అర్నాబ్ గోస్వామి కేసు సుప్రీంకోర్టు అర్జంట్ లిస్ట్ చేయటం కేసుల విచారణ పద్దతి కి వ్యతిరేకం.
భారతీయ న్యాయవ్యవస్థ లో ధనవంతులు, అధికార పక్షం వారికి మాత్రమే న్యాయం జరుగుతుంది. ఆవిషయం మరోసారి అర్నాబ్ గోస్వామి కేసు తో మరో సారి రుజువు అయింది. ఆర్నాబ్ గోస్వామి అరెస్ట్ చేయబడి 4 రోజులు అయిందో లేదో గోస్వామి వర్గం, వారి రాజకీయ మనువాద మిత్రులు గగ్గోలు పెడుతున్నారు.గోస్వామి దేశం కోసం మో, సమాజం కోసమో పని చేసిన వాడు కాదు.ఆయన అర్కిటెక్ డిజైనర్ అన్వయ నాయక్ అతని తల్లి ఆత్మహత్య కేసులో నేరారోపణ కు గురై ఖైదు చేయబడ్డాడు. అతను కూడా అందరు రిమాండ్ ఖైదీల వలే ఒక ఖైదీ. ఈ సందర్భంగా అతని బెయిల్ పిటీషన్ అందరి పిటిషన్ ల వలె వరుస క్రమంలో విచారణకు రావాలి. కాని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అర్జంట్ కేసుల విచారణ లిస్ట్ లో చేర్చింది. ఖైదీల హక్కుల గురించి ఇక్కడ మనం మాట్లాడాలి.
ఒక ఖైదీ గా ఆయనకు ఉండే హక్కుల గురించి ఆయనకు ఉంటాయి. అర్నాబ్ కేసు కంటే ముందు ఉన్నకేసు ల్లో ఖైదీల విచారణ హక్కుల గురించి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఇక్కడ సమాజానికి సమాధానం చెప్పాలి. విచారణ జరగ క బెయిల్ లు రాక సంవత్సరాల తరబడి జైలు లో మగ్గిపోతున్న సామాన్య ఖైదీలకు అయినా సమాధానం చెప్పాలి. గౌరవ జస్టిస్ దీపక్ మిశ్రా గారు చెప్పినట్లు ఈ దేశపు న్యాయ స్థానాలు అధికారం ఉన్న ఖరీదు అయిన ధనవంతులు పక్షాన నిలబడి పని చేస్తున్నాయా? అని ప్రశ్నించుకుని పరిశీలిస్తే పరిశీలకులు కు అదే నిజం అని అనిపిస్తుంది అంటున్నారు. మ్ కోరేగావ్ కేసులో 75 సంవత్సరాల కు పైబడి ఉన్న వయోవృద్ధుడు,ప్రపంచ ప్రఖ్యాత విప్లవ కవి, మేధావి అయిన వరవరరావు కరోనా భారిన పడి చావుబతుకుల మద్య ఉంటే ఇదే సుప్రీంకోర్టు ఎందుకు కనికరం లేకుండా వ్యవహరించింది అని ప్రజాస్వామిక వాదులు ప్రశ్న.
ఈ కేసులో అరెస్ట్ కాబడిన సుధా భరద్వాజ్ ,గాడ్లింగ్ ప్రముఖ న్యాయవాదులు మిగతా వారంతా పేరుపొందిన సామాజిక సేవకులు.గత రెండు సంవత్సరాలు గా జైలు గోడలు మధ్య నలిగి పోతున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ భావజాలం కలిగి, అణగారిన వర్గాల ప్రజల పక్షాన నిలబడి సమాజ పురోగతి కోసం పనిచేస్తున్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను తమ కలం, గల్లం తో ప్రజలకు వినిపిస్తున్నందున వలనే కేంద్ర ప్రభుత్వం తప్పుడు ఆరోపణ లు తో జైల్ లో ఉంచారు. అది ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. రాజ్యాంగం లోని రాజకీయ స్వేచ్ఛ ని కాపాడవలసినది న్యాయ వ్యవస్థే. సంవత్సరం ల తరబడి జైల్ లో మగ్గిపోతున్న ఈకేసు విచారణ కి అర్జంట్ లిస్ట్ ఎందుకు లేదు అనేది ప్రశ్న.
పాదర్ స్టాన్ స్వామి ఒక క్రిస్టియన్ పాదర్ అక్కడ గిరిజన సమాజం బతుకులు ఛిద్రం అవుతుంటే చూస్తూ ఉండలేక వారు జీవించే హక్కుల కొరకు రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలకు విన్నవించారు. వాటి గురించి మాట్లాడినారు.అది నేరం కాదు.కానీ కేంద్ర ప్రభుత్వం NIA చేత ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం ఊపా కింద అరెస్ట్ చేయించింది. ఇది మైనార్టీ క్రిస్టియన్ ల పై దాడి గా క్రిస్టియన్ సమాజం భావిస్తుంది.పాదర్ స్టాన్ స్వామి పార్కిన్ సన్ వ్యాధితో బాధ పడుతున్నారు. ఆయనకు ఆహారం తీసుకోవటానికి స్ట్రా తదితరాలు ఇవ్వటానికి జైల్ అధికారులు తిరస్కరించారు. దానిపై పిటీషన్ వేస్తే కౌంటర్ వేయటానికి 20 రోజుల సమయం ఇచ్చారు. ఈ రోజులో వణుకుతున్న చేతులతో ఆయన ఆహారం ఎలా తీసుకోవాలి?.ఎలా బ్రతకాలి?. కోర్ట్ కనికరం లేకుండా కనీస మానవత్వం లేకుండ వ్యవరించించింది అని సమాజం ఆమోదించ లేకుండా పోతుంది.ఇలాంటి విషయాలు కోర్ట్ ల గౌరవం,ప్రతిష్టలను దెబ్బ తీస్తాయి.ఇది చాలా ఆందోళనకర విషయం మైనార్టీల హక్కుల పై తీవ్రం గా ప్రభుత్వాలు దాడులు చేస్తుంటే అర్నాబ్ గోస్వామి కేసులో స్పందించినట్లు మిగతా కేసుల్లో న్యాయవ్యవస్థ ఎందుకు స్పందించడం లేదు అనేది సమాజానికి సందేహం.
సీనియర్ న్యాయవాది, మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం బెయిల్ విచారణ సందర్భం లో కూడా అత్యవసర విచారణ చేపట్టలేదు. కోర్టు ల పై నమ్మకం, విశ్వాసం కోల్పోయే కొన్ని అంశాల పై న్యాయ వ్యవస్థ సమీక్ష చేసుకోవాలి.అర్నాబ్ గోస్వామి లాంటి కేసులో స్పందించినట్లు మిగతా సామాన్యులు కేసులోను స్పందించాలి లేకపోతే సమాజం లోని ప్రజల్లో ఉన్న కొద్దిపాటి విశ్వసనీయత,నమ్మకం కూడా కోల్పోయే ప్రమాదం ఉన్నది. ప్రముఖులు కి, సామాన్యులకు తేడా లేకుండా పద్దతి ప్రకారం కేసులు విచారణ ఉండాలని ప్రజలు కోరుతున్నారు.
- నంబూరి. శ్రీమన్నారాయణ
హైకోర్టు న్యాయవాది.
రాష్ట్ర ఉపాధ్యక్షుడు.
పౌర హక్కుల సంఘం. CLC
ఆంద్రప్రదేశ్.
Comments
Post a Comment