రామాజిపేట దళితుల దాడిపై పౌర హక్కుల సంఘం తెలంగాణ నిజానిర్దారణ
రామాజిపేట గ్రామం, ఇల్లంతకుంట మండలం ,రాజన్న సిరిసిల్ల జిల్లా ,తెలంగాణ రాష్ట్రం లో,దసరా రోజు ఆదివారం నిన్న రాత్రి 25 అక్టోబర్,2020న RSS/BJP జిల్లా నాయకుల అండతో రామాజిపేట మహిళ సర్పంచ్ భర్త మొండెయ్య ఆద్వర్యం లో అతని వర్గానికి చెందిన RSS/BJP గూండాలు, దళిత వాడపై దాడిచేసి దళితుల ఇండ్లను కిరాణం షాప్ లు మోటార్ సైకిళ్లు ధ్వంసం చేసి,10 మందిని తీవ్రంగా గాయపర్చి, తలలు పగులగొట్టినారు.ఉప సర్పంచ్ బెజ్జంకి శ్రీనివాస్ ను తీవ్రంగా కొట్టినారు.మొత్తం దళిత ప్రజలు,మహిళలు, పిల్లలు, ఆ దాడినుంచి తప్పించుకోవడానికి సమీపం లోని పొలాల్లో తలదాచుకొన్నారు.దాడిలో గాయపడి, సిరిసిల్ల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పౌర హక్కుల సంఘం,తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం, దళిత లిబరేషన్ ఫ్రంట్ నాయకులు కల్సి మాట్లాడి రామాజిపేట దళిత వాడలో దాడికి గురైన వారిని కల్సి సేకరించిన నిజానిర్దారణ వివరాలు.
1.ఈదుల మధు తల పగిలి 10 కుట్లు పడినాయి.
2.ఈదుల మధుతండ్రి బాలయ్య తలకు10 కుట్లు.
3.తడ్కపెళ్లి మురళి కాలు విరిగింది.
4.బెంజంకి పోచయ్య తుంటి తీవ్రంగా గాయమైనది,
5.బెంజంకి నర్సవ్వ కుడిభుజం వాచింది, లోతుగాయమైంది.
ఐదు సంవత్సరాల క్రితం నుండి ఆ గ్రామంకూడలిలో అంబేడ్కర్ విగ్రహం పెట్టడానికి,దళిత ప్రజలు కృషిచేస్తుంటే,ముది రాజ్ సామాజిక వర్గానికి చెందిన యువకులు,RSS/BJP అండతో ప్రజలు తీవంగా అడ్డుకొని,ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టాలని అంబెడ్కర్ విగ్రహాన్ని అడ్డుకున్నారు. నిన్నరాత్రి, దళితవాడలోఉపసర్పంచ్ బెజ్జంకి శ్రీనివాస్ ఇంటి ముందు సౌండ్ బాక్స్ పెట్టుకొని పండగ జరుపుకుంటున్న సందర్భంలో ఆ గ్రామ మహిళ సర్పంచ్ భర్త మొండెయ్య, శ్రీనివాసును హెచ్చరించి, సౌండ్ బాక్స్ ను ఆపివేయాలని చెప్పి,సుమారు100 మంది తమ RSS/BJP వారిని పిలిపించి రాత్రి11:30 నుండి2 గంటల వరకు సుమురు 2 1/2 గంటల విధ్వంసం చేసినారు...
ఈ దాడికి పాల్పడిన వారిపై IPC,307 మరియు SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి.
దాడికి కుట్రకు కారకులైన సిరిసిల్ల జిల్లా RSS/BJP నాయకులపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి..
TRS ప్రభుత్వం వెంటనే స్పందించి,గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారికి ఇరవై లక్షలు నష్ట పరిహారం,గాయపడ్డవారికి లక్షలు మరియు వాహనాలు పశువులు గాయపడ్డవారికి,5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.....
నిజానిర్దారణ లో పాల్గొన్న వారు.
1మాదనకుమారస్వామి ,రాష్ట్రసహాయకార్యదర్శి. పౌరహక్కుల సంఘం తెలంగాణ.
2.ఏనుగు మల్లారెడ్డి,ప్రధానకార్యదర్శి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం ,
3పొగుల రాజేశం,E. C. మెంబర్,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
4. కడ రాజయ్య, E. C.మెంబర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం,
5.మోట పలుకుల వెంకట్,E. C.మెంబర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం,
6.మార్వాడి సుదర్శన్ రాష్ట్ర ప్రదానకార్యదర్శి దళితలిబరేషన్ ఫ్రంట్..
7.రవివర్మ. ఉపాధ్యక్షుడు,దళితలిబరేషన్ ఫ్రంట్..
8.బండ నాంపెల్లి. సిరిసిల్ల జిల్లా SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటి.
Comments
Post a Comment