పి. రవి కుమార్ మాస్టర్కి జోహార్లు (పచ్చిమ గోదావరి జిల్లా)

 జంగారెడ్డిగూడెం 31.10.2020

పౌరహక్కుల సంఘం CLC  జిల్లా కార్యవర్గ సభ్యులు, మాజీ జిల్లా అధ్యక్షులు,మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి కుమార్ మాస్టర్ కి జోహార్లు. ఘనంగా జోహార్లు అర్పించిన జిల్లా పౌర హక్కుల సంఘం CLC.

బ్రెయిన్ ఆపరేషన్ సంధర్భంగా హైద్రాబాద్ ఆస్పత్రి లో కరోనా సోకి 29.10.2020 న మరణించిన పౌర హక్కుల సంఘం జిల్లా నాయకులు, మాజీ జిల్లా అధ్యక్షులు,మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. రవి కుమార్ మాస్టర్ గార్లకు జిల్లా కార్యవర్గం ప్రత్యేక సమావేశం లో ఘనంగా నివాళులు అర్పించింది.

హక్కుల ఉద్యమ జోహార్లు తెలిపింది. ఈ రోజు జరిగిన పౌర హక్కుల సంఘం జిల్లా ప్రత్యేక సమావేశం లో తీర్మానం ఆమోదించడం జరిగింది. ఈ రోజు జంగారెడ్డిగూడెం లో జరిగిన సమావేశం కి జిల్లా ఉపాధ్యక్షుడు, న్యాయవాది భాషా శ్యాంబాబు అధ్యక్షత వహించారు. సమావేశంలో తీర్మానం జిల్లా ప్రధాన కార్యదర్శి కె వి రత్నం ప్రవేశ పెట్టారు. సమావేశం ఏకగ్రీవం గా ఆమోదించింది.
 
 ఈ సమావేశం కి హాజరు అయిన రాష్ట్ర ఉపాఢ్యక్షులు నంబూరి. శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ప్రజల హక్కుల కోసం పనిచేసిన CDRO జాతీయ నాయకులు, పౌరహక్కుల సంఘం ఉభయ తెలుగు రాష్ట్రాల కో ఆర్డినేషన్ కన్వీనర్ ప్రొఫెసర్ శేషయ్య, మాస్టర్ పి.రవికుమార్ లు ఇరువురు ఉపాద్యాయ రంగం నుండి వచ్చినవారేనని అన్నారు. వారు రాజ్యహింస ను వ్యతిరేకిస్తూ నిలబడ్డారు అని అన్నారు. వీరి మరణం పౌర,ప్రజాస్వామిక ఉద్యమాలకు నష్టం అని అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని ప్రజలు జీవించే హక్కుల కోసం పని చేయటమే నిజమైన నివాళి అని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కె వి రత్నం మాట్లాడుతూ ప్రొఫెసర్ శేషయ్య గారి మరణం తర్వాత మాస్టర్ రవి కుమార్ గారి మరణం సభ్యులను తీవ్రంగా కలవరపరిచింది అన్నారు. వారు సంస్థలో క్రమశిక్షణతో ఉండేవారని ఆ తరం క్రమశిక్షణ ను అలవర్చుకుని పనిచేయట మే వారికి మనం అర్పించే నివాళ్లి ఆని అన్నారు.

   సమావేశం వారి మరణానికి నివాళి అర్పిస్తూ 2నిమిషాలు మౌనం పాటించింది.సంతాపం తెలిపింది.వాళ్ళ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపింది. ఇంకా ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు ch. రత్నం, గోగుల ఛిన్నారెడ్డి, G. ప్రసాద్ రెడ్డి, కెచ్చెల మంగిరెడ్డి తదితరులు పాల్గొని జోహార్లు తెలిపినారు.
                  
   ఇట్లు
           బాషా శ్యాం బాబు
    జిల్లాఉపాధ్యక్షుడు.న్యాయవాది

              కె. వి. రత్నం
        జిల్లా ప్రధాన కార్యదర్శి

    పౌర హక్కుల సంఘం.CLC
    పశ్చిమగోదావరి జిల్లా శాఖ
 31.10.2020. జంగారెడ్డిగూడెం.
    10.30am to 12pm
9866681862.

Comments