శేషయ్య సంతాప సభ (అనంతపురం జిల్లా)

శేషయ్య మృతి పౌర హక్కుల ఉద్యమానికి,పీడిత  ప్రజలకు  తీరని లోటు....01/11/2020 న అనంతపురంలో జరిగిన శేషయ్య గారి సంతాప సభ లో  వక్తల సందేశాలు.

  పౌర హక్కుల సంఘం రెండు తెలుగు రాష్ట్రాల సమన్వయ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ శేషయ్య అక్టోబర్ 10 న మరణించారు.ఆయన సంతాప సభ ఈరోజు ఉదయం విజయ నగర లా కళాశాల సెమినార్ హాల్ నందు పౌర హక్కుల సంఘం నిర్వహించింది.ఈ సభకు పౌర హక్కుల సంఘం (ఆంధ్ర ప్రదేశ్) ఉపాధ్యక్షుడు కె.క్రాంతి చైతన్య అధ్యక్షత వహించారు. కార్య క్రమానికి ముందుగా  సభలో పాల్గొన్న  శేషయ్య గారి సహచరి  Sasikala గారు  శేషయ్య గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు  సభలో పాల్గొన్న వారందరూ రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాప తెలియ జేశారు.

   ఈ  సభలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్ర శేఖర్  మాట్లాడుతూ "ఎవ్వరి హక్కుల కోసం మరెవరూ మాట్లాడారో వారి కోసం మాట్లాడేది పౌర హక్కుల సంఘం అని , సంస్థకు దశను,దిశను నిర్దేశించిన ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ శేషయ్య అంతే కాకుండా .తెలుగు రాష్ట్రాల్లో విశాల మైన బలమైన పౌర హక్కుల ఉద్యమ నిర్మాణంలో ఆయన కృషి మరువలేనిది ఆయన కొనియాడారు శేషయ్య గారి ఆలోచనలను.  ఆశయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళినప్పుడు ఆయనకు నిజమైన నివాళి అని శ్లాఘించారు.      ఓ.పి. డి.ఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోనూ అదే విధంగా రాష్ట్రంలోనూ పౌర హక్కుల సంఘం తో ప్రజా సమస్యల పై ఇతర  హక్కుల సంఘాల ఐక్య ఉద్య మాల ల్లో చొరవగా  అందరినీ కలుపుకొని పని చేశారు ఐక్య ఉద్య మాల్లో ఆయన స్ఫూర్తి ఆదర్శ నీయ మని కొనియాడారు.

  మానవ హక్కుల వేదిక సమన్వయ కమిటీ సభ్యులు చంద్ర శేఖర్ మాట్లాడుతూ ఉమ్మడి పౌర హక్కుల సంఘం నుండి ఆయనతో కలిసి పని చేసిన పాలు సందర్భాలను గుర్తు చేశారు.హక్కుల కోణం నుండి రాజ్యాంగాన్ని,న్యాయ వ్యవస్థను చక్కగా విశ్లేషించే వారని,సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తి గతంగా స్నేహ శీలి గా ఉండే వారని గొప్ప మానవీయ విలువలున్న వ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు.ఆయన మరణం సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు.

   పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ రావు మాట్లాడుతూ ప్రాంతీయ ఉద్యమాలను అస్తిత్వ ఉద్యమాల ను హక్కుల దృక్పథంలో విశ్లేషించి  వాటి ని సాడించుకోవాటనికి పోరాడే వారని ,అందులో భాగంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఆంధ్ర,తెలంగాణ కార్యకర్తలను ఒక తాటి పై కి తెచ్చి మద్దతు తెలిపారు అని కొని యాడారు.

   విప్లవ రచయితల సంఘం నాయకురాలు వరలక్ష్మి మాట్లాడుతూ ఆయనలో ప్రజా సమస్యలను హక్కుల కోణంలోనే గాక మార్క్సిస్ట్ కోణంలో కూడా ఆలోచించి పరిష్కారానికి ఆయన కృషి ఎనలేనిది అనికొనియాడుతూ, రాజ్యం ఎంత నిర్బంధ ప్రయోగించి ఇంటి పై దాడులకు తెగ పడిన రాజ్యాన్ని ప్రశ్నించడం లో వెనకడుగు వేయని  గొప్ప నాయకుడని కొనియాడారు.

  ఈ సభలో  ప్రజా కళా మండలి కోటి బృందం సాంస్కృతిక కార్య్రమాలతో శేషయ్య గారికి ఘన నివాళులు అర్పించారు.

    ఈ సభలో న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్  రెడ్డి,సి.పి. ఐ జిల్లా నాయకులు జాఫార్,వెమయ్య , కుల నిర్మూలనా పోరాట సమితి జిల్లా కార్యదర్శి నల్లప్ప ,ప్రముఖ రచయిత కంబ దూరు షేక్ నబీ రసూల్, మాదిగ హక్కుల పోరాట సమితి నాయకులు పసలూరి ఓబులేసు  చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కార్య వర్గ సభ్యురాలు ఝాన్సి లక్ష్మి  తదితరులు  పాల్గొని  ప్రసంగించారు.ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు k.విజయ కుమార్, శ్రీ మన్నారాయన,రఘునాథ్, మాదన కుమారస్వామి,గుంటి రవి , సి.వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు , కార్యకర్తలు,ప్రజాస్వామిక వాదులు పాల్గొని విజయవంతం చేశారు.

పౌరహక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్, 
పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. నారాయణ రావు.
.

Comments