వరంగల్ లో విద్యాపరిరక్షణ కమిటీ నేతల అక్రమ అరెస్టును పౌర హక్కుల సంఘం ఖండిస్తున్నది...
ఈ వేకువ జామున 26,నవంబర్,2020, వరంగల్ లో విద్యాపరిరక్షణ కమిటీ నేతలు ఫ్రొ. కాత్యాయని విద్మహే,డీటీఫ్ గంగాధర్,లింగారెడ్డి,మెట్టు రవీందర్,సుదర్శన్ లను వివిధ పొలీస్ స్టేషన్ల లో నిర్బంధించిన వరంగల్ పోలీసులు.ఈ అక్రమ నిర్బంధాన్ని పౌర హక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తున్నది.బేషరతుగా ఈ నేతలను విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది.మోడీ BJP ప్రభుత్వము,కార్మిక,రైతాంగ,ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరించడానికి వ్యతిరేకంగా నేడు 26,నవంబర్,2020 గురువారం దేశవ్యాప్త సార్వత్రికసమ్మె ను వివిధ కార్మిక సంఘాలు,విపక్షాలు భారత్ బంద్ ను నిర్వహిస్తుంటే, బంద్ ను విఫలం చేయాలనే తలంపులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం అక్రమరెస్టులకు పాల్పడింది.ఒకవైపు KCR ప్రభుత్వం, మోడీ తిసుకచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తున్నట్టు నటిస్తూ,సమ్మెకు మద్దతు ప్రకటించి మరొక్క వైపు వామపక్ష,విప్లవ ప్రజాసంఘాల నాయకులను అరెస్టుచేయటం దుర్మార్గం.
1.ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్,అధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
2.N. నారాయణరావు,ప్రధాన కార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
3.మాదనకుమారస్వామి, సహాయ కార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
ఉదయం 8 గంటలు.
26, నవంబర్,2020.
Comments
Post a Comment