నినదించిన హక్కుల బావుటా | ఎన్. నారాయణ రావు


బుద్ధి జీవి గా ఉంటూనే కార్యకర్తల కార్యాచరణతో కాకలు తీరిన యోధుడిగా మారుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లో తెలంగాణ ఆంధ్ర తెలుగు రాష్ట్రాలుగా విడిపోయాక కూడా నాలుగు దశాబ్దాలుగా హక్కుల ఉద్యమానికి దిక్సూచి గా పనిచేసిన వారు ప్రొఫెసర్ శేషయ్య.  గత దశాబ్ద కాలంగా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న అప్పటికీ మనిషిని కోల్పోతామని ఆలోచన ఎవరికీ రాలేదు. కానీ ఈసారి అక్టోబర్ 10 20 20 అనారోగ్యం మనిషినే కదిలించివేసింది. రాజ్యం కొత్త తరహా నిర్భందా లను అమలు  చేస్తున్న స్థితిలో ప్రొఫెసర్ శేషయ్య గారు లేకపోవడం హక్కుల ఉద్యమానికి తీరని లోటుగా మనందరం భావించాల్సి ఉంది. 73 ఏర్పడిన సంఘం ఎన్కౌంటర్ హత్యలను రాజ్యహింసను వ్యతిరేకిస్తూ నేటికీ సంస్థను దాని ఆచరణ చివరివరకు కొనసాగించిన హక్కుల మేధావి.  గోపి అన్న తో మొదలైన రాజ్యం హత్యాకాండ అజం వరకు విడవకుండా కొనసాగింది.

 రాజ్యహింస రూపం మార్చుకుని అనేక పేర్లతో కొనసాగింది.  ఆ కొనసాగుంపులో భాగంగానే  ప్రొఫెసర్ శేషయ్య  ఇంటిపై దాడి చేసారు.  కారు దగ్ధం చేసారు.  నిర్భందం తీవ్రమైనా అఖిలభారత స్థాయిలో రెపరెపలాడిన వ్యక్తి ప్రొఫెసర్ శేషయ్య.  2007లో  అఖిలభారత స్థాయిలో ఏర్పడిన ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థ సి డి ఆర్ ఓ కన్నా ముందే దేశంలోని వివిధ హక్కుల సంఘాలతో కలిసి ఒక ఐక్యవేదిక రూపంలో రాజ్యం అనిచివేత వ్యతిరేకంగా పోరాడారు.  కాశ్మీర్ కల్లోలం పై,  మణిపూర్ నిర్బంధం పై గుజరాత్ మారణకాండపై నిజ నిర్ధారణలు
 చేసి నివేదికల రూపంలో ప్రజలకు వాస్తవాలు తెలియ చేయడానికి శాయశక్తులా కృషి చేసిన వారు. తర్వాత  అక్టోబర్ 2007లో సి డి ఆర్ ఓ సంస్థను ఏర్పాటు చేయడంలో కీలకమైన పాత్రను నిర్వర్తించారు. అఖిల భారత స్థాయిలో ఏర్పాటు చేసుకున్న హక్కుల సంఘాల ఐక్యవేదిక సి డి ఆర్ వో దేశవ్యాప్తంగా ఆదివాసీలపై, దళితులపై, మైనారిటీలపై, మహిళలపై జరిగిన రాజ్య హింసకు వ్యతిరేకంగా నేటికి క్రియాశీలకంగా పని చేస్తూ వస్తున్నది.

వాస్తవాలు ప్రజలకు దగ్గరగా వెళుతున్నాయని,  అందుకు నచ్చని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 2017 లో అనేక సాకులు చూపి నిజ నిర్ధారణలు జరపకుండా  ఛత్తీస్గఢ్ బీజాపూర్లో అడ్డుపడింది.  2009లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో మిలిటరీ ఆపరేషన్ను నిలువరించడానికి 52 ప్రజా సంఘాలతో ఏర్పడిన ఆపరేషన్ గ్రీన్హంట్ వ్యతిరేక కమిటీని ఏర్పాటు చేసుకోవడం శేషయ్య చోరవతోనే జరిగింది. 
 
గ్రీన్హంట్ పేరుతో ఆదివాసుల ఊచకోత నిరంతరం సాగుతున్న కాలంలో అనేక కష్టాలు వచ్చినా  హక్కుల ఉద్యమ కార్యచరణను కొనసాగించడంలో ప్రధాన భూమికను నిర్వహించారు. దానిలో భాగంగానే గడ్చిరోలి ఎన్ కౌంటర్ పై నిజాలు బయటకు రాలేదు.  క్రియాశీలకంగా పనిచేస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్గా పనిచేశారు. ప్రజాస్వేచ్ఛ సంపాదకత్వ బాధ్యతలను విజయవంతంగా నిర్వహించగలిగారు.1985లో మొదలైన రాజ్య నిర్బంధం హత్యాకాండతో కొనసాగి విలువైన హక్కుల నేతలను సంస్థ కోల్పోయింది. 90 లోకి వచ్చేసరికి మూడు నెలల వ్యవధిలో పురుషోత్తం కోల్పోవడం సంస్థకు కష్టంగా మారింది.  అంతేకాక అంతటా కొనసాగిన బెదిరింపులకు చాలా మంది కార్యకర్తలు భయపడ్డారు. అయినా వారిని  ధైర్యవంతులైన హక్కుల కార్యకర్తల గా ఆయన మార్చారు. హక్కుల ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లారు.  సంస్థ పై నెగటివ్ ప్రచారం రాజ్యమే   వివిధ సంస్థలతో చేయిస్తుందని చెప్పాడు. ఆయన శక్తిని కూడదీసుకుని ఒక అడుగు ముందుకు వేస్తూ దేశంలోనే ఒక బలమైన హక్కుల సంఘంగా సంస్థను మలిచారు.
 
 సైకిల్ తో ప్రారంభమైన అతని కార్యాచరణ అనేక రాష్ట్రాల్లో కి, దేశ రాజధానిలో కి విస్తరించింది. సంస్థ  ప్రజాతంత్ర ఉద్యమాలతో పాటు కొనసాగుతుందని ఆ పోరాటాల అకంక్షలను బలపరుస్తుందని చెప్పారు.  హక్కులు సాధించుకుంటామని పదేపదే  ప్రకటించిన మేధావి. 2018లో బీమా కోరేగవ్  కేసును కుట్రపూరితంగా తయారుచేసి దేశంలోని ప్రశ్నించే గొంతులను జైల్లో నిర్బంధించారు. ఆ విధానం పూర్తిగా అప్రజాస్వామిక మైనదిగా ప్రజలకు గొంతెత్తి వినిపించాడు.  ప్రజలకు నిజాలు తెలియకుండా చేస్తే, వాటిని ఎలా తెలియచె ప్పాలో కార్యకర్తలకు నేర్పించాడు.

ప్రజలను పోరాటం వైపు నెట్టివేస్తుంది. ప్రభుత్వ అధికారం, బలం ఎప్పటికీ శాశ్వతం కాదు.  అది నిరూపించడానికి ప్రయత్నిస్తానని చెప్పిన  వ్యక్తి. ప్రజా న్యాయవాదులు ప్రజల వైపు మాత్రమే మాట్లాడాలని కోరుకునే వ్యక్తి. ప్రజలను తప్పుడు కేసుల్లో,  వారికి సంబంధం లేని కేసుల్లో ప్రభుత్వం  ముద్దాయిలుగా చేస్తోంది. వారి వైపు నిలిచి న్యాయవాదులు పోరాడాలని పిలుపు ఇచ్చిన మేధావి.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ దమననీతిని తీవ్రంగా ఖండించిన మేధావి. ప్రజాస్వామికంగా ఉండాల్సిన స్థితిలో అనేక పరిమితులు విధిస్తే ప్రజలు అనివార్యంగా పోరాటం వైపు నెట్టబడతరని విశ్లేషించిన మేధావి. 

 అసలు దోషులను రక్షించడం కోసం  ప్రజా హక్కుల నేతలపై చట్టం నిర్బంధం కొనసాగిస్తుందని చెప్పాడు. ప్రజా విజయాలను ఆశిస్తూ  అప్రతిహతంగా   హక్కుల కోసం పోరా డిన యోధుడు. నల్లచట్టమైన ఉపా చట్టం రద్దు చేయాలని  ఐక్య ఉద్యమాలు నిర్వహించాడు. ఉరిశిక్షకు వ్యతిరేకంగా,  చట్ట ఉల్లంఘనకు వ్యతిరేకంగా,  రాయలసీమ ఫ్యాక్షనిజం లో నలిగిపోతున్న ప్రజల జీవితాలకు మద్దతుగా అనేక రచనలు, పోరాటాలు చేశాడు.

బుద్ధిజీవిగా హక్కుల ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి తన వంతు బాధ్యతను నిర్వర్తించాడు. ఆయన ఆశయాల సాధన కోసం హక్కుల సంఘాన్ని బలోపేతం చేయడమే కార్యకర్తల ముందున్న భవిష్యత్తు కార్యాచరణ.
 

Comments