నాలుగు న్నర దశాబ్దాలుగా పీడిత ప్రజల హక్కుల కోసం పరితపించి నిరంతరం పోరాడిన యోధుడు ప్రొఫెసర్ శేషయ్య గారికి అశ్రు నివాళులు
ప్రొఫెసర్ శేషయ్య గారు గత నాలుగున్నర దశాబ్దాలుగా సమాజంలో నీ ఆర్థిక,సామాజిక అసమానతలు రూపు మాపడానికి ఎంతో కృషి చేశారు,అణచి వేయబ డు తున్న దళిత,గిరిజన,మహిళల ,ముస్లిం మైనార్టీల హక్కుల కోసం నిరంతరం పోరాడిన గొప్ప మానవతావాది ప్రొఫెసర్ శేషయ్య .విద్యార్థి దశ నుండే ప్రగతి శీల భావాలు కల్గిన శేషయ్య గారు న్యాయ శాస్త్ర విద్యను పూర్తి చేసుకొని అధ్యాపకుడిగా,ఆచార్యుడిగా విద్యార్థులకు పాఠ్యాంశా లే కాక,సమాజంలో జరుగుతున్న హక్కుల ఉల్లంఘనలు గురించి చర్చించే వారు, సామాజిక బాధ్యత తోకూడిన విలువలు పెంపొందించు కునేలా తీర్చి దిద్దారు. ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కుల సంఘం లో ఒక కార్య కర్తగా చేరి అంచే లంచలగా ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా,అధ్యక్షుడుగా పనిచేశాడు.అంతే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల హక్కుల సంఘాలను కలుపుకొని CDRO ( కో ఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్) కు జాతీయ కన్వీనర్ గా పనిచేసి దేశ వ్యాప్తంగా హక్కుల ఉల్లగణలకు వ్యతిరేకంగా పనిచేసిన శేషయ్య గారు గత రెండు వారాల క్రితం అనారోగ్యానికి లోనై హైదరా బాద్ లో చికిత్స పొందుతూ 10/10/2020 రాత్రి మరణించడం బాధాకరం,ఈయన మృతితో భారత దేశ పీడిత ప్రజలకు తీరని లోటు,అంతే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల పౌర హక్కుల సంఘం ఒక పెద్ద దిక్కును కోల్పోయింది..శేషయ్య గారి ఆలోచనలను,ఆశయాల ను ప్రజల్లో కి తీసుకెళ్ళి బలమైన హక్కుల ఉద్యమాన్ని నిర్మించడమే మనం ఆయనకు అర్పించే ఘన మైన నివాళులు.
పౌర హక్కుల సంఘం,కడప
Comments
Post a Comment