రైతుల ఛలో ఢిల్లీ ర్యాలీపై నిర్బంధం

పౌర హక్కుల సంఘం తెలంగాణ.
పత్రికా ప్రకటన...

  26&27 నవంబర్ న,2020 దేశవ్యాప్త రైతుల ఛలో ఢిల్లీ ర్యాలీలపై BJP మోడీ కేంద్ర ప్రభుత్వ  అణిచివేత,  లాఠీఛార్జ్ ,వాటర్ కేనాన్ & పోలీస్ నిర్బంధాన్ని పౌర హక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తున్నది.
రైతులు మరియు రైతు సంఘాలు,పలు కార్మిక ,విద్యార్థి సంఘాలు,వామపక్షాలు విపక్షాలు చేస్తున్న చేస్తున్న పోరాటానికి పౌర హక్కుల సంఘం తెలంగాణ పూర్తి మద్దతు తెలుపుతుంది.

BJP మోడీ ప్రభుత్వం అమలు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ సార్వత్రిక సమ్మెలో భాగంగా ఛలో26 నవంబర్,2020 గురువారం న ఢిల్లీ కార్యక్రమానికి వస్తున్న ఉత్తర భారత దేశ రాష్ట్రా లైన పంజాబ్, హర్యానా, ఉత్తేరప్రదేశ్ రాష్ట్రాల రైతులపై పోలీసుల దమనకాండను,లాఠీచార్జీను,వాటర్ కేన్లు,బాష్పవయువు గోళాలను ప్రయోగించడాన్ని పౌర హక్కుల సంఘం  తీవ్రంగా ఖండిస్తున్నది. BJP మోడీ ప్రభుత్వం కార్పొరేట్ వ్యవసాయానికి ఊడిగం చెయ్యడానికి మూడు కొత్త వ్యయసాయ చట్టాలు తీసుకురావడం దుర్మార్గమైన చర్య. ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకిస్తూ దేశంనలుమూలల నుంచి రైతులు ఢిల్లీకి వెళుతుండగా అడ్డుకోవడం, బారికేడ్లు పెట్టడం,రోడ్డుపై పెద్ద పెద్దకందకాలు తవ్వడం,పెద్దపెద్ద బండరాళ్ళుపెట్టి,ఇనుప ముళ్ళకంచెలు మరియు ఇసుక కుప్పలు పోసి . ఆటంకాలు సృష్టించడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం.రైతులు నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా పోలీసులచే రహదారులను దిగ్బంధించడం అప్రజాస్వామిక చర్య మరియు రాజ్యాంగ వ్యతిరేకం.నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న రైతులపై,క్రూర నిర్బంధ చట్టాలు నమోదు చేయడాన్ని పౌర హక్కుల  సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది.
రైతు వ్యతిరేక చట్టాలపై శాంతియుతంగా పోరాడుతున్న అన్నదాతలపై కేంద్రపోలిస్ బలగాలను ఉపయోగించి అణిచివేయడం మానుకోవాలని.కనీసం రైతుల ఆందోళన ఏమిటో అని వినే స్థితిలో ప్రభుత్వం లేకపోవడం అత్యంత అమానవీయం.
మూడు కొత్త వ్యవసాయ చట్టాలు,BJP కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోనే వరకు ఢిల్లీలోనే ఉండి పోరాడుతున్న రైతులు,రైతుసంఘాలతో ఇప్పటికైనా స్పందించి, కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది.

1.ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్,అధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
2.N. నారాయణరావు,ప్రధాన కార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
3.మాదనకుమారస్వామి, సహాయ కార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
29, నవంబర్,2020.
హైదరాబాద్.

Comments