సామాజిక మేధావి పురుషోత్తం | ఎన్. శ్రీమన్నారాయణ



అమరుడు పురుషోత్తం 1998  లో హైదరాబాద్ మహా సభల్లో  నాకు ప్రత్యక్ష పరిచయం. ఇది  పౌర హక్కుల సంఘం లో చాలా కీలకమయిన మహా సభ. సంస్థ లో  సిద్ధాంత పరమైన చర్చ తీవ్రంగా నడిచిన మహా సభ.15 సంవత్సరం లు గా ప్రధాన కార్యదర్శి గా పని చేసిన సంస్థ నాయకుడు బాలగోపాల్ మరియు మేధావుల బృదం ఒక వైపు, మెజారిటీ కార్యకర్తలు కొద్దిమంది మేధావులు ఒక వైపు గా విడిపోవటం జరిగినది. ఈ చర్చలు ప్రైవేటు హింస,రాజ్య హింస పై జరిగినవి. ఆ చర్చ జరుగుతున్న సందర్భంగా గొర్రెపాటి మాధవ రావు గారు బాలగోపాల్ వాదనకు మద్దతుగా మాట్లాడటం జరిగింది. ఆగ్రహించిన కొంతమంది కార్యకర్తలు ఆయన్ని తీవ్రపదజాలం తో మాట్లాడడం జరిగింది. దాన్ని కొంతమంది మిత్రులం వ్యతిరేకించటం జరిగింది. ఆ సమయంలో అమరుడు పురుషోత్తం కలగ చేసుకుని ఆగ్రహం తో ఉన్న బుచ్చారెడ్డి గారిని శాంతింప చేశారు.ఆ సందర్భంగా నాతో పురుషోత్తం సంభాషించడం  జరిగింది. మా మిత్ర బృందానికి కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా సూత్రబద్దం గా బాలగోపాల్ బృందం వాదనను మా మిత్రబృదం  తిరస్కరిస్తుంది. సంస్థలోనే మేము కొనసాగుతాము అని అన్నాను. తిరుమలరావు,రవి తదితరులు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు బాల గోపాల్ మిత్రబృందాన్ని హుందా గా వాదనచేసి గెలుసుకోవాలి. 

 తీవ్రమైన మాటలతో మాటాడటం నాకు నచ్చలేదు అన్నా అన్నాను.అందరూ ఒకే లా ఉండరు. శాంతం, ఆవేశంగా ఉండే వారు ఉంటారు.  మనం అర్ధం చేసుకోవాలి అని అన్నారు. ఈ సంభాషణ సుదీర్ఘంగా నే కొనసాగింది. అనంతరం ఏమి చేస్తున్నారు అని అడిగినారు. లాయర్ ని అన్నాను.మీ గురించి చిట్టిబాబు చెప్పాడు అన్నారు. ఫోన్ నెంబర్ ఉందా అని అన్నారు.222815 అన్నాను. క్షణం ఆలస్యం చేయకుండా నోట్ చేసుకున్నారు.అలా పురుషోత్తం తో ప్రత్యక్ష పరిచయం అయింది. ఆ పరిచయం ఆయన చనిపోయే వరకు కొనసాగింది. రెగ్యులర్ గా జిల్లా లో కస్టడీ మరణాలు, మహిళలు పై హింస జరిగినపుడు ఉదయమే పేపర్ చూసి ఫోన్ చేసేవాడు. నిజనిర్ధాన చేయండి అని చెప్పేవాడు. శేషయ్య గారు కార్యదర్శి అయినా ప్రత్యేకంగా కార్యక్రమాలు ని పురుషోత్తం  ఫాలోఅప్ చేసేవాడు.సంస్థ భాద్యత లు కి కట్టుబడి నిత్యం పని చేసేవాడు.ఆయన కమిట్మెంట్ నేటి కి ఎవరికి రాలేదు. ఇది అతిశయోక్తి కాదు.వాస్తవం.అమరుడు శేషయ్య గారు మేధోపరమైన ఫిలాసాపికల్ వర్క్ ఎక్కువ చూసేవారు. శేషయ్య గారిని సంప్రదిస్తూ పురుషోత్తం రాష్ట్ర మంతా తిరిగి సంస్థ కార్యకలాపాలు,నిర్మాణ పనులు చూసేవారు.రాష్ట్ర కమిటీ లో మంచి చురుకైన పాత్ర ని పోషించేవారు. రాజ్య హింస పై రాజ్యాన్ని ప్రశ్నిస్తూ జీవించే హక్కుల పరిరక్షణ కోసం పలు కేసులను న్యాయవాది గా హైకోర్టు లో వేశాడు. 

పౌరహక్కుల సంఘం పురుషోత్తం గా ఎదిగినాడు.  సంస్థలో సమిష్టి పని విధానం అలవాటు చేశారు.అందుకే మేధావులు అంతా బాలగోపాల్ వైపు వెళ్లిపోయిన సంస్థ కి తక్కువ కాలం లోనే మంచి గుర్తింపు వచ్చింది. రాజ్యం కుట్ర చేసి అంతం చేసినది. ప్రజలు జీవించే హక్కుల కోసం పనిచేసిన అమరుడు పురుషోత్తం మా మదిలో చిరకాలం చిరంజీవే. ఆయన రూపం ప్రజల మనసుల్లో పదిలం. ఆయన ఆశయాల సాధన కోసం పౌర హక్కుల సంఘం మరోసారి ప్రతిన బూనుతుంది. జోహార్... అమరుడు పురుషోత్తం.
 
 నీవు యాది కి వచ్చిన
 ప్రతి క్షణం హక్కుల 
 స్ఫూర్తి,చైతన్యం 
 అగ్ని కణమై
 వెలుగుతుంది.

నీ రూపం గుర్తుకు వచ్చిన
ప్రతి నిమిషం రాజ్యం పై పోరు
కసి రెట్టింపు అవుతుంది.

స్వేచ్ఛ ను చూసిన ప్రతిసారి
నువ్వే ...నువ్వే..గుర్తుకొస్తున్నావు.

నీవు కోరుకున్న  స్వేచ్ఛ,సమానత్వం కోసం
ప్రజలు జీవించే హక్కు కోసం
పౌర హక్కుల సంఘం 
మరోసారి ప్రతిన బూనుతుంది.

(నవంబర్ 23  అమరుడు పురుషోత్తం 20 వ వర్ధంతి సందర్భంగా)

- నంబూరి. శ్రీమన్నారాయణ
     రాష్ట్ర ఉపాధ్యకుడు
    ఆంధ్రప్రదేశ్ కమిటీ

Comments