వరంగల్ లో ప్రజాసంఘాల నాయకుల అక్రమ అరెస్టును తీవ్రంగాఖండిస్తున్నాం. పౌర హక్కుల సంఘం ఖండిస్తున్నది.
వరంగల్ లో ఈ రోజు 21 అక్టోబర్,2020 న ప్రజా సంఘాల నాయకులు విరసం బాసిత్,సుదర్శన్, పౌర హక్కుల సంఘం, రంజిత్, డీటీఎఫ్ గంగాధర్,అమరుల బంధు మిత్రుల సంఘం, శాంత, భారతి,చైతన్య మహిళా సంఘం అనిత లను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని పౌర హక్కుల సంఘం తెలంగాణ ఖండిస్తున్నది. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన GN సాయిబాబాను(90 శాతం అంగవైకల్యం కలిగిఉన్న) 2014 మే నెలలో, BJP ప్రభుత్వం కుట్రతో UAPA తప్పుడు కేసు నమోదుచేసి, జీవిత ఖైదుగా చేసి నాగపూర్ అండా సెల్లో నిర్బంధించారు. జైల్లోఅతనికి మందులు ఇవ్వకుండా, తన బంధువులతో ములాఖత్ కు మరియు న్యాయవాదిని కూడా కలువకుండా చనిపోయేటట్లు జైలు అధికార్లు చాలారోజుల నుంచి వేదిస్తున్నారు.
తీవ్ర అనారోగ్యంతో జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటుంటూ విసిగి GN సాయిబాబా ఈ రోజు 21 అక్టోబరు,2020 నుండి ఆమరణ నిరాహారదీక్ష కు పూనుకుంటే, అదీక్షకు మద్దతుగా వరంగల్ ప్రజాసంఘాల నాయకులు నిరసన గళం విప్పకుండా కేసీఆర్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం మరియు రాజ్యాంగ వ్యతిరేకమైనది.ప్రజాస్వామ్య గొంతులపై,భావవ్యక్తీకరణ ను KCR ప్రభుత్వం పోలీసులతో అణిచివేయడాన్ని ప్రతీ ఒక్కరూ ఖండించాలని కోరుతున్నాం.అక్రమంగా అరెస్ట్ చేసిన ప్రజా సంఘాల నాయకులను బే షరతుగా వెంటనే విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది..ప్రొఫెసర్ GN సాయిబాబాను మెరుగైన వైద్యం కొరకు జైల్నుండి పెరోల్ పై విడుదల చేయాలి..
1.ప్రొపెసర్ గడ్డం లక్ష్మణ్,అధ్యక్షులు,
పౌరహక్కుల సంఘం తెలంగాణ.
2.N. నారాయణ రావు, ప్రధానకార్యదర్శి, కార్యదర్శి,పౌరహక్కుల సంఘం తెలంగాణ.
పౌరహక్కుల సంఘం తెలంగాణ.
బుధవారం,21 అక్టోబర్2020....
హైదరాబాద్.....
పౌర హక్కుల సంఘం,తెలంగాణ.
It is nothing but killing democracy .Prof Saibaba should be Released immediately in the interest of natural Justice.
ReplyDelete