4 11 20 20
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏలూరు లో అరెస్టు చేసిన నేతలను తక్షణం విడుదల చెయ్యాలి. పౌర హక్కులసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరి శ్రీమన్నారాయణ డిమాండ్.
ప్రభుత్వ అధినేత, రాష్ట్ర అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏలూరు పర్యటన లో వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కార్మిక సంఘాల నేతలను హౌస్ అరెస్టులు చేయడాన్ని పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. హౌస్ అరెస్టు చేసిన సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి U వెంకటేశ్వరరావు(UV ) ,సీనియర్ కమ్యూనిస్టు నాయకులు సిపిఐ జిల్లా కార్యదర్శి డేగ ప్రభాకర్, సీపీఎం, సి ఐ టి యు జిల్లా కార్యదర్శి డి ఎన్ వి డి ప్రసాద్ రైతు సంఘం నాయకులు కే శ్రీనివాస్ మరియు ప్రజాసంఘాల వారిని విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది.
ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను విన్నవించ టానికి సిద్ధమైన వివిధ సంఘాల నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికం. దుర్మార్గం. పోలీసులు చట్టాన్ని కాపాడాలి. రాజ్యాంగాన్ని కాపాడండి చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలి కానీ ముఖ్యమంత్రి అడుగులకు మడుగులొత్తుతూ చట్టవ్యతిరేకంగా నడుచు కొన రాదు. ప్రజాసమస్యలను ప్రభుత్వ అధినేతకు విన్నవించడం ప్రజాసంఘాల బాధ్యత. రాజకీయ పార్టీల కర్తవ్యం. ప్రజా సమస్యలను విన్నవించడం నేరం కాదు. ముఖ్యమంత్రికి విన్నవించడం అసలేం నేరం కాదు. పర్యటనకు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి ప్రజా సమస్యలను వినడం ముఖ్యమంత్రి బాధ్యత. అలాంటి బాధ్యతను విస్మరించి ప్రజా సమస్యలను విన్నవించే ప్రజాస్వామికవాదులుని ముందస్తుగా హౌస్ అరెస్టులు చేయడం అత్యంత దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్యమా? రాజరిక పాలనా? అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం.
ముఖ్యమంత్రి పర్యటనకు వస్తుంటే నేతలను ఎందుకు అరెస్టు చేశారు. పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్నాము? ముఖ్యమంత్రి పర్యటన ప్రజల సమస్యల కోసమా? లేక ప్రైవేటు వ్యక్తుల కోసమా? సమాధానం చెప్పాలని అడుగుతున్నాము. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో రాక ముందు ఇలాంటి చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు.కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామికవాదులు లను తన పర్యటన సందర్భంగా అరెస్టు చేశారు.ఇది అత్యంత హేయమైన చర్య. నిర్మాణ ఇతర కార్మికుల సమస్యలు, రైతుల సమస్యలు, పరిష్కరించక పోగా వారు జీవించే హక్కులను కాలరాస్తున్న ఈ సందర్భంలో వివిధ రాజకీయ పార్టీలు కార్మిక సంఘాల నేతలు వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేయడం ఎలా నేరం అవుతుంది అని ప్రశ్నిస్తున్నాము. ఇది ప్రజాస్వామ్య పాలన? రాజరిక పాలన? సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. తక్షణం వారిని విడుదల చేసి రాజకీయ పార్టీల నేతలు ప్రజా సంఘాల నేతలు విన్నపాలను వినాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం.
పౌర స్వేచ్ఛ, రాజకీయ స్వేచ్ఛ హరిస్తూ జరుగుతున్నటువంటి అరెస్టులను పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టవ్యతిరేకమైన పనులను మానుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పౌర హక్కుల సంఘం తెలియజేస్తున్నది. పరిపాలనలోకి రాకముందు ఒక రకంగా పరిపాలనకు వచ్చిన తర్వాత ఒక రకంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యం ని అపహాస్యం చేయడమే అని చెబుతున్నాము.నేను విన్నాను నేను ఉన్నాను అంటే ఇదేనా? పేదవాడి ఆసైన్మెంట్ భూముల ను సహితం లాక్కుంటున్న మీ వైఖరి, కార్మికులు హక్కులను, రైతాంగం హక్కులను కాలరాచే బిల్లులకు మద్దతు ఇచ్చే మీ విధానం మీకు ఓట్లు వేసి 151 mla,22ఎంపీ సీట్ల లో గెలిపించిన ప్రజల ఆశలు అకాక్ష లు కి విరుద్ధం. ప్రజల హక్కులు కాలరాస్తే ప్రజలు తగిన సమయంలో తగిన తీర్పు ఇస్తారు. అనే విషయం మరవొద్దు అని చెబుతున్నాము.
- నంబూరి శ్రీమన్నారాయణ
రాష్ట్ర ఉపాధ్యక్షులు పౌరహక్కుల సంఘం ఆంధ్ర ప్రదేశ్
Comments
Post a Comment