సమ్మెకు పౌర హక్కుల సంఘం మద్దతు

దేశవ్యాప్తంగా నవంబర్26న జరిగే సమ్మెకు పౌర హక్కుల సంఘం సంపూర్ణ మద్దతు.

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక,రైతు ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా నవంబర్ 26 తేదీన కార్మిక సంఘాలు, వివిధ పక్షాలు చేస్తున్న సమ్మెకు పౌర హక్కుల సంఘం తెలంగాణ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది.బీజేపీ మోడీ ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలను  నిర్వీర్యం చేస్తూ  చౌక గా బడా కార్పొరేట్ సంస్థలకు, ప్రైవేటు సంస్థలకు అమ్మివేస్తున్నారు.100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను బొగ్గుగనుల్లో,రక్షణరంగం ఇతర మౌలిక రంగాల్లోకి అనుమతులు ఇచ్చినారు..1886లో చికాగో వేలాది కార్మికుల చారిత్రక కార్మికోద్యమ అంతర్జాతీయ పోరాటల రక్త తర్పణ త్యాగనేపధ్యంలో సాధించుకున్న 8 గంటల పనివిధానం డిమాండ్ ను దుర్మార్గంగా అణిచివేసి కొత్తగా 12 గంటలకు పెంచినారు, యూనియన్ పెట్టుకొనే హక్కు, కార్మికులు రక్షణతో కూడిన జీవించే పనిభద్రత హక్కు, పెన్షన్ కోత, ప్రావిడెంట్ ఫండ్ ను తొలగించి EPF లో విలీనం చేయడం లాంటి కార్మిక వ్యతిరేక చట్టాలనుతెఛ్చారు. కార్మిక వర్గానికి  దశాబ్దాల కాలంగా అండగా ఉన్న  44 కార్మిక చట్టాలను కుదించి 4 కోడ్లుగా సవరించి కొత్త చట్టాలను బీజేపీ మోడీ ప్రభుత్వం తీసుక  వచ్చింది. వ్యవసాయరంగంలో మూడు కొత్త చట్టాలు తీసుక వచ్చినారు.ఈ చట్టాల వల్ల బడా కార్పొరేట్ సంస్థలకు, ప్రైవేటు సంస్థలకు మేలు జరుగుతుంది కానీ కార్మిక వర్గం,రైతులు,ప్రజల బ్రతుకులు మరింత సంక్షోభంలోకి నెట్టబడుతాయి.కార్మికులు సంఘము పెట్టుకొనే హక్కు,నిరసన తెలియజేసే హక్కు ,సమ్మే చేసే హక్కును కలిగి ఉండ డాన్ని పౌరహక్కుల సంఘం సమర్దిస్తుంది,  అందుకే కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక,రైతు, ప్రజా వ్యతి రేక విధానాలకు నిరసనగా నవంబర్ 26న జరిపే దేశవ్యాప్త సమ్మెను బలపరుస్తూ మద్దతునిస్తుంది. కావున సింగరేణి బొగ్గుగని కార్మికులు, సంఘటిత,అసంఘటిత కార్మికులు ఈసమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని  పౌర హక్కుల సంఘం విజ్ఞప్తి జేస్తుంది..

1.ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్,అధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
2.N. నారాయణరావు,ప్రధాన కార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
3.మాదనకుమారస్వామి, సహాయ కార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ.

24 నవంబర్,2020.
హైదరాబాద్.

Comments