కొవ్వూరుల, నందమూరు ప్రాంతాలలో దెబ్బతిన్న పంట పొలాలు,రోడ్లు ను పరిశీలిస్తున్న సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, ఐఎఫ్టియు పి డి ఎస్ యు పి ఓ డబ్ల్యూ పౌరహక్కుల సంఘం బృందం పర్యటించింది.
ఈ సందర్భంగా ఈ బృందానికి నేతృత్వం వహించిన పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ తుఫానుల వలన వరి పొలాలు, బొప్పాయి, అరటి, క్యాబేజీ, తదితర పంటలు నీట మునిగి తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదనచెందారు. చిన్న సన్నకారు మధ్యతరగతి రైతాంగం పంటలు చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలు రావటం వలన ఆర్థికంగా దెబ్బ తిన్నారు అని వాపోయారు పంటలు నష్టం వలన నష్టపోయిన రైతాంగానికి పూర్తి పంట నష్ట పరిహారాన్ని ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామికవేత్తలకు రుణాలు మాఫీ చేయడం కాదని నష్టపోయిన రైతాంగాన్ని పూర్తిగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సమాజంలో ఉన్నటువంటి రైతులకు ఆర్థిక చేయూత ఇచ్చి నిలపెట్టక పోతే సమాజంలో ప్రజలకు ఆహారం లభించదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులందరికీ పంట నష్టపరిహారం పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు చీర అప్పారావు మాట్లాడుతు బడా పెట్టుబడిదారులకు ఆర్థిక చేయూత చేస్తున్నటువంటి ప్రభుత్వాలు రైతులను ఆదుకోవటంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పచ్చని పంటలు దెబ్బతిన్న రైతాంగానికి బ్యాంకుల్లో రుణలు రద్దుచేసి వడ్డీలేని రుణాలను పంటలు వేసుకోవటానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పి డి ఎస్ యు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంబూరి మహర్షి మాట్లాడుతూ సమాజానికి రైతే వెన్నెముక అని ఊదరగొట్టే ఉపన్యాసాలు కాదని రైతు ఆపదలో ఉన్నప్పుడు యుద్ధప్రాతిపదికన ప్రభుత్వాలు స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆపదలో ఉన్న రైతులకు ఆర్ధిక చేయూత ఇచ్చి వారిని ఆదుకోవడం అంటే సమాజాన్ని ఆదుకోవడమే అన్నారు. ఐ ఎఫ్ టి యు నాయకులు ఎం రాజు మాట్లాడుతూ శ్రమ చేసే రైతులను రైతు కూలీలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతులు రైతు కూలీలు పంటలు దెబ్బతినడం వలన ఆదాయం లేక అల్లాడిపోతున్న వారికి తక్షణం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించి ప్రభుత్వాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బృందం పట్టణం లోను, పరిసర గ్రామాల్లోని రోడ్స్ ని పరిశీలించింది. రోడ్లు బాగా దెబ్బ తిన్నాయి అని బృందం సభ్యులు పేర్కొన్నారు.తక్షణం దెబ్బతిన్న రోడ్లు ని పునరుద్ధరించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థికంగా దెబ్బతిన్న ఆంద్రప్రదేశ్ ని ఆదుకోవాలి కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ బృందం తీర్మానించింది.
-నంబూరి. శ్రీమన్నారాయణ
రాష్ట్ర ఉపాధ్యక్షులు
పౌర హక్కుల సంఘం CLC
Comments
Post a Comment