ఆచార్యనుకి వందనాలు | శ్రీధర్



ప్రో శేషయ్య సార్ అనారొగ్యంతో చనిపోయారని తెలసి బాధతో సార్ కి జోహార్లు తెలుపు తున్నాను.  నాకు 86 నుండి హక్కుల ఉద్యమముతో సంబంధం వుందిం ఖమ్మం లో కృష్ణమూర్తి గారు రాష్ట్రంలో బాలగోపాల్, హరగోపాల్ గారే APCLC  గా అవగాహన ఉండేది. 91 వరకు PDSU సభ్యునిగా Clc తో కార్యక్రమాలలో పాల్గొన్న అనుభవమే వుంది. బాలగోపాల్ గారి వాదన, చర్చలు జరిగేటప్పుడు వారి వాదనలో 50-50 నిజమే అన్న అబిప్రాయం కలగింది. బలమైన బాలగోపాల్ గారు clc వీడితే  ఎలా అనిపించింది. అప్పుడు Clc సభ్యునిగా చర్చల్లో  ప్రో" శేషయ్య సార్ ని చూసాను. 

శే‌షయ్యసార్ నాయకుడుగా ఎంతో హుందాగా వ్యవహరిస్తూ, ఓపికతో ఉండేవారు. సార్ నిత్యశోదకునిగా ఎప్పుడూ చదువుతూ, రాస్తూ ఉండేవారు. సార్ ని  కలసినా, చూసినా గౌరవబావం కలిగేది. సార్ కూడా అలాగే చాలా సింపుల్ గా ,కార్యకర్తలతో కలసిపోయేవారు.  సార్ ఉద్యమ బాద్యతలు నిర్వహిస్తూ, ఎక్కడ నిజనిర్ధారణ జరుగుతున్నా హజరౌతూ అక్కడ ఎలా వ్యవహరించాలో కార్యకర్తలకు, నాయకులకు వివరించేవారు. సార్ వేరే ప్రాంతానికి వెళ్ళినపుడు అక్కడ కార్యకర్తల కుటుంబాలతో కలసిపోయేవారు. ఎలా ఉన్నా సర్దుకుపోయేవారు సార్. పొగ త్రాగడం బాధను కలగించేదీ.  అది అడిగినపుడు సార్ నవ్వే సమాధానంగా ఉండేది.

 ఎక్కుడ ప్రజల హక్కుల ఉల్లంఘనలు  జరిగినా ఎంతో ఆవేదన చెందేవారు. హక్కల కార్యకర్తలు ప్రజలని చైతన్య పరచేపని చేయాలని ప్రజలు చైతన్యమైతేనే సమస్యలు పరిష్కారం  అవుతాయి అని గట్టిగా చెప్పేవారు. సార్ హక్కుల  కార్యకర్తలు పనితోపాటు చదవటం, రాయటం చేయాలని చెప్ఫెవారు. దాని కోసం క్లాస్ లు జరపి ఎడ్యుకేట్ అవ్వాలని కోరుకునేవారు. సార్ పత్రికలలో ఎదైనా మంచి ఆర్టికల్స్ వస్తే అవి అందరూ చదవాలని  సమాచారం ఇచ్చేవారు.

 - శ్రీధర్

Comments