ప్రగతిశీల రాజకీయాల్లో ప్రొఫెసరు శేషయ్య గారు చురుకుగా పాలుపంచుకున్నారు.
పౌర హక్కుల కార్యకర్త, ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ (సిఎల్‌సి), తెలంగాణ సివిల్ లిబర్టీస్ కమిటీ సమన్వయ కమిటీ (సిఎల్‌సి) కన్వీనరు ఎస్. శేషయ్య గారికి, చిత్తూరు జిల్లా కమిటి శ్రీకాళహస్తిలో సంతాపం తెలిపింది. శేషయ్య ఇటీవల కోవిడ్ -19 తో బాధపడ్డారు. అనంతపురంలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. తర్వాత, గత వారం హైదరాబాదులోని ఆసుపుత్రిలో అతన్ని చేర్పించారు. శనివారం(10.10.20) రాత్రి 8.30 గంటలకు ఆయన మరణించారు.
నాలుగు దశాబ్దాలుగా, శేషయ్య ప్రగతిశీల రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఒక వామపక్ష సామాజిక కార్యకర్తగా, త పౌర హక్కుల రంగంలో AP సివిల్ లిబర్టీస్ కమిటీ (APCLC) యొక్క కార్యనిర్వాహకుడిగా విశేష సేవలు అందించారు. అనంతపూర్ లోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అనేక దశాబ్దాలుగా న్యాయశాస్త్రం బోధించారు. శేషయ్యగారు 1998 లో హక్కలు ఉద్యమం సైద్ధాంతిక సంక్షోభం ఎదుర్కుంటున్న సమయంలో ఎపిసిఎల్‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యారు.
APCLC ప్రముఖ నాయకులు టి. పురుషోత్తం, అజం అలీలను వెంటవెంటనే ప్రభుత్వ కిరాయి హంతక ముఠాలు చంపాయి. హైదరాబాదులో నవంబర్ 23, 2000న పురుషోత్తంను చంపేశారు. అలాగే 18 ఫిబ్రవరి, 2001 న నల్గొండలో గ్రీన్ టైగర్సు పేరుతో ఆజంను చంపారు. శేషయ్యగారు కూడా పలుమార్లు ప్రభుత్వ ముఠాలచే బెదిరింపులకు గురయ్యారు. నవంబర్ 11, 2005 రాత్రి అతని ఇంటిపై ప్రభుత్వం ఉసిగొల్పిన దుండగులు దాడి చేశారు. అతని కారును తగలబెట్టారు. ఈ పని మేమే చేశామని రాయలసీమ టైగర్సు అనే సంస్ధ ప్రకటించుకుంది.
చిత్తూరు జిల్లా కమిటీ 11.10.20వ తేదీ కాళహస్తిలో శేషయ్యగారికి నివాళులు అర్పించింది. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కృష్ణయ్య, కార్యవర్గ సభ్యుడు రఫి, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా నుండి క్రాంతిచైతన్య, కొంతమంది కార్యకర్తలు అనంతపురంలో జరిగిన శేషయ్యగారి అంత్యక్రియలకు హాజరయ్యారు.
Comments
Post a Comment