హక్కుల నేత,న్యాయవాది ప్రొఫెసర్ S. శేషయ్య గొప్ప హక్కులఉద్యమ సిద్ధాంత కర్త:
ది20.10.2020న లైఫ్ ప్రిన్సిపాల్,హైకోర్టు న్యాయవాది నంబూరి. శ్రీమన్నారాయణ ఆన్లైన్ లో న్యాయవాది ప్రొఫెసర్ శేషయ్య గారి "సంతాప సభ " నిర్వహించటం జరిగినది. ఈ సంతాప సభలో AP, TS పౌర హక్కుల సంఘం CLC రాష్ట్ర ప్రధాన కార్యదర్సులు చిలుకా చంద్ర శేఖర్, నక్కా నారాయణ రావు లు ప్రధాన వక్తలు గా పాల్గొని, ప్రసంగించినారు. వారు ప్రొఫెసర్ శేషుయ్య గొప్ప హక్కుల ఉద్యమ సిద్ధాంత కర్త గా అభివర్ణించారు. పౌరుడు హక్కులు లేకుండా జీవించడం సాధ్యం కాదని హక్కులను ఉల్లంఘించే రాజ్యాన్ని ,రాజ్యం యొక్క ఆధిపత్య శక్తుల ఆరాచకాలని ప్రశ్నించటం, నిలదీయటం ద్వారా పౌర హక్కులను రక్షించు కోవడం సాధ్యం అవుతుంది అని ప్రొఫెసర్ శేషయ్య ఆచరణ తో చెప్పే వారని అన్నారు. రాజ్య హింస కు వ్యతిరేకంగా జరిగే పోరాటం లో ముందు ఉండేవారని అన్నారు. పౌర హక్కుల సంఘం సంస్థ గత చర్చ లో ఉదారవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని అన్నారు.ఉద్యమ కారుల పై జరిగే రాజ్య హింస కి వ్యతిరేకంగా బలంగా పోరాడే వారని అన్నారు. ఆయన ఆశయాలు సమాజ మార్పునకు ఉపయోగకరమైనవి అన్నారు. వాటి కోసం ప్రజలు పని చెయ్యాలని పిలుపునిచ్చారు.
పౌర హక్కుల సంఘం AP రాష్ట్ర సహాయ కార్యదర్శి చీమల పెంట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ లా ప్రొఫెసర్ గ ప్రొఫెసర్ శేషయ్య గారు తన విధి ని సమర్ధవంతంగా నిర్వహించారు అని అన్నారు లా సెట్ కన్వీనర్ గా 2సార్లు భాద్యత నిర్వహించారు అని తెలిపినారు.ఆయన మంచి విలువలు ఉన్న వ్యక్తి అన్నారు.ఆయన మరణానికి జొహార్లు తెలిపినారు
లైఫ్ (లాయర్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్) ప్రిన్సిపాల్,హైకోర్టు న్యాయవాది నంబూరి. శ్రీమన్నారాయణ మాట్లాడుతూ న్యాయవాది, హక్కుల మేధావి ప్రొఫెసర్ శేషయ్య గార్కి రాజ్యాంగం పై మంచిపట్టు ఉందని అన్నారు.ఆయన లాయర్ల కు లైఫ్ నిర్వహించిన క్లాస్ లలో చాలా చక్కగా క్లాసులు భోధించారని గుర్తు చేసుకున్నారు. చట్ట పరమైన, రాజ్యాంగ పరమైన హక్కుల కోసం తీవ్రంగా కృషి చేశారు అని అన్నారు. పౌరులు జీవించే హక్కులు కోసం ఆయన విస్తృతంగా ఉద్యమాలు నిర్వహించారు అని అన్నారు. ఒక మనిషిని కోర్ట్ లు తప్ప పోలిసులు సహితం చంపే హక్కు చట్టం ఇవ్వలేదని గట్టి గా వాదించేవారు అన్నారు. బూటకపు ఎన్కౌంటర్లు పై సంస్థ తరపున సుప్రీం కోర్టు వరకు వెళ్లి పోరాడి నారు అన్నారు. ఆయనకు నివాళి అర్పించారు.
ఈ ఆన్లైన్ సంతాప సభ ఆయనకు ఘనంగా జోహార్లు అర్పించింది.
- నంబూరి. శ్రీమన్నారాయణ
హైకోర్టు అడ్వకేట్,
ఆన్లైన్ క్లాస్ ప్రిన్సిపాల్.
లాయర్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్. (లైఫ్).
Comments
Post a Comment