ప్రొఫెసర్ శేషయ్య సంస్మరణ సభ (కరీంనగర్ జిల్లా)


.రాజ్యహింసకు వ్యతిరేకంగా,పీడిత ప్రజల పక్షాన చివరి శ్వాస వరకు అండగా నిలిచిన పోరాట యోధుడు పౌర హక్కుల నాయకులు ప్రొఫెసర్ శేషయ్య.

పౌర హక్కుల నాయకులు ప్రొఫెసర్ శేషయ్య సంస్మరణ సభ..
IFTU ఆఫీసు, గోదావరిఖని, 
ఉదయం,11 గంటలు,మంగళవారం.
13,అక్టోబర్,2020.....

నాలుగు దశాబ్దాల పౌర హక్కుల ఉద్యమనాయకులు, ప్రొఫెసర్ సేపూరి శేషయ్య గారు, కన్వీనర్,కో ఆర్డినేషన్ కమిటీ పౌర హక్కుల సంఘం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు, గత నెల 24 సెప్టెంబర్,2020 న తన స్వస్థలం అనంతపురం లో కరోనా కు గురై తీవ్ర అనారోగ్యంతో 10,అక్టోబర్,2020 శనివారం రాత్రి 8:30 గంటలకు హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించినారు.పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయన సంస్మరణ సభ ఈ రోజు మంగళవారం(13అక్టోబర్,2020) ఉదయం11 గంటలకు, గోదావరిఖని లోని చౌరస్తా కు దగ్గరలోని IFTU ఆఫీసునందు నిర్వహించారు.

రాజ్యహింసకు వ్యతిరేకంగా,పీడిత ప్రజల పక్షాన చివరి శ్వాస వరకు అండగా నిలిచిన పోరాట యోధుడు ప్రొఫెసర్ శేషయ్య. గారని వక్తలు ఈ సందర్భంగా కొనియాడి నివాళులు అర్పించారు.
 పౌర హక్కుల కోసం పీడిత ప్రజలకు అండగా విద్యార్థి దశనుండి నాలుగు దశాబ్దాలుగా భారత దేశవ్యాప్తంగా, హక్కులకోసం నిరంతరం పనిచేసినాడని,పౌర హక్కుల కోసం పనిచేస్తున్న సందర్భంలో ఉమ్మడి అంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలకుల ప్రోద్బలంతో ,నయీమ్ ముఠా, నల్లదండు ముఠా,రాయలసీమ టైగర్స్ పేరున శేషయ్య గారి అనంతపురం ఇంటిపై దాడులు,కార్ తగులబెట్టడం,  బెదిరింపులు,హెచ్చరికలు ఎదుర్కొని దైర్యంగా పౌర హక్కుల కోసం పనిచేసినాడు.

 ప్రొఫెసర్ శేషయ్య గారు .RSU విద్యార్థి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా,లా కాలేజ్ ప్రొఫెసర్ గా,లా కాలేజ్ ప్రిన్సిపాల్,కృష్ణదేవరాయ యూనివర్సిటీ డీన్ గా పనిచేసి 2016 న వృత్తి నుండి రిటైర్మెంట్ తీసుకున్నాడు..2005 సంవత్సరములో దేశవ్యాప్తంగా  జాతీయ ప్రజాస్వామిక పౌర హక్కుల సంఘాల సమన్వయ వేదిక(CDRO)కోసం ప్రధాన భూమిక పోషించి, వ్యవస్థాపక( CDRO)కన్వీనర్ గా ప్రొఫెసర్ శేషయ్య గారు పనిచేసినాడు.... ప్రజాస్వామిక వాదులకు, పీడిత ప్రజలకు ..ఆయన లేని లోటు ఏర్పడుతుందని పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. కావున ఆలోటును పూరించడానికి మనవంతుగా చిత్త శుద్ధితో, నిజాయితీగా సమాజంకోసం పాటుపడడమే, శేషయ్య గారికి అర్పించే నిజమైన నివాళి అని వక్తలు అన్నారు.

ప్రొఫెసర్ శేషయ్య సంస్మరణలో పాల్గొన్న వారు

1మాదన కుమారస్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పౌర హక్కుల సంఘం తెలంగాణ.

2.GAV ప్రసాద్,అధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.

3.ఏనుగు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.

4.శ్రీపతి రాజగోపాల్, ఉపాధ్యక్షుడు,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటి.
5.పుల్ల సుచరిత,సహాయ కార్యదర్శి పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటి.
6 EC మెంబర్లుపౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటి
...నార వినోద్,పొగులరాజేశం, కడరాజన్న,
బొడ్డుపెల్లి రవి,యాదవనేని పర్వతాలు,మోటపలుకుల వెంకట్.

7.బాలసాని రాజయ్య, కన్వీనర్, విరసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటి.

9.IFTU నాయకులు, I. కృష్ణ, నరేష్,

10.IFTU, నాయకులు, కె.విశ్వనాథం.

11.రైతు సంఘం నాయకులు, ముదిమడుగుల మల్లన్న,ఎరుకల రాజన్న...

12.ఏలేశ్వరం వెంకటేశ్వర్లు..స్నేహ సాహితీ గ్రంధాలయం.
13.మాదాసి రామమూర్తి... సింగరేణి jac కో కన్వీనర్, సీనియర్ జర్నలిస్ట్.....

Comments