ప్రజాసంఘాల నాయకులపై అక్రమ ఊపా కేసులు

పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుక చంద్రశేఖర్, రాష్ట్ర అధ్యక్షులు చిట్టి బాబు*, మరియు  ఇతర ప్రజాసంఘాల నాయకులపై ఉపా కేసులు.

ఆంధ్రప్రదేశ్ లో *జగన్  ప్రభుత్వం*  ప్రజాసంఘాలపై నిర్బంధం  కొనసాగిస్తోంది.

రెండు రోజుల్లో రెండు కేసులు.

ఆంధ్రప్రదేశ్  లో వివిధ ప్రజా జీవన రంగాల్లో పని చేస్తున్న సంస్థల కార్యకర్తలపై పోలీసులు  కుట్రపూరితంగా రెండు కేసులు బనాయించారు. 30 మంది మీద ఉపాతోపాటు అనేక  సెక్షన్ల కేసులు నమోదు చేశారు.

ఈ కేసుల్లో ఒకటి ఈ నెల 23న విశాఖ  ఏజెన్సీలోని ముంచింగిపుట్టు పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు. రెండోది 24వ  తేదీ గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీసు స్టేషన్లో నమోదు చేశారు. ఈ  రెండింట్లో ఇతరులతోపాటు ప్రజాసంఘాల బాధ్యులు, సభ్యులను నిందితులుగా  చేర్చారు.

పెదబయలుకు చెందిన టీవీ 19 రిపోర్టర్ పాంగి నాగన్నను ఈ నెల  23న అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రజా సంఘాల  కార్యకర్తలకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అభియోగాలు మోపుతూ కేసు  పెట్టారు. అలాగే నవంబర్ 24న గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కంభంపాటి చైతన్య  అనే యువకుడ్ని అరెస్టు చేశారు. అతని తండ్రితోపాటు ప్రజాసంఘాల సభ్యుల మీద  కూడా కేసు పెట్టారు.

ఈ రెండు కేసులలో 1. చిలుకా చంద్రశేఖర్ (సీఎల్  సీ) 2. చిట్టిబాబు (సీఎల్ సీ) 3. దుడ్డు ప్రభాకర్(కెఎన్‌పీఎస్) 4.  కోట(పీకేఎం) 5. వై. వెంకటేశ్వరులు (పీడీఎం) 6. పాణి(విరసం)7.  వరలక్ష్మి(విరసం) 8. అంజమ్మ 9. పద్మకుమారి 10. వై. వి బాలకృష్ణ 11. కె.  శివచలం 12. కొండపర్తి పద్మ 13. పొట్లూరి క్రాంతి 14. వాసిరెడ్డి కృష్ణ 15.  శ్రీరాంమూర్తి(సీఎల్ సీ)16. జోగి కోదండం 17. అరుణ 18. పీకేఎం నీలకంఠు 19.  కొండారెడ్డి 20. అన్నపూర్ణ 21. రేలా రాజేశ్వరి 22. స్వప్న 23. దేవేంద్ర 24.  లక్ష్మి ప్రసన్న 25. పీకేఎం విజయ్ 26. పికెఎస్ ఆంజనేయులు 27. మిస్కా  కృష్ణయ్య 28 . దుడ్డు వెంకట్రావ్ 29 . పికేఎం శ్రీను 30. ఆత్మకూరు  అన్నపూర్ణ ఉన్నారు.

వీరి మీద ముంచింగిపుట్టు స్టేషన్లో ఐపీసీ  సెక్షన్ 120 (ఎ), 121, 121 j), 143, 144, 124 (4) r/w  విత్ 149, .  ఊపా సెక్షన్ 10, 13, 18 . ఆర్మ్స్ యాక్ట్ 25 సెక్షనల కింద కేసు నమోదు  చేశారు. పిడుగురాళ్ల స్టేషన్లో  ఐపీసీ సెక్షన్  120 (ఎ), 121, 121 (1),  122, 124 (1), 143, 144, 149 , ఊపా సెక్షన్  16, 17, 18, 18 (1), 18 (ఎ),  20, 21, 38, 39, 40 ల కింద కేసు నమోదు చేశారు.

వీరంతా  గత 20 ఏళ్లకు పైగా తెలుగు నేల మీద వివిధ రంగాలలో బహిరంగంగా  పనిచేస్తున్నారు. పాలకుల విధానాల వల్ల, వ్యవస్థ వల్ల దుర్భరంగా మారిన ప్రజా  జీవితంలో మార్పు కోసం ప్రగతిశీల దృక్పథంతో పని చేస్తున్నారు. తమ  విశ్వాసాలను బహిరంగంగా ప్రకటించుకొని పని చేస్తున్నారు. కానీ వీరంతా  మావోయిస్టు పార్టీ నాయకుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ ఆదేశాలకు  అనుగుణంగా పనిచేస్తున్నారని వీరి పోలీసులు ఆరోపించారు. ఒక అబద్ద ఆరోపణ  చేసి, దాని మీద ఆధారపడి ఈ కేసు నమోదు చేశారు.

వాస్తవానికి ఈ  సంఘాలన్నీ తమ అవగాహన మేరకు ప్రజాస్వామిక విలువల కోసం పని చేస్తున్నాయి.  రాష్ట్రంలో బూటకపు ఎన్ కౌంటర్ హత్యలు, మావోయిస్టుల అణచివేత పేరుతో ఆదివాసుల  మీద దాడులు, బాక్సైట్ వ్యతిరేక ఆదివాసీ పోరాటాలను అణచివేయడానికి కూంబింగ్  తరహా హింసాత్మక చర్యలను వ్యతిరేకిస్తూ పని చేస్తున్నారు. స్త్రీల మీద  పితృస్వామ్య హింస, అగ్రకుల ఆధిపత్య దాడులు, ముస్లింలపై హిందుత్వ శక్తుల  హింసోన్మాదం, అభివృద్ధి పేరుతో విధ్వంసం, నిర్వాసితత్వం, అప్రజాస్వామిక  చట్టాల కింద అక్రమ అరెస్టులు మొదలైన ఎన్నో ప్రజాస్వామిక సమస్యలపై  పోరాడుతున్నారు. ఈ సమస్యలపై నిజనిర్ధారణలు, సభలు సమావేశాలు, పత్రికా  ప్రకటనలు, ఆందోళనలు, రచన, పత్రికా నిర్వహణ వంటి రూపాల్లో పని చేస్తున్నారు.

దీన్ని  సహించలేని *వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఈ అక్రమ కేసులను పెట్టింది.  ఈ కేసుల వల్ల ప్రజల కోసం పనిచేయకుండా ప్రజా సంలను అడ్డుకోగలమని అనుకోవడం  పిచ్చి ఊహే. దేనికంటే ఇలాంటి కేసులు ప్రజా సంఘాలకు ఇదే మొదలు కాదు. ఇట్లా  ప్రజాసంఘాల నాయకులు, సభ్యులందరి మీద  కేసులు పెట్టే పద్ధతి గత ఏడాది  తెలంగాణ ప్రభుత్వం ఆరంభించింది. అక్కడా సరిగ్గా ఇలాంటి తప్పుడు అభియోగాలే  చేశారు. ఇప్పుడు ఆ పని ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేస్తున్నారు.  దేశ వ్యాప్తంగా  కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో నడుస్తున్న నిర్బంధంలో భాగమే ఈ  అక్రమ కేసులు. అజిత్ దోవల్, విజయ్ కుమార్ ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తుల  మీద చేస్తున్న దాడిలో భాగమే ఇదంతా. దీన్ని *పౌర హక్కుల సంఘం* ఖండిస్తోంది

ఎల్లంకి వెంకటేశ్వర్లు.
చీమల పెంట  వెంకటేశ్వర్లు.
పౌర హక్కుల సంఘ


Comments