*పత్రికా ప్రకటన*
"పీడిత ప్రజల హక్కులకోసం పోరాడిన యోధుడు ప్రొ: శేషయ్య"
ది.21-10-20 బుధవారం అమలాపురంలో ని బుధవిహార్ నందు ప్రొ: శేషయ్య సంతాప సభ జరిగింది. నలభై సంవత్సరాలుగా పౌరహక్కుల ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన యోధుడు తన తుదిశ్వాస వరకు హక్కుల ఉద్యమంలో ఉన్నారని,ఇది పౌరహక్కుల ఉద్యమానికి తీరనిలోటు అని రాష్ట్ర అధ్యక్షులు వి. చిట్టిబాబు అన్నారు. సంతాపసభకు పలు ప్రజాసంఘాల నాయకులు హాజరై తమ సంతాపం ప్రకటించారు.
ప్రొ.శేషయ్య కుటుంబానికి సంతాపం తెలుపుతూ, అదేవిధంగా జీవిత ఖైదు అనుభవిస్తూ జైలు ఖైదీల హక్కులకోసం నిరాహారదీక్ష మొదలు పెట్టిన ప్రొ. G n సాయిబాబా ను పెరోల్ పై విడుదలచేయలని సభ తీర్మానించింది.
సభలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. చిట్టిబాబు,తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు ఓగురి బాలాజీ, అమలదాసు బాబురావు, ప్రధాన కార్య దర్శి జిల్లెళ్ల మనోహర్, మానవహక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి ఏడిద రాజేష్, pdsu ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు,ap రైతుకూలీ సంఘం కొండా దుర్గారావు, మచ్చ నాగయ్య, kvps నాయకుడు p. వసంతకుమార్,దళిత ఐక్య వేదిక కన్వీనర్ జాంగా బాబురావు తదితరులు హాజరయ్యారు. సభకు అధ్యక్షత ఓగురి బలజీరావు వహించారు
Comments
Post a Comment