రాష్ట్రంలో హక్కుల,ప్రజాసంఘాల పై "ఊపా" వల
ఈ నెల 23,24వ తేదీల్లో విశాఖ జిల్లా ముంచింగ్ పుట్,గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీసు స్టేషన్ లో హక్కుల సంఘాలు, ప్రజాసంఘాల నాయకుల పై "ఊపా"చట్టం క్రింద కేసు నమోదు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.రాష్ట్రం లో ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు, వివిధ సాయుధ బలగాల ద్వారా తీవ్రాతి తీవ్రంగా హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుంది.హత్యలకు,అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలు ప్రచారసాధనాల ద్వారా వెల్లడవుతున్నాయి.ఆ యా సంఘటనలలో కనీసం నిజనిర్ధారణలకు కూడా హక్కుల సంఘాలను వెళ్ళనివ్వకుండా పోలీసుల ద్వారా అడ్డుకుంటుంది.
హక్కుల సంఘాలు నిజానిజాలు తెలుసుకోకుండా అడ్డుకోవటం అప్రజాస్వామికం.ఇదే విషయాన్ని గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి దీక్షలను శాంతి భద్రతలపేరట రాజ్యాంగ హక్కులు కాలరాయవద్దని పేర్కొన్నాము. నేడు అదేపనికి ఈ వై.ఏస్.జగన్మోహన్ రెడ్డి పాల్పడటం శోచనీయం. రేపు ఇంకో ప్రభుత్వం వచ్చిన హక్కుల సంఘాలు గా మెం కోరేది అదే.మమ్మల్ని నిజనిర్ధారణలకు వెళ్ళనివ్వకపోగా ఇండ్లలో ఉన్నవారిపై ఇష్టానుసారంగా కేసులు నమోదు చేయించటం భయభ్రాంతులకు గురిచేయటానికే.ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి చంద్రచూడ్ చెప్పినట్లు భావప్రకటనా స్వేఛ్ఛను బంధిస్తే సామాజిక విస్పోటం రూపంలో అది భ్రద్దలౌతుంది.తాత్కాలికంగా 5 సంవత్సరాలకు ఒక సారి ఎన్నికైయ్యే ప్రభుత్వాలు అటువంటి చర్యలకు పూనుకోవటం తగదని భావిస్తున్నాం. పాలకులే భారతరాజ్యంగ సౌధవ పునాధి రాళ్ళయిన భావవ్యక్తీకరణ స్వేఛ్ఛను అడ్డుకోవటం విచారకరం.వినాశకరం.రాజ్యాంగ దినోత్సవ రోజున మా ఈ అభిప్రాయం మీకు అనగా ముఖ్యమంత్రి కి తెలియజేస్తున్నాం. ఈ రాజ్యాంగ ఫలాలు పాలకులకు, ధనవంతులకే కాదు,"గొంతు లేనివారికి,నిరుపేదలకు "వారితరపున మాట్లాడేవారికి కూడ ఉంటాయని,వారికి కూడా మీరే రక్షణ కల్పించాలని ఈ రాజ్యాంగ దినోత్సవన ఆలకిస్తారని,ఆలోచించి పోలీసుశాఖకు తగిన ఆదేశాలిచ్చి పై రెండు కేసులను భేషరతుగా ఎ. త్తివేయాలని కోరుతూ,డిమాండ్ చేస్తున్నాం
1) వేడంగి చిట్టబాబు. (అద్యక్షుడు) 2)చిలుకా చంద్రశేఖర్(కార్యదర్శి) పౌరహక్కులసంఘం, ఆంద్రప్రదేశ్.
Comments
Post a Comment