కర్నూల్ జిల్లా శాఖ..

Comments